- Home
- Entertainment
- Guppedantha Manasu: కొడుకుకు కొత్త బట్టలు తెచ్చిన జగతి.. ఇవే చివరి నవ్వులు అంటూ దేవయాని షాకింగ్ ప్లాన్ !
Guppedantha Manasu: కొడుకుకు కొత్త బట్టలు తెచ్చిన జగతి.. ఇవే చివరి నవ్వులు అంటూ దేవయాని షాకింగ్ ప్లాన్ !
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

స్టోర్ రూమ్ లో వసు (Vasu) కు చిన్న పుల్ల గుచ్చుకోవడంతో ఇది తీయడానికి ఒక్కటే మార్గం సేఫ్టీ పిన్ అని అంటుంది. అలా సేఫ్టీ పిన్, గుండుసూదులు ఉన్నాయా అని రిషిని (Rishi) అడగడంతో రిషి వెటకారంగా సమాధానం ఇస్తాడు. మొత్తానికి తన నోటితో ఆ పుల్లను తీసి తన నొప్పికి ఉపశమనం కలిగిస్తాడు.
అంతలోనే గౌతమ్ (Gautham) వచ్చి ఈ చీకటి గదిలో ఏం చేస్తున్నారు అని అంటాడు. దాంతో రిషి వెటకారంగా సమాధానం ఇచ్చి పాత చెక్కలను తీసుకొని రమ్మంటాడు. ఇక గౌతమ్ వసు ముందు మార్కులు కొట్టడానికి పాత చెక్కలను తీసుకొని వస్తాడు. మహేంద్ర వర్మ (Mahendra Varma) గౌతమ్ పనితీరుని మెచ్చుకుంటాడు.
మరోవైపు దేవయాని (Devayani) ధరణిను తన వైపు ఉండమని గట్టిగా హెచ్చరిస్తుంది. మహేంద్ర వర్మ సైకిల్ పోటీలో ఎవరు గెలిచారు అని అనటంతో వెంటనే గౌతమ్ ఓవర్ గా సమాధానం ఇస్తాడు. దాంతో తానే ఓడిపోయాడని తెలుస్తుంది. ఇక ఉదయాన్నే రిషి (Rishi) డోర్ లకు పూల తోరణాలు కడతాడు.
అంతలోనే ఒక పూలదండ వసు (Vasu) మెడలో పడుతుంది. ఇక్కడ కాసేపు సీన్ రొమాంటిక్ గా కనిపిస్తుంది. మరోవైపు జగతి, మహేంద్ర వర్మ తోరణాలు కడుతూ ఉంటారు. గౌతమ్ (Gautham) ధరణి ను హెల్ప్ చేయమని అంటాడు. తన దగ్గర ఉన్న పువ్వులు వసు మీద పడేలా చేయమని అంటాడు.
ఇక అదే సమయంలో అక్కడికి దేవయాని (Devayani) వస్తుంది. చేయి తగలడంతో ఆ పువ్వులు జగతి వాళ్ళపై పడతాయి. ఇక జగతి (Jagathi), మహేంద్రవర్మ అది చూసి ఆనందంగా ఫీల్ అవుతారు. దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందరూ ఒక దగ్గరకు చేరుకొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
అందరూ ఒక దగ్గర కూర్చొని స్వీట్స్ తింటారు. తరువాయి భాగం లో వసు (Vasu) అందాన్ని రిషి, గౌతమ్ పొగుడుతారు. ఇక జగతి (Jagathi) రిషి కోసం కొత్త బట్టలు తెచ్చానని వసుతో చెబుతుంది. అది విన్న దేవయాని ఇదే సమయంను ఆసరాగా తీసుకొని ముగింపు పలుకు చేసేలా చేస్తానని అనుకుంటుంది.