- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. తండ్రి మాటలకి నివ్వెరపోయిన పాండ్యన్ !
Guppedantha Manasu: వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. తండ్రి మాటలకి నివ్వెరపోయిన పాండ్యన్ !
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తనకి సాయం చేసిన వాళ్లకి సాయం చేయటం కోసం నడుం బిగించిన ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వసు ఎక్కడ ఉన్నది.. ఏ కాలేజీలో పని చేస్తుంది అన్ని వివరాలు కనుక్కొని మహేంద్ర కి చెప్తాడు అతని ఫ్రెండ్. నేను అక్కడికి వెళ్లి అన్ని వివరాలు కనుక్కొని వస్తాను వీలైతే రిషి ని కూడా తీసుకు వస్తాను అంటాడు మహేంద్ర. ఎప్పుడు వెళ్తావు అంటాడు ఫ్రెండ్. ఈరోజే వెళ్తాను మహేంద్ర. నేను కూడా తోడుగా వస్తాను అంటాడు ఫ్రెండ్.
వద్దురా నేనే వెళ్లి అన్ని విషయాలు తెలుసుకొని వస్తాను అంటాడు మహేంద్ర. ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్రెండ్. నేను కూడా వస్తాను నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది అంటుంది జగతి. అక్కర్లేదు..అసలు ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం నువ్వే. నువ్వు నాతో వస్తే నీతో పాటు నాతో కూడా మాట్లాడడం మానేస్తారు వాళ్లు.
కాదు.. కూడదు అని నాతో రావటానికి ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. బాధపడకండి అత్తయ్య అని ఓదార్చుతుంది ధరణి. బాధ కాదు వసుధర ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయంగా ఉంది అంటుంది జగతి. ఏమీ జరగదు అత్తయ్య అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి.
సీన్ కట్ చేస్తే రిషి వెనకాలే వస్తుంది వసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు రిషి. మీరే వచ్చారు అంటుంది వసు. నీకోసం మాత్రం కాదు.. నా జీవితంలో నన్ను మోసం చేసిన వాళ్లతో పాటు ఏ సంబంధం లేకపోయినా నాకు సాయం చేసిన వాళ్లు కూడా ఉన్నారు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అందుకే వచ్చాను. లెక్చరర్ గా నీ పని నువ్వు చూసుకో పాత జ్ఞాపకాలు ఏవి గుర్తు చేయకు ఇప్పుడు రిషి ఒక సామాన్యుడు.
అలా కాకుండా గతాన్ని తవ్వాలని చూస్తే ఏం జరుగుతుందో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మనం మళ్లీ ఇలా కలిసాము అంటే మళ్ళీ మన బంధం మొదలవుతుంది. మళ్లీ మనం రిషిధార గా మారబోతున్నాము నాకు ఆ నమ్మకం ఉంది అనుకుంటుంది వసు. మరోవైపు కేడి బ్యాచ్ రిషిని ఇన్సల్ట్ చేయటానికి బెలూన్ లో పేడ నీళ్లు కలిపి ఉంచుతారు.
ఎలాగైనా వాడిని ఈ కాలేజీ నుంచి బయటికి తరిమేయాలి. మనం ఎన్నిసార్లు వాడిని టార్గెట్ చేసిన తప్పించుకుంటున్నాడు ఈసారి మాత్రం తప్పించుకోకూడదు అనుకొని అందరూ క్లాస్ కి బయలుదేరుతారు. మరోవైపు రిషి ని స్టాఫ్ అందరికీ పరిచయం చేసి మన కాలేజీలోనే లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు అని చెప్తాడు ప్రిన్సిపల్.
అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మురుగన్ ని ఎదిరించిన విషయంలో రిషిని మెచ్చుకుంటారు. అంతమాత్రాన మీరు రిలాక్స్ అయిపోవటానికి లేదు ఇకమీదటే మీరు ఆ కేడి బ్యాచ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తాడు ప్రిన్సిపల్. నాకు తెలుసు సార్ నేను చూసుకుంటాను అని వాళ్లతో చెప్పి క్లాస్ కి బయలుదేరుతాడు రిషి. అప్పటికే రిషి తల మీద పేడ నీళ్లు పడేలాగా బెలూన్ కడతారు కేడి బ్యాచ్. కానీ ఆ విషయాన్ని ముందే పసికట్టిన రిషి ఆ బెలూన్ పగలగొట్టి ఈ పని ఎవరు చేసారో నాతో పాటు క్లాసులో ఉన్న అందరికీ బాగా తెలుసు.
నేను పది నిమిషాలు బయటకు వెళ్లి వస్తాను ఈలోపు అక్కడ క్లీన్ చేసి ఉండాలి లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరూ బయటికి వెళ్లరు అని చెప్పి బయటకు వెళ్లి డోర్ లాక్ చేస్తాడు రిషి. షాక్ అయినా కేడి బ్యాచ్ ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటారు. మా డాడీ కి చెప్తాను ఆయనే చూసుకుంటారు అంటాడు పాండ్యన్. అదే విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్తే మీ లెక్చరర్ చెప్పినట్లు చెయ్యు అంటాడు మురుగన్. తండ్రి మాటలకి నివ్వెర పోతాడు పాండియన్. వాడు చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నాడు నాన్న వార్నింగ్ ఇవ్వు అంటాడు పాండ్యన్. చూడడానికి అలాగే ఉంటాడు అని చెప్పి జరిగిందంతా చెప్తాడు మురుగన్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.