MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: మురుగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. అయోమయంలో విశ్వనాథం?

Guppedantha Manasu: మురుగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. అయోమయంలో విశ్వనాథం?

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాలేజీని ఉద్ధరించాలని నడుం బిగించిన ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Jun 09 2023, 10:49 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

 ఎపిసోడ్ ప్రారంభంలో వీడెవడు మనం ఇంత టార్చర్ పెట్టినా నవ్వుతున్నాడు అంటుంది గ్యాంగ్ లో ఉన్న ఒక అమ్మాయి. యంగ్ ఏజ్ కదా మన అల్లరి అర్థం చేసుకుంటున్నట్లుగా ఉన్నాడు అయినా వాడి స్మైల్ నాకు నచ్చలేదు. మళ్లీ వచ్చినప్పుడు వాడి కార్ లో గాలి తీసేయాలి అంటాడు ఒకడు. స్టెపినీ వేసుకుంటాడేమో అంటాడు మరొకడు. అయినా పర్వాలేదు వాడి ఒంట్లో ఓపిక అయిపోయిన వరకు మనం గాలి తీస్తూనే ఉండాలి.
 

29
Asianet Image

అదే మనం వాడికి ఇచ్చే పనిష్మెంట్ అంటాడు పాండ్యన్. మురుగన్ ఇంటికి వెళ్తాడు రిషి. మీ పిల్లల పద్ధతి బాగోలేదు మార్చుకోమని చెప్పు అని హెచ్చరిస్తాడు. వాడు కూడా నాలాగే కుదురుగా ఒకచోట ఉండలేడు నువ్వే చూసి చూడనట్లు పో అంటాడు మురుగన్. నేను ఒక లెక్చరర్ ని నువ్వు కొడుకులు తీసివేతలు బాగా వచ్చు. కాలేజీలో ఉండే అలాంటి పుచ్చు వెదవల్ని తీసేయడం వచ్చు.
 

39
Asianet Image

 ఇలాంటి స్క్రాప్  అందరినీ కూడి ఒక దగ్గర పెట్టి కాల్చివేయటం వచ్చు అంటాడు రిషి. ఏదో పంతులువని చూస్తున్నాను ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి అంటాడు మురుగన్. లేకపోతే ఏం చేస్తావు అని రిషి అంటుండగానే అతని మీదకి ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తారు. ఇద్దరినీ చితక్కొడతాడు రిషి. మళ్లీ చెప్తున్నాను కాలేజీలో ఏ తప్పు జరిగిన పనిష్మెంట్ నీకే ఇస్తాను అని చెప్పి హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

49
Asianet Image

 వాడు అంత చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటన్న  అంటాడు ఒక రౌడీ. వాడిని ఏమి చేయొద్దు ఒక కన్నేసి ఉంచండి చాలు అంటాడు మురుగన్. మరోవైపు కాలేజీకి వచ్చిన రిషి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మీరు ఇంకేమీ భయపడకండి మురుగన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాను వాడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అంటాడు.

59
Asianet Image

 అందుకు సంతోషించిన ప్రిన్సిపల్ చాలా మంచి పని చేశారు రండి మిమ్మల్ని స్టాప్ కి పరిచయం చేస్తాను అంటాడు. వద్దు సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటాడు రిషి. లేదు సార్ మిమ్మల్ని వాళ్లకి  పరిచయం చేస్తే వాళ్లు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు అని చెప్పి రిషి ని తీసుకొని స్టాఫ్ రూమ్ కి వెళ్తాడు ప్రిన్సిపల్. అప్పుడే చక్రపాణి ఫోన్ చేయటంతో సిగ్నల్స్ రావటం లేదని బయటకు వెళ్తుంది వసుధార. అదే సమయంలో వస్తారు రిషి వాళ్ళు.
 

69
Asianet Image

 రిషి  ని స్టాఫ్ అందరికీ పరిచయం చేస్తాడు ప్రిన్సిపల్.  మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్టాఫ్ అంతటికీ ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధారతో ఇప్పుడే ఎవరో ఒక వ్యక్తి వచ్చారు మురుగని ఇంటికి వెళ్లే వార్నింగ్ ఇచ్చి వచ్చాడంట మంచి పని చేశారు కదా అని చెప్తారు అక్కడ ఉన్న స్టాఫ్. అవునా ఎవరు ఆ వ్యక్తి అని అడుగుతుంది వసుధార.
 

79
Asianet Image

 ఇప్పుడే అటువైపు వెళ్లారు అని చెప్పడంతో వాళ్లు చెప్పిన వైపు వెళుతుంది కానీ వసు వెళ్లేసరికి రిషి కార్లో వెళ్ళిపోతాడు. మరోవైపు రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విశ్వనాథం, ఏంజెల్. అప్పుడే ఇంటికి వచ్చిన రిషి ని  కాలేజీ ఎలా ఉంది అని అడుగుతాడు విశ్వనాథం. ఏమి బాగోలేదు సార్ ఆ కేడి గ్యాంగ్ ఆగడాలు శృతి మించిపోయాయి అంటాడు రిషి. అయితే వాళ్లని సస్పెండ్ చేద్దాము అంటుంది ఏంజెల్.
 

89
Asianet Image

వద్దు అలా చేస్తే వాళ్లు మరో కాలేజీకి వెళ్లి అక్కడ ఇబ్బందులు తీసుకువస్తారు వాళ్ళని మన కాలేజీలోనే ఉంచి బుద్ధి చెప్పాలి అంటాడు రిషి. నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే ఆ మురుగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అయోమయంలో పడతాడు విశ్వనాథం. ఆ విషయంలో మీరు ఏమి కంగారు పడకండి నేను ఇప్పుడే వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అంటాడు రిషి. ఒకసారి గా షాక్ అవుతారు ఏంజెల్, విశ్వనాథం.
 

99
Asianet Image

 అదే సమయానికి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళకూడదు అప్పుడే నీకు కాలేజీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రిషి ని అడుగుతాడు విశ్వనాథం. నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. నీకు తెలియని పని కాదు కదా ఎందుకు బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకుంటున్నావు అంటాడు విశ్వనాథం. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories