Guppedantha Manasu: ఎమ్మెస్సార్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. భయంతో టెన్షన్ పడుతున్న శైలేంద్ర, దేవయాని
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. ఆత్మ అభిమానం కల ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మర్యాదగా డబ్బు తీసుకొని వెళ్ళిపో లేదంటే కొబ్బరి బొండం మీద పడే కత్తి నీ మెడకాయ మీద పడుతుంది అంటూ హెచ్చరిస్తాడు మురుగన్. నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు శైలేంద్ర. రిషి తనని డబ్బు అడిగినప్పుడు తన పేరు బయట పెట్టవద్దని చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది మురుగన్ కి.
చాలా పెద్ద సమస్య వచ్చిందే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని వసుధారని అడుగుతాడు మురుగన్. నేను చూసుకుంటాను సార్ మీరు వెళ్ళండి అని చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురుగన్. అప్పుడు ఎమ్మెస్సార్ అతనిని ఎవరు పంపించారు అని అడుగుతాడు. చెప్పడం ఎందుకు చూపిస్తాను. అంటూ వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేస్తుంది వసుధార.
అక్కడ రిషి ఉంటాడు. రిషి ని చూసి ఎమోషనల్ అవుతాడు ఫణీంద్ర. రిషి మాత్రం ఎమ్మెస్సార్ వైపు చూస్తూ నేను కాలేజీలో లేనని కాలేజీని చేజిక్కించుకుందామని చూస్తున్నావ్ అంటే నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివి. నేను కాలేజీలో లేను అని అంటే దాని అర్థం కాలేజీ గురించి పట్టించుకోనని కాదు దానికి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటాను. ఇదే లాస్ట్ వార్నింగ్ మళ్లీ కాలేజీలో అడుగు పెట్టాలని చూస్తే కొబ్బరి బొండం ప్లేస్ లో నీ తలకాయ ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రిషి.
తర్వాత ఎమ్మెస్సార్ ని గెట్ అవుట్ అని కోపంగా చెప్తాడు రిషి. వెళ్ళిపోబోతున్న ఎమ్మెస్సార్ ని ఆపి వాడు నా కొడుకు. ఇందాక ఏదో మాట్లాడావ్ కదా ఇప్పుడు మాట్లాడు అంటూ అగ్రిమెంట్ పేపర్స్ చింపేస్తాడు మహేంద్ర. డబ్బు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎమ్మెస్సార్. అప్పుడు ఫణీంద్ర రిషి ఎక్కడ ఉన్నాడు నాకు అతని చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది అని వసుధారని అడుగుతాడు.
చెప్పడం కాదు సార్ చూపిస్తాను రండి అని రిషి ఉన్న ప్లేస్ కి తీసుకు వెళ్తుంది వసుధార. రిషి ని చూసి బాగా ఎమోషనల్ అవుతాడు ఫణీంద్ర. నీకోసం వెతకని చోటంటూ లేదు పదం మన ఇంటికి వెళ్దాము అంటూ బాధపడతాడు. దేవయాని కూడా ఎమోషనల్ అవుతున్నట్లుగా నటిస్తుంది. మహేంద్ర కూడా ఎమోషనల్ అవుతున్నట్లుగా నటిస్తూ మన కాలేజీకి వచ్చేయి నువ్వు లేకపోతే ఏదోలాగా ఉంది అంటాడు.
నేను రాను నాకు అవమానం జరిగింది. అలాంటి చోటికి నేను రాలేను అంటాడు రిషి. నువ్వు మళ్ళీ ఆ కాలేజీకి రావాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు ఫణింద్ర. అయినా దీనంతటికీ కారణం పిన్ని, వసుధారలే వాళ్లే నిన్ను మాకు కాకుండా చేశారు అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు శైలేంద్ర. అలా అనకు అన్నయ్య వాళ్ళు నిమిత్తమాత్రులు మాత్రమే వాళ్ళ వెనకాతల ఎవరో ఉన్నారు అంటాడు రిషి.
ఒక్కసారిగా షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర. నువ్వు తప్పు చేశావంటే ఎవరూ నమ్మరు అయినా నిజాన్ని ఆరోజు నిరూపించేయాల్సింది అంటాడు ఫణీంద్ర. కానీ వాళ్ళిద్దర్నీ దోషులు చేయటం నాకు ఇష్టం లేదు పెదనాన్న అంటాడు రిషి. కరెక్ట్ గా చెప్పావు జగతి వాళ్లు వెనకాతల ఎవరో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని భార్యని అడుగుతాడు మహేంద్ర.
అవునమ్మా ఎన్నిసార్లు అడిగినా కూడా రిషి వస్తేనే నిజం తెలుస్తుంది అన్నావు కదా ఇప్పుడు నిజం చెప్పు అంటాడు ఫణీంద్ర. నిజం చెప్పేస్తాను, చెప్పి నా మనసులో ఉన్న భారాన్ని దించుకుంటాను అంటుంది జగతి. ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయంతో టెన్షన్ పడిపోతారు జగతి, శైలేంద్ర.
మీరేమీ చెప్పక్కర్లేదు మేడం, ఇప్పుడు చెప్పవలసిన అవసరం కూడా లేదు ఏది ఏమైనాప్పటికీ నేను అక్కడికి రావడం జరగదు మీరందరూ జాగ్రత్త అని తండ్రి పెదనాన్నలు పిలిచినా వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అతని వెనకాతలే వెళుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.