- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న రిషి.. జగతిని మళ్ళీ అవమానించిన రిషి!
Guppedantha Manasu: వసు చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న రిషి.. జగతిని మళ్ళీ అవమానించిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి (Rishi) ఒంటరిగా, దిగులుగా ఉండటంతో గౌతమ్ అక్కడికి వచ్చి రిషిని ఓదారుస్తాడు. డాడ్ కు ఏమి కాదు అంటూ ధైర్యం ఇస్తాడు. ఇక రిషి డాడీ కి ఎప్పుడు ఇలా కాలేదు అని ఫస్ట్ టైం హాస్పిటల్ లో ఉన్నాడని అంటాడు. వెంటనే గౌతమ్ (Gautham) ఏం కాదు రా అంటూ ధైర్యం ఇస్తాడు. పెద్దమ్మ వాళ్ళ కి ఈ విషయం చెప్పి తీసుకొని రమ్మంటాడు రిషి.
ఇక గౌతమ్ (Gautham) అక్కడినుంచి వెళ్తాడు. రిషి ఒంటరిగా కూర్చొని గతంలో తన డాడీ తో గడిపిన క్షణాలు తలుచుకుంటాడు. అప్పుడే వసు కాఫీ తీసుకొని వస్తుంది. రిషిను (Rishi) తాగమని బతిమాలుతుంది. మహేంద్ర సార్ కి ఏం కాదు అని ధైర్యం ఇస్తుంది. దిగులుగా ఉండకండి సార్ అంటూ రిషి కి చెబుతుంది.
వెంటనే రిషి డాడీ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసినప్పుడు ఫోన్ చేయకుండా గౌతమ్ కి ఎందుకు ఫోన్ చేశావు అని కనీసం మీ మేడమ్ కూడా తెలీదా అనేసరికి వెంటనే వసు (Vasu) ఫోన్ చేశాను సార్ అని అంటుంది. ఇక మీరు కాల్ లిఫ్ట్ చేయక పోయేసరికి గౌతమ్ సార్ కి చేశాను అని అంటుంది. ఇక రిషి (Rishi) వసు చేతులు పట్టుకొని బాగా ఎమోషనల్ అవుతాడు.
డాడీ కి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని తనతో కాసేపు ఎమోషనల్ గా మాట్లాడి చేతులు వదిలిపెట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అక్కడే ఉన్న వసు (Vasu) బాధపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లిన రిషి, జగతి (Jagathi) లకు డాక్టర్ కొన్ని సలహాలు ఇస్తాడు. మహేంద్ర వర్మ కు మనసులో తెలియని బాధ ఉందని దానివల్ల ఆయన అలా ఉన్నారని..
కాబట్టి ఆయన మనసులో ఉన్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనడంతో వెంటనే రిషి (Rishi) ఆయనకు ఎటువంటి ఆలోచనలు లేవు అని చెబుతాడు. కానీ డాక్టర్ మాత్రం ఆయన ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడని.. కాబట్టి మనశ్శాంతి కోసం ఆయనను ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లాలని చెబుతాడు.
వసు మహేంద్రవర్మ (Mahendra varma) దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉండగా మహేంద్ర వర్మ కాసేపు సరదాగా మాట్లాడుతున్నాడు. రిషిని, జగతిని కలుపుతానన్న విషయాన్ని గుర్తు చేస్తాడు. జగతి.. రిషి దగ్గరికి వెళ్లి మహేంద్ర వర్మ గురించి మాట్లాడాలని అనుకోవటం తో.. వెంటనే రిషి (Rishi) అనాల్సిన మాటలు అన్నీ అనేసి.. ఈ విషయాన్ని అవకాశంగా తీసుకోవద్దని అనడంతో జగతి కన్నీరుతో బాధపడుతుంది.