Guppedantha Manasu: రిషిని దోషిని చేసిన వసు.. ఫ్లాపైన శైలేంద్ర ప్లాన్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. కొడుకు ప్రాణాలను కాపాడటం కోసం అతని భవిష్యత్తుని నాశనం చేసిన ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు చెప్పు వసుధార మనం మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటామో చెప్పు అంటాడు రిషి. ఏడుస్తూ మౌనంగా ఉండిపోతుంది వసుధార. అలా మౌనంగా ఉంటే కుదరదు నోరు తెరిచి నిజం చెప్పు అంటుంది జగతి. ఎవరికి భయపడవలసిన పనిలేదు జరిగింది జరిగినట్లు చెప్పు అంటాడు మినిస్టర్. అయినా నోరు విప్పదు వసుధార.
అడుగుతుంటే మాట్లాడవేమీ అంటూ కోప్పడతాడు రిషి. మీరే చెక్కు ఇష్యూ చేసారు సార్ అంటూ ఏడుస్తూ చెప్తుంది వసు. రిషి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార ఎక్కడో పొరపాటు జరిగింది జాగ్రత్తగా ఆలోచించు అంటాడు ఫణీంద్ర. తన ప్రాణానికి ప్రాణమైన వసుధార చెప్తుంది ఇంక అందులో ఆలోచించడానికి ఏముంది అంటుంది జగతి.
నా కళ్ళల్లోకి చూసి చెప్పు వసు అంటూ తన వైపు తిప్పుకుంటాడు రిషి. చాలా ఇబ్బంది పడుతూ రిషి కళ్ళల్లోకి చూస్తూ మీరే ఇచ్చారు సార్ అంటుంది వసు. రిషి కాళ్ళ కింద భూమి కనిపించినట్లుగా అయిపోతాడు. తూలి పడిపోబోతే వసు పట్టుకోబోతుంది. తనని ముట్టుకొనివ్వడు రిషి. దీని గురించి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు మినిస్టర్.
జగతి మేడం వసుధార ఇద్దరు నన్ను దోషిగా నిలబెట్టాక ఇంక నేను మాట్లాడడానికి ఏమీ లేదు. మనుషుల్ని నమ్మి తప్పు చేశాను. నా మనస్సాక్షిని మోసం చేసి ఈరోజు మీ అందరి ముందు దోషి లాగా నిలబడ్డాను అంటూ బాధపడతాడు రిషి. ఏం చేయబోతున్నావు పిన్ని అంటాడు శైలేంద్ర. నేరం రుజువైన కారణంగా అతను కాలేజీ ఎండి పదవి నుంచి తప్పుకోవాలి, ఇకపై ఈ కాలేజీకి తనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు.
ఇక్కడే కాదు మరి ఏ విద్యాసంస్థల్లోనూ కూడా ఎండిగా చేయటానికి వీల్లేదు అంటూ పనిష్ చేస్తుంది జగతి. దేవయాని, శైలేంద్ర, రిషి కి సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతారు. ఇప్పుడు కాలేజీకి ఎండిగా ఎవరు ఉంటారు అని అడుగుతాడు శైలేంద్ర. జగతి మేడం అంటూ ట్విస్ట్ ఇస్తాడు మినిస్టర్. ఒక్కసారిగా షాక్ అవుతారు జగతి, శైలేంద్ర. ఈ కాలేజీ యండిగా జగతి మేడం ఉంటారని రెండు నెలల క్రితమే రిషి నాకు మెయిల్ పెట్టాడు.
అందులో రిషి సంతకం కూడా ఉంది అంటాడు మినిస్టర్. మినిస్టర్ గారు చెప్పింది నిజమే ఇకనుంచి జగతి మేడం ఎండి గా ఉంటారు అంటాడు రిషి. శైలేంద్ర మొహం మాడిపోతుంది. ఈ అభియోగం తప్పు అని తెలిసిన రోజు మళ్లీ మీ పదవికి వస్తుంది అంటుంది జగతి. నాకు అక్కర్లేదు నేను మళ్ళీ ఈ కాలేజీలో అడుగుపెట్టను. అలాగే ఇంట్లోను మీ జీవితాల్లో కూడా ఉండను. ఎవ్వరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను.
ఈరోజు నుంచి ఈ రిషింద్రభూషణ్ ఒంటరివాడు అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు రిషి. నువ్వు వెళ్ళిపోవడమేంటి అంటూ రిషి ని పట్టుకొని ఆపుతుంది దేవయాని. మీ పెంపకంలో పెరిగిన నేను ఇలా అందరి ముందు దోషిగా నిలబడతానని అనుకోలేదు అంటాడు రిషి. నిన్ను ఇలా చూడడం నావల్ల కావడం లేదు ఇది చాలా అన్యాయం అంటాడు ఫణీంద్ర.
నాకు అన్యాయం జరగడం పక్కన పెట్టండి కానీ కాలేజీకి మాత్రం న్యాయం చేయండి ఈ సంఘటన నా జీవితానికి ఒక పెద్ద మచ్చ. నా చుట్టూ ఉన్న మనుషుల మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ నా అవసరం లేదు అలాగే ఎవరి అవసరము నాకు కూడా లేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. దేవయాని, సారధి, ఫణీంద్ర చిన్నగా నవ్వుకుంటారు. ఆ తరువాత కారులో వెళ్తూ రిషి వెళ్ళిపోయాడు సంతోషమే కానీ ఎండీ సీటు దక్కలేదు ఆ సీట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను పిన్నిని ఎంతలా బెదిరించాను అంటాడు శైలేంద్ర. పరవాలేదు శైలేంద్ర..
తన చేతుల్లోంచి ఎండి సీట్ ని మనం చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. తనకి ధైర్యము తెలివితేటలు ఎక్కువే కానీ భయం కూడా ఎక్కువే ఆ భయంతోనే రిషిని కాలేజీకి దూరం చేసింది అంటుంది దేవయాని. మళ్లీ వస్తాడేమో చెప్పలేము కదా అంటాడు శైలేంద్ర. మళ్లీ రాడు తనకి ఆత్మ అభిమానం ఎక్కువ మళ్లీ కాలేజీకి కాదు ఈ సిటీకే రాడు నువ్వేమీ టెన్షన్ పడకు అంటూ కొడుక్కి ధైర్యం చెప్తుంది దేవయాని. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.