- Home
- Entertainment
- తీవ్ర పోటీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీ హక్కులు ఎంత ధరకు అమ్ముడయ్యాయో తెలుసా ?
తీవ్ర పోటీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీ హక్కులు ఎంత ధరకు అమ్ముడయ్యాయో తెలుసా ?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. త్వరలో ప్రమోషన్స్ జోరు కూడా పెరగనుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే.
పోలీస్ అధికారిగా పవన్
పోలీస్ అధికారి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తునారు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో కూడా భారీ డిమాండ్ నెలకొంది.
భారీ ధరకు ఓటీటీ హక్కులు
అందుతున్న సమాచారం మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 80 కోట్లకు ఉస్తాద్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. ముందుగా ప్రైమ్ వీడియో సంస్థ ఉస్తాద్ ఓటీటీ రైట్స్ కోసం ప్రయత్నిచింది. కానీ నెట్ ఫ్లిక్స్ బెటర్ ఆఫర్ ఇవ్వడంతో ఆ సంస్థకే హక్కులు దక్కాయి.
ఓజీ తర్వాత ఇదే
ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇది సెకండ్ హైయెస్ట్ ఓటీటీ డీల్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. చాలా కాలంగా డిలే అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇది కూడా ఒకటి.
పవన్ నెక్స్ట్ మూవీ
ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు వచ్చాయి.

