- Home
- Entertainment
- Guppedantha Manasu: ప్రూప్స్ చూపించి మరీ రిషి ప్రేమాయణాన్ని బయటపెట్టిన సాక్షి.. వసు పరిస్థితి ఏంటో!
Guppedantha Manasu: ప్రూప్స్ చూపించి మరీ రిషి ప్రేమాయణాన్ని బయటపెట్టిన సాక్షి.. వసు పరిస్థితి ఏంటో!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే కాలేజ్ అవర్స్ లో సాక్షి (Sakshi) ని రానివ్వొద్దు అని రిషి అటెండరుకు చెప్పినందుకు సాక్షి గిల్టీగా ఫీల్ అవుతుంది. ఇక జగతి (Jagathi) కూడా రిషి ను రెచ్చగొట్టకు ఇది కాలేజ్ ఇక్కడ న్యూసెన్స్ చేయకు అని సాక్షి తో అంటుంది. ఇక దాంతో సాక్షి మీరు ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు అని అంటుంది.
ఈలోపు అక్కడకు మహేంద్ర (Mahendra) రాగా.. మీరు అందరు కూడా రిషి కే సప్పోర్ట్ చేస్తున్నారని సాక్షి మహేంద్ర తో అంటుంది. ఇక రిషి వద్దన్నా మీరు వద్దన్నా నేను రావడం మానను అని సాక్షి (Sakshi) చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక వసుకు కాలేజ్ లో తన నోటుబుక్ లో ఒక లెటర్ కనిపిస్తుంది.
ఈ లోపు రిషి (Rishi) వసు స్కాలర్ షిప్ ఫోటీ లో పాల్గొంటున్నందుకు అందరితో క్లాప్స్ కొట్టిస్తాడు. మరో వైపు సాక్షి రిషి విషయంలో తనకు జరిగే అవమానం గురించి దేవయాని (Devayani) తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దేవయాని సాక్షి కి నానారకాలుగా మాటలు చెప్పి సాక్షి ను ప్రోత్సాహిస్తుంది.
ఇక రిషి (Rishi) బుక్ ఇస్తున్న క్రమంలో లెటర్ బయటపడుతుంది. అది గమనించిన రిషి ఇది నీకు ఎక్కడిది అని వసు ను అడుగుతాడు. నాకు జగతి మేడం గారు వాట్సాప్ లో సెండ్ చేశారు అని వసు చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. ఎవరో రాసిన లెటర్ బుక్ లో పెట్టుకుని తిరగడం ఏమిటని వసు (Vasu) పై విరుచుకు పడతాడు.
ఆ తరువాత సాక్షి (Sakshi) రిషి ను అందరిముందు తనలో నా స్థానం ఏమిటి అని అడుగుతుంది. ఇక రిషి (Rishi) నువ్వు నా మనసులో లేవు అని విరిచేసినట్టుగా మాట్లాడుతాడు. ఇక సాక్షి.. అయినా నీ ప్రియారిటీస్ అన్నీ వేరేవాళ్లకు ఇస్తున్నావ్ అని అంటుంది.
ఇక వసు (Vasu) నే నీ ప్రపంచం అని సాక్షి (Sakshi) అందరి ముందు చెప్పేస్తుంది. ఇక రిషి ఆ మాటను కొట్టి పరేస్తుండగా సాక్షి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం లేదు అంటే నేను నమ్మాలా అని సాక్షి అంటుంది. ఇక ఈ క్రమంలో అక్కడకు వసు ఎంట్రీ ఇస్తుంది.