- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతి, మహేంద్రను ఒకటి చెయ్యడానికి సిద్దమైన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!
Guppedantha Manasu: జగతి, మహేంద్రను ఒకటి చెయ్యడానికి సిద్దమైన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

మహేంద్ర వర్మ గురించి రిషి (Rishi) దగ్గరికి వెళ్లి మాట్లాడాలనుకున్న జగతిని అనాల్సిన మాటలు అని బాధ పెడతాడు రిషి. చూస్తుంటే డాడ్ కి నీవల్లే సమస్య వచ్చింది అని మరింత బాధపెడతాడు. ఆ మాటలు విని తట్టుకోలేక జగతి (Jagathi) ఏడుస్తూ ఉంటుంది.
మధ్యలో వసు (Vasu) గురించి కూడా మాట్లాడటంతో.. అప్పుడే వసు వారి దగ్గరకు వస్తుంది. ఇక రిషి తాము మాట్లాడిన మాటలు వసు విన్నదేమో అని టెన్షన్ పడతాడు. కానీ వసు ఆ మాటలు వినలేదని అర్థమవుతుంది. తమను మహేంద్ర (Mahendra) సార్ పిలుస్తున్నారని అంటుంది.
ఇక గౌతమ్ (Gautham) కారులో వారిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఫణీంద్ర వర్మ, ధరణి (Dharani) మహేంద్ర వర్మ కు ప్రమాదం తప్పిందని అనుకుంటారు. అంతలోనే దేవయాని మళ్లీ చిచ్చు పెట్టే మాటలను మాట్లాడుతుంది. గౌతమ్ ఏం జరిగింది పెద్దమ్మ అనటంతో ఫణీంద్ర వర్మ మాట మారుస్తూ మాట్లాడుతాడు.
ఇక ధరణి తన మనసులో దేవయాని (Devayani) గురించి ఆలోచిస్తుంది. ఇదే ఆసరగా తీసుకొని అత్తయ్య గారిని ఏమంటుందో అని అనుకుంటుంది. మహేంద్రవర్మ (Mahendra Varma) దగ్గరికి రిషి వెళ్లి కూర్చుంటాడు. అంతలోనే జగతి డోర్ దగ్గర ఉండటంతో మహేంద్రవర్మ పిలుస్తాడు.
జగతిని (Jagathi) ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతాడు మహేంద్రవర్మ. కానీ జగతి వెళ్ళనని చెప్పి ఇక్కడే ఉంటానని అంటుంది. రిషి కూడా వెళ్ళండి మేడం అని అంటాడు. ఇక జగతి మహేంద్ర వర్మ ని చూస్తూ గతంలో తాను హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకోసం మహేంద్ర వర్మ (Mahendra Varma) ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తుంది.
ఇక రిషి (Rishi), దేవయాని లను ఉద్దేశించి కొన్ని మాటలు అనడంతో వెంటనే రిషి తన మనసులో.. తనకోసం జగతి మేడం ను డాడ్ నుండి దూరం చేశాను అని.. కానీ డాడ్ కు అది ఒక శిక్ష గా మారిందని బాధ పడతాడు. డాడ్ కోసం అయినా జగతి (Jagathi) మేడం విషయంలో నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు.
దీన్ని బట్టి చూస్తే తన తల్లిదండ్రులను కలపాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో దేవయాని (Devayani) వాళ్లు వస్తారు. అక్కడ జగతిని (Jagathi) చూసి దేవయాని కోపంతో రగిలిపోతుంది. ఇక దేవయాని ఏడుస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. జగతిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రెచ్చిపోతుంది.
ఇక దేవయాని (Devayani) ఏడుస్తూ ఉండటంతో రిషి తట్టుకోలేక ఓదార్చాడు. అది చూసి తట్టుకోలేక దేవయాని అక్కడి నుంచి వెళ్తుంది. వసుతో కాసేపు తన బాధలు చెప్పుకుంటుంది. మహేంద్ర వర్మ (Mahendra Varma) కాసేపు వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. తరువాయి భాగం లో మహేంద్రను దేవయాని ఇంటికి తీసుకెళ్తారు.