- Home
- Entertainment
- Guppedantha Manasu: తల్లిదండ్రులను ఘోరంగా అవమానించిన రిషి.. శైలేంద్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న జగతి!
Guppedantha Manasu: తల్లిదండ్రులను ఘోరంగా అవమానించిన రిషి.. శైలేంద్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న జగతి!
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తమ్ముడు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

ఎపిసోడ్ ప్రారంభంలో జగతి దగ్గరికి రెడీ అయి వస్తాడు మహేంద్ర. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకు అలా ఉన్నావు ఏదైనా సమస్య అని అడుగుతాడు మహేంద్ర. జగతి ఏదో మాట్లాడే అంతలో అక్కడికి దేవయాని, శైలేంద్ర వస్తారు. ఏంటి ఇంకా అలా కూర్చున్నావు నీకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదా అని అడుగుతుంది దేవయాని.
అలాంటిదేమీ లేదు తను ఎందుకో బాధపడుతుంది అంటాడు మహేంద్ర. ఈ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ ఫస్ట్ నేను తీసుకు వచ్చాను కదా అది పిన్నికి ఇష్టం లేదేమో అంటాడు శైలేంద్ర. నాకు అలాగే అనిపిస్తుంది నీకు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించు అంతేగాని నా కొడుకు మీద ఎందుకు ద్వేషం అని నిష్టూరంగా మాట్లాడుతుంది దేవయాని. తను శైలేంద్రని ఏమి అనలేదు అంటాడు మహేంద్ర.
పైకి ఏమీ అనకపోవచ్చు కానీ లోపల బాగా కోపం పెంచుకుంది అంటుంది దేవయాని. అవన్నీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముందు రెడీ అవ్వండి అంటాడు శైలేంద్ర. నేను తనతో మాట్లాడి తీసుకు వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి శైలేంద్ర వాళ్ళని పంపించేస్తాడు మహేంద్ర. నువ్వు ఇలా మూడీ గా ఉంటే నేను వాళ్లకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను.
త్వరగా రెడీ అవ్వు అంటూ కిందికి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి వాళ్ళు రెడీ అయి కిందికి వస్తారు. అప్పుడే చక్రపాణి దంపతులు కూడా వస్తారు. పలకరింపులు అయిన తర్వాత మీకు ఇక్కడికి రాటానికి అభ్యంతరం ఏమీ లేదు కదా ఇష్టంతోనే వచ్చారా అని అడుగుతాడు రిషి. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతాడు చక్రపాణి.
అయిష్టత ఎందుకు ఉంటుంది మా అమ్మాయి చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా అంటాడు చక్రపాణి. మరి వసు ఏంటి అలా చెప్పింది నిశ్చితార్థం కూడా వద్దు అని చెప్పింది అంటాడు రిషి. మళ్లీ తనే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు వెళ్లి ఫ్రెష్ అప్ అయి రండి అని చెప్పి వసు తో పంపిస్తాడు. లోపలికి వెళ్ళిన తరువాత ఎందుకు నిశ్చితార్థం వద్దన్నావు.
నువ్వు ఎప్పటినుంచో దీని కోసమే కదా ఎదురు చూస్తున్నావు ఏదైనా సమస్యా.. అని అడుగుతాడు చక్రపాణి. నిజం చెప్తే మీరు మరింత భయపడతారు అని మనసులో అనుకొని అలాంటిదేమీ లేదు నాన్న రిషి సార్ తో నేను మాట్లాడాను మీరు అవేవీ మనసులో పెట్టుకోకండి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది వసు. మరోవైపు వేదిక మీద ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది.
జగతి భయపడుతూ కూర్చుంటుంది. ఈ ఎంగేజ్మెంట్ జరగాలని అందరికన్నా నువ్వే ఎక్కువగా కోరుకున్నావు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటూ మళ్ళీ అడుగుతాడు మహేంద్ర. శైలేంద్ర తమ్ముడు అంటే అభిమానం ఉన్నవాడిలాగా చక చక పనులు చక్కబెడుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దీని వెనుక ఏమైనా కారణం ఉందా అంటూ మదన పడుతుంది జగతి.
మరోవైపు పంతులుగారు అమ్మాయి తల్లిదండ్రులని అబ్బాయి తల్లి దండ్రులని వేదిక మీదకి పిలుస్తారు. జగతి వాళ్ళు స్టేజి మీదకి రాబోతుంటే వాళ్లని ఆగమని దేవయాని వాళ్ళని రమ్మంటాడు రిషి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి దంపతులు. దేవయాని ఫణీంద్ర వేదిక మీదికి వెళ్తుంటే శైలేంద్ర ఆపుతాడు. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలి నీ అభిప్రాయాలతో సాంప్రదాయాన్ని మార్చొద్దు.
అయినా పిన్నిని తల్లిగా ఒప్పుకోకపోతే బాబాయిని కూడా తండ్రిగా ఒప్పుకోలేనట్లే. నేనంటే గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నా మాట విను అంటూ రిషి ని ఒప్పిస్తాడు శైలేంద్ర. మహేంద్ర స్టేజి ఎక్కుతాడు జగతి మొహమాటపడుతుంటే జగతికి దగ్గరగా వెళ్లి చివరిసారిగా నిన్ను అతనికి అమ్మని చేసే అవకాశం ఇచ్చాను అంటూ జాగ్రత్తగా ఆమెని స్టేజి ఎక్కిస్తాడు శైలేంద్ర. నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది. వాళ్ల చేత ఎందుకు నిశ్చితార్థం చేయించావు అని కొడుకుని అడుగుతుంది దేవయాని. నువ్వు ఇక్కడే ఉంటే జ్యూస్లు ఎవరు తీసుకు వస్తారు అంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.