- Home
- Entertainment
- Guppedantha Manasu: ఈ రోజు స్పెషల్ డే అంటూ మురిసిపోతున్న రిషీ.. కొడుకు సంతోషాన్ని అడ్డుకున్న మహేంద్ర!
Guppedantha Manasu: ఈ రోజు స్పెషల్ డే అంటూ మురిసిపోతున్న రిషీ.. కొడుకు సంతోషాన్ని అడ్డుకున్న మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి ధరణి (Dharani) దగ్గరకు ఒక క్యాలెండర్ తీసుకొనివచ్చి ఈ నెలకి ఒక ప్రత్యేకత ఉంది వదిన అని అంటాడు. ఇక దాని గురించి గౌతమ్, ధరణి లు ఎంత అడిగినా చెప్పకుండా రిషి కాలేజ్ కి వెళతాడు. మరోవైపు మహేంద్ర (Mahendra) దంపతులు తమ పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.
ఈ లోపు జగతి (Jagathi) ఇంటి ముందు కు రిషి కారు వేసుకొని వస్తాడు. ఇక వసుకు రిషి కాల్ చేసి డాడ్ ను ఒకసారి బైటకు రమ్మని చెబుతాడు. ఇక పంతం తో మహేంద్ర రిషి దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడు. కానీ జగతి (Jagathi) మహేంద్ర ను బ్రతిమిలాడి రిషి దగ్గరకు పంపిస్తుంది.
ఇక మహేంద్ర (Mahendra) ను ఒకచోటికి తీసుకువెళ్లిన రిషి.. మీ బర్త్ డే ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను ఒక రిసార్టు కూడా బుక్ చేశాను అని చెబుతాడు. ఇక అదే క్రమంలో సెలబ్రేషన్స్ నువ్వు నేనే జరుపుకుందాం అని రిషి అంటాడు. ఇక మహేంద్ర జగతి (Jagathi) నా భార్య అని ప్రపంచానికి తెలుసు తనని కాదని ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోలేని మహేంద్ర అంటాడు.
ఇక తర్వాత రిషి (Rishi) మీరు కాదంటారని నేను అనుకోలేదు డాడ్ అని అంటాడు. మహేంద్ర (Mahendra) కూడా ఒక్కడినే రమ్మంటావు అని నేను అనుకోలేదు అని అంటాడు. ఇక రిషి జరిగిన దాని గురించి వసు పని చేసే రెస్టారెంట్ కి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత రిషి (Rishi) ఒక చోట కూర్చుని ఉండగా అక్కడ కు వసు వెళుతుంది. మా డాడీ తో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అంటే ఏం చేయాలి అని వసు ను అడుగుతాడు. దాంతో వసు (Vasu) అది మీకే తెలియాలి సార్ అన్నట్లు మాట్లాడుతుంది.
ఇక రిషి వసు (Vasu) లు ఉల్లి మిక్సర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ రిషి రెండు బాగా మసాలా వేసి ఇవ్వండి అని అంటాడు. ఆ క్రమంలో రిషి బాగా మాట్లాడుకుంటూ హడావిడి చేస్తాడు. ఇక వసు సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని అంటుంది. దాంతో రిషి (Rishi) ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారు అని అంటాడు.