- Home
- Entertainment
- Guppedantha Manasu: చీకటి గదిలో రిషీ, వసు.. స్పెషల్ స్టూడెంట్ తో ముచ్చట్లు ఎంతసేపు అంటూ మహేంద్ర జోకులు!
Guppedantha Manasu: చీకటి గదిలో రిషీ, వసు.. స్పెషల్ స్టూడెంట్ తో ముచ్చట్లు ఎంతసేపు అంటూ మహేంద్ర జోకులు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి (Rishi) ఇంట్లో కూర్చుని వసుకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ లోపు మహేంద్ర దంపతులు కారులో నుంచి రాగ ఒకవేళ వసు వాళ్ళతో వచ్చిందేమో అని కంగారు కంగారుగా కిందికి వచ్చి చూస్తాడు. కానీ వసు (Vasu) వాళ్ళతో రాదు. ఇక రిషి వసు వాళ్ళతో రానందుకు కొంత విచారం వ్యక్తం చేస్తాడు.
ఇక మహేంద్ర (Mahendra) రిషిను ఓ విషయం లో ఆట పట్టిస్తూ ఉండగా.. జగతి తన కొడుకును చూసి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర రిషి కు వసు ఎక్కడుందో తన లొకేషన్ షేర్ చేస్తాడు. ఇక రిషి కారు లో వసు (Vasu) కోసం తన ఇంటికి వస్తాడు. అంతే కాకుండా వసుకు కాల్ చేసి తను ఫోన్ ఆన్సర్ చేయందుకు విరుచుకు పడతాడు.
ఇక వసు (Vasu) ఉంటున్న ఇల్లు ని చూసి రిషి (Rishi) ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు అని అంటాడు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అని ఉంటుంది. రిషి మీ రెస్టారెంట్ మేనేజర్ హెల్ప్ చేశాడా అని అంటాడు. అవును అని వసు అంటుంది. ఈ క్రమంలో వసు పదండి సార్ లోపలికి వెళదాం అని అంటుంది.
ఇక వసు (Vasu) లోపలికి అడుగుపెడుతున్న క్రమంలో కుడి కాలు పెట్టి లోపలికి రండి సార్ అని అంటుంది. నేనేమన్నా కొత్త కోడలి నా అని రిషి అంటాడు. ఇక్కడ ఇంత చిన్న రూమ్ లో నువ్వు ఎలా ఉంటావు అని రిషి (Rishi) అడుగుతాడు. మరోవైపు జగతి (Jagathi) రిషి ఇంకా ఇంటికి రానందుకు మహేంద్ర పై చిరాకు పడుతుంది.
ఇక మహేంద్ర రిషి కి కాల్ చేసి మీ స్పెషల్ స్టూడెంట్ కు ఏమైనా స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ క్రమంలో రిషి ఏమి జరిగినట్టగా ఉంటాడు. ఇక మహేంద్ర మేము చెప్పే మాటలు అర్థం కాకపోయినా కనీసం క్లాసు అయినా వసుకు (Vasu) అర్థమయ్యేలా చెప్పు అని ఇండైరెక్టుగా చెబుతాడు.
ఇక రేపటి భాగంలో గౌతమ్ (Goutham) వసు దగ్గరకు వచ్చి తన వెనకాల రోజ్ పట్టుకొని ప్రపోస్ చేయబోతాడు. ఈలోపు వెనుకనుంచి రిషి (Rishi) వచ్చి ఆ రోజ్ ను కట్ చేస్తాడు. ఇక దాంతో ఆ గౌతమ్ డిసప్పాయింట్ అవుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.