- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షికి చెమటలు పట్టించిన వసుధార.. వసు కోసం స్వయంగా కాఫీ చేసిచ్చిన రిషి!
Guppedantha Manasu: సాక్షికి చెమటలు పట్టించిన వసుధార.. వసు కోసం స్వయంగా కాఫీ చేసిచ్చిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సాక్షి (Sakshi) తనకు తోచిన ప్లాన్ ను రిషికి చెప్పటంతో రిషి (Rishi) ఆ ప్లాన్ బాగుందని అంటాడు. కానీ వసుధార తమ ప్రాజెక్టు గురించి అలా ప్రకటించడం వల్ల హంగామా చేసినట్లు అవుతుంది అని.. అలా కాకుండా ఒక పద్ధతిగా వివరించాలి అని చెప్పటంతో మహేంద్ర వర్మకు, జగతి లకు కూడా వసు కాన్సెప్ట్ నచ్చుతుంది.
దాంతో రిషి (Rishi) కూడా ఆ ప్లాన్ బాగుంది అనటంతో సాక్షి కి బాగా మండినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత రిషి వారు ఇక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రాజెక్టులో మహేంద్ర వర్మను కూడా ఒక భాగం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత అందరూ వసు (Vasu) ప్లాన్ ను మెచ్చుకుంటారు.
ఇక సాక్షి వసు (Vasu) చేసిన ప్లాన్ ను బోల్తా కొడతాను అన్నట్లుగా చెప్పటంతో.. వెంటనే వసు స్టైల్ లో తనకు కౌంటర్ వేసి వెళ్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకే గదిలో ఉండటంతో సాక్షి (Sakshi) ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. వసు వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో సాక్షి వర్క్ చేయకుండా వసును విసిగిస్తూ ఉంటుంది.
ఇక సాక్షి (Sakshi) ని వర్క్ చేసుకోమని చెప్పటంతో సాక్షి వినిపించుకోకుండా తనకు ఒక కథ చెప్పమని అంటుంది. మళ్లీ తానే వసు (Vasu) ను కథలు వస్తాయో రావో అని వెటకారం చేయడంతో వెంటనే వసు ఒక మోహిని అని భయంకరమైన స్టోరీ చెబుతుంది. ఆ స్టోరీ వింటుండగా సాక్షికి భయం పుడుతుంది. దాంతో సైలెంట్ గా పడుకుంటుంది.
రిషి (Rishi) గతంలో తన వసుతో గడిపిన క్షణాలను గుర్తుకు చేసుకొని.. వసు ఏంటో తనకు అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. ఇక ఈ సమయంలో వసు హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ వసు వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఇక సాక్షి (Sakshi) పడుకోకుండా మోహిని వచ్చిందేమో అని భయపడుతూ చెమటతో తడిసిపోతుంది.
ఇక వసు (Vasu) ఇక్కడ నుంచి వెళ్లి మరో చోట కూర్చొని చదువుకుంటుంది. అది చూసిన రిషి స్వయంగా వసుకి కాఫీ చేసుకొని వస్తాడు. ఇక వసు రిషి (Rishi) చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఒక విషయం చెప్పాలని అన్నావ్ కదా ఆ విషయం ఏంటి అని రిషి అడుగుతాడు. ఇక వారి మాటలు వింటున్న దేవయాని (Devayani) దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయటంతో జగతి (Jagathi) ఆపి కాస్త గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా సాక్షి చేసే కుట్రల వెనుక నువ్వు ఉన్నావని రిషికి చెబుతాను అని బెదిరిస్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.