Guppedantha Manasu: కోపంతో వసుధారను కొట్టబోయిన ఈగో మాస్టార్.. రిషీని ఒత్తిడి చేస్తున్న విశ్వనాథం!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన మనవరాలు పెళ్లి కోసం తపన పడుతున్న ఒక తాత కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఏంజెల్ మనసులో ఎవరున్నారో నాకు తెలిసిపోయింది, అది నువ్వే రిషి అని చెప్తాడు విశ్వనాథం. రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు విశ్వనాథం మాట్లాడుతూ ఏంజెల్ మంచి నిర్ణయమే తీసుకుంది కానీ ఎందుకు నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా లేవు అని అడుగుతాడు. నేను ఎప్పుడూ ఏంజెల్ ని అలాంటి దృష్టితో చూడలేదు సార్ అయినా నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అంటాడు రిషి.
నీకు గతంలో ప్రేమ ఏమైనా ఉందా ఉంటే చెప్పు నేను ఏంజెల్ కి చెప్తాను. అసలు నీ తల్లిదండ్రులు ఎవరు, నీ గతం గురించి చెప్పు అంటాడు విశ్వనాథం. అలాంటివి ఏవి అడగొద్దు అంటాడు రిషి. సరే అడగను కానీ ఏంజెల్ తో పెళ్లి గురించి బాగా ఆలోచించు. ఆలోచించి, నా మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకో. తనని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పైకి పోయినా కూడా ప్రశాంతంగా ఉంటాను అంటూ రిషి మీద ఒత్తిడి తెస్తాడు విశ్వనాథం.
ఆ తర్వాత కాలేజీ లో కూర్చొని బాధపడుతున్న రిషి దగ్గరికి వస్తుంది వసుధార. అందరూ వెళ్ళిపోతున్నారు సర్, మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు ఇంటికి వెళ్ళండి అంటుంది. అప్పుడు రిషి కోపంగా మాట్లాడుతూ నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా, విశ్వనాధం గారు ఏంజెల్ ని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటాడు రిషి. అప్పుడు విశ్వనాథం తన ఇంటికి వచ్చిన సంగతి చెప్తుంది వసుధార. మరి వాళ్ళకి నేను తగనని చెప్పకపోయావా అంటాడు రిషి.
అందుకు నాకేమీ హక్కు ఉంది సార్, అయినా మీరే చెప్పొచ్చు కదా. అయినా మీరు ఇలా ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అయితే ఏంజెల్ ని పెళ్లి చేసుకోండి లేదంటే వాళ్లతో నిజం చెప్పండి అంటుంది వసుధార. వసుధార అంటూ కోపంతో కొట్టడానికి ఆమె మీద చెయ్యి ఎత్తుతాడు రిషి. కానీ తమాయించుకొని మేడం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపొండి, మీ మాటలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార.
ఆ తర్వాత విశ్వనాథం దగ్గరికి వస్తాడు రిషి. నేను మీతో మాట్లాడాలి ముందు ఈ టాబ్లెట్లు వేసుకోండి అంటాడు. ఈ టాబ్లెట్స్ ఎందుకు ఆల్రెడీ నేను వేసేసుకున్నాను ముందు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావో చెప్పు అంటాడు విశ్వనాథం. పర్వాలేదు సార్ ఈ టాబ్లెట్లు ఇప్పుడు మీకు అవసరం అని చెప్పి విశ్వనాథం చేత టాబ్లెట్లు వేయిస్తాడు రిషి. తర్వాత అతని మొహం చూసి మాట్లాడలేక వెనక్కి తిరిగి మాట్లాడుతాడు రిషి.
ఆ మాటల్లో ఏంజెల్ ని నేను పెళ్లి చేసుకోలేను తను నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటాడు రిషి. మీరు నన్ను అర్థం చేసుకోండి అంటూ వెనక్కి తిరిగే సరికి అప్పటికే మాత్రల ప్రభావం వలన విశ్వనాథం నిద్రపోతాడు. సార్ నేను చెప్పింది ఏది వినలేదా అని నిరుత్సాహపడతాడు రిషి. విశ్వనాధానికి దుప్పటి కప్పి బాధగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే పేపర్ చదువుతున్న విశ్వనాధాన్ని చూసి ఇప్పుడు నా నిర్ణయాన్ని చెప్పేయాలి అనుకుంటాడు.
ఇంతలోనే ఏంజెల్.. రా రిషి, కాఫీ తాగుదువు గాని అని పిలుస్తుంది. రిషి వచ్చి విశ్వనాథం దగ్గర కూర్చుంటాడు. ఏంజెల్ ఇద్దరికీ కాపీ ఇస్తుంది. అప్పుడు విశ్వనాథం రాత్రి ఏదో చెప్తున్నావు కానీ నేను నిద్రపోయాను. ఇప్పుడు చెప్పు రిషి, ఏం నిర్ణయం తీసుకున్నావు అంటాడు విశ్వనాథం. నిర్ణయం తీసుకున్నాను సార్..మీరు చాలా మంచివారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగానే..
విశ్వనాథం ఆనందంతో నాకు తెలుసు రిషి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవని ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు థాంక్స్. ఇప్పుడు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది అంటాడు విశ్వనాథం. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని కన్ఫ్యూజ్ అవుతుంది ఏంజెల్. నాకు నీ మనసులో ఎవరున్నారో తెలిసిపోయింది. అందుకే రిషి ని నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. నీ ఎదురుగుండానే ఒప్పుకున్నాడు కదా అంటాడు విశ్వనాథం.
అప్పుడు ఏంజెల్ కూడా ఆనందంతో రిషికి థాంక్స్ చెప్తుంది. ఆనందం తో ఎక్సైట్ అవుతున్న విశ్వనాధానికి లైట్ గా హార్ట్ పెయిన్ వస్తుంది. మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోవద్దు అంటూ టాబ్లెట్స్ తేవడానికి వెళ్తుంది ఏంజెల్. ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని విశ్వనాధానికి చెప్పాలనుకుంటాడు రిషి. కానీ అతను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పడం మంచిది కాదు అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.