MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Guppedantha manasu: ముందు నా రూమ్ నుంచి వెళ్ళు.. సాక్షికి రిషీ స్ట్రాంగ్ కౌంటర్!

Guppedantha manasu: ముందు నా రూమ్ నుంచి వెళ్ళు.. సాక్షికి రిషీ స్ట్రాంగ్ కౌంటర్!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Aug 09 2022, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి,వసు ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వసు, "నాకు ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వడం అలవాటు లేదు కానీ ఒక విషయం వినండి సార్. చిన్నప్పటినుంచి నా గోల్ కి, నేనేం చేయాలో నాకు తెలుసు .నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఒక వేళ నేను అది సాధించిన, సాధించకపోయినా నాకు నచ్చింది చేశాను అని సంతృప్తి ఉంటాది, కానీ మీరు సాక్షిని పెళ్లి చేసుకోవడం అనేది మీకు నచ్చనిది.అయినా మీరు ఎందుకు ఈ పని చేశారో నాకు అయితే అర్థం కావట్లేదు?" అని అంటుంది వసు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు రిషి, నాకు కూడా ఇక్కడ కొన్ని మంది అర్థం కావట్లేదు. అయినా మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సీన్లో సాక్షి,రిషి దగ్గరికి వచ్చి ఆనందంతో థాంక్యూ రిషి, థాంక్యూ! వెరీమచ్. నేను నీ మొదటి అక్షరంతో ఉంగరం చేయించుకుంటున్నాను.నువ్వు నా మొదటి అక్షరంతో ఉంగరం చేయించుకో, పెళ్లి బట్టలకు షాపింగ్ చేద్దాం బయటికి రా అని సాక్షి అంటే రిషి ,నాకు షాపింగ్ నచ్చదు అంటాడు.
 

37

అప్పుడు సాక్షి,గతంలో రిషి వసుధారకి బట్టలు కొన్న విషయం గుర్తుతెచ్చుకొని నీకు నిజంగానే షాపింగ్ నచ్చదా? అంటే ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవడం కూడా ఒక  కళ.అది నీకు తెలీదు నన్ను విసిగించకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.ఆ తర్వాత సీన్లో మహీంద్రా, రిషి దగ్గరికి వచ్చి "మనం ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళం.ఇప్పుడు కొంచెం మాటలు తగ్గాయి. నేను నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. అసలు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఎందుకు?.
 

47

పెళ్లంటే జీవితంలో ఒకసారి వస్తుంది.మొన్న మొన్నటి వరకు సాక్షిని అంతలా తిట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అసలు ఏం జరుగుతుంది?" అని మహీంద్రా రిషి ని అడుగుతాడు."నేను అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను, నేను దేవేంద్ర భూషణ్ మనవడిని అని గుర్తు పెట్టుకుంటే చాలు" అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర "నేను నిన్ను అడుగుదామని వచ్చాను కానీ  కుదరలేదు" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో వసు, అమ్మవారి దగ్గరికి వెళ్లి నేను నా కష్టాలన్నీ నీకు చెప్పుకున్నాను కదా నేను అడిగింది ఏంటి?
 

57

నువ్వు చేసింది ఏంటి? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది.అయినా పర్లేదు నేను నా ప్రేమను ఎలాగైనా గెలిపించుకుంటాను.దీన్ని ఎలా గెలవాలో నాకు తెలుసు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవయాని, సాక్షి దగ్గరికి వెళ్లి చాలా ఆనందంగా ఉన్నావు కదా రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు, అని అనగా,"మాటకే పెళ్లి కప్పుకున్నాడు,ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఏ పెళ్లి పనుల్లోని పాలుపంచుకోవట్లేదు" అని అంటుంది సాక్షి. నువ్వు ఈ పనులన్నీ మాని రిషి మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించు.
 

67

అప్పుడు రిషి నీతో అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు అని దేవయాని సాక్షికి సలహా ఇస్తుంది. ఇంతట్లో రిషి,వసుధార ఫోటో చూస్తూ తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉండగా సాక్షి ఆ ఫోన్ని లాక్కుని నాతో పెళ్లి పెట్టుకొని దీని ఫోటో చూస్తూ ఏం చేస్తున్నావ్? అని సాక్షి రిషి ని తిట్టగా రిషి ,పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడం పెద్ద తప్పు. పైగ ఫోన్ కూడా లాక్కున్నావ్ అని చెప్పి చాలా గట్టిగా తిడతాడు .ఈ లోగ దేవయాని అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది.
 

77

వసుధార ఫోటో చూసి మైమరిచిపోతున్నాడు ఆంటీ అని సాక్షి అంటుంది. రిషికి చాలా కోపం వచ్చి గదిలో నుంచి బయటికి వెళ్లిపోమని చెప్తాడు. దేవయాని ,సాక్షి గదిలో నుంచి బయటకు వచ్చేక అప్పుడే జగతి, వాసుధార అక్కడికి వస్తారు. అప్పుడు సాక్షి నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్లిపో అని వసధారని తిట్టగా అదే సమయంలో రిషి గది తలుపు తీస్తాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved