MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?

Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?

Sumanth: అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ కు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. ఏఎన్నార్ నాస్తికుడు.. మరి మీరు దేవుడిని నమ్ముతారా అని ఆయన్ను అడిగారు. మరి సుమంత్ ఏమన్నాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 03 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కష్టపడి స్టార్ గా ఎదిగిన అక్కినేని..
Image Credit : Asianet News

కష్టపడి స్టార్ గా ఎదిగిన అక్కినేని..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. హీరోగానే కాదు స్టూడియో అధినేతగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఇలా అక్కినేని మల్టీ టాలెంట్ చూపించాడు. తనతో పాటు తన కుటుంబం అంతా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన కొడుకులు మనవళ్లు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. మనసాక్షిని నమ్ముతారు నాగేశ్వరావు. చివరి వరకు తన మనసు ఏది చెపితే అదే పాటిస్తారు. చివరి వరకూ అలాగే బ్రతికారు ఏఎన్నార్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దేవుడిని నమ్మని ఏఎన్నార్
Image Credit : Asianet News

దేవుడిని నమ్మని ఏఎన్నార్

అక్కినేని నాగేశ్వరావు దేవుడి ఉనికిని నమ్మని స్పష్టమైన నాస్తికుడనే (Atheist) విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో పరమ భక్తుడి పాత్రలు చేసిన ఏఎన్నార్.. నిజజీవితంలో మాత్రం దేవుడిని నమ్మరు. అయితే, ఆయన వారసులు కూడా అదే భావజాలాన్ని కలిగి ఉన్నారా? దేవుడిపై వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనేది అభిమానుల్లో ఆసక్తికరమైన అంశం. రీసెంట్ గా ఈ విషయంపై ఆయన మనవడు సుమంత్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆయన ఏమని రియాక్ట్ అయ్యారంటే?

35
దేవుడిపై నమ్మకం ఉందా?
Image Credit : stockPhoto

దేవుడిపై నమ్మకం ఉందా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్కినేని మనవడు, ప్రముఖ నటుడు సుమంత్‌ను ఈ ప్రశ్నే అడగారు ఓ మీడియా ప్రతినిధి. ఏఎన్నార్ నాస్తికుడు కదా, మరి దేవుడిపై మీ నమ్మకం ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా, సుమంత్ తనదైన స్టైల్ లో డిఫరెంట్ గా ఆన్సార్ చేశాడు. దైవ చింతన, నమ్మకాల గురించి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

45
సుమంత్ ఏమన్నాడంటే?
Image Credit : google

సుమంత్ ఏమన్నాడంటే?

తన తాతగారి సిద్ధాంతానికి, తన వ్యక్తిగత నమ్మకానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ సుమంత్ డిఫరెంట్ గా సమాధానం చెప్పారు. సుమంత్ మాట్లాడుతూ.. ''నేను పూర్తిగా నాస్తికుడిని (Agnostic) కాదు.. దేవుడు లేడు అని చెప్పే ఎథియస్ట్ (Atheist) కాదు, నేను 'అగ్నోస్టిక్' (Agnostic) భావజాలం ఉన్న వ్యక్తిని. అంటే ప్రపంచాన్ని నడిపించే ఒక బలమైన శక్తి (Higher Power) ఖచ్చితంగా ఉందనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను'' అని ఆయన పేర్కొన్నారు.

55
అగ్నోస్టిక్ అంటే ఎవరు?
Image Credit : Asianet News

అగ్నోస్టిక్ అంటే ఎవరు?

సమాజంలో వివిధ మతాలు, సంప్రదాయాలు ఆ ఉన్నత శక్తిని వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. బలమైన శక్తిపై నమ్మకం ఉన్నప్పటికీ.. విపరీతంగా గుళ్లకు వెళ్లడం లేదా రెగ్యులర్ పూజలు చేయడం వంటివి చేయనని వారిని అగ్నోస్టిక్ అంటారు. సుమంత్ తాను అగ్నోస్టిక్ అని ఫ్రాంక్ గా చెప్పాడు. 

అక్కినేని నాగేశ్వరరావు దేవుడి ఉనికినే ప్రశ్నించే నాస్తిక భావాలను కలిగి ఉంటే, ఆయన మనవడు సుమంత్ మాత్రం విశ్వాన్ని నడిపించే ఏదో ఒక ఉన్నత శక్తి ఉందనే అగ్నోస్టిక్ కోణాన్ని విశ్వసిస్తున్నారు. పూజా పునస్కారాల కంటే ఆ శక్తి ఉనికిపై నమ్మకమే ముఖ్యమని సుమంత్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్‌ త్రిగుణ్ పై అపూర్వ ఫైర్.. రోజు రోజుకి పెరుగుతున్న రచ్చ..
Recommended image2
Hanuman Ansh: 55 రోజుల్లో 420 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్ అన్ష్
Recommended image3
అరెరె.. ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 44 ఏళ్ల వయసులో ఏం చేస్తోందంటే?
Related Stories
Recommended image1
Padi Pantalu Review: 13 ప్లాపులు, కృష్ణ పని అయిపోయిందన్నారు, సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
మనుషుల్ని తినేవారు ఇంకా ఉన్నారా? ఉమా తెలుగు ట్రావెలర్ సాహస యాత్రలో షాకింగ్ విషయాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved