MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో

Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో

Daredevil: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 64వ సినిమాకు 'డేర్‌డెవిల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అజిత్ భార్య షాలిని నిర్మించబోతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 03 2026, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అజిత్ నెక్స్ట్ సినిమా టైటిల్ 'డేర్‌డెవిల్'
Image Credit : Asianet News

అజిత్ నెక్స్ట్ సినిమా టైటిల్ 'డేర్‌డెవిల్'

తమిళ ఇండస్ట్రీలో 'సూపర్ స్టార్' రజినీకాంత్, 'దళపతి' విజయ్ రేంజ్‌లో స్టార్‌డమ్ ఉన్న హీరో 'తల' అజిత్ కుమార్. అయితే, విజయ్ ఇప్పుడు సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వచ్చేశారు. అజిత్ కూడా తన 63వ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. ఆ సినిమా తర్వాత తనకు ఇష్టమైన కార్ రేసింగ్‌లతో బిజీగా గడిపారు. తన ప్రొఫెషనల్ ప్రత్యర్థి విజయ్ కూడా పక్కకు తప్పుకోవడంతో, అజిత్ తర్వాతి సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో, అజిత్ 64వ సినిమా ప్రకటన వాళ్లకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. అజిత్ నెక్స్ట్ మూవీకి 'డేర్‌డెవిల్' (DAREDEVIL) అని పేరు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భర్త అజిత్ సినిమాను నిర్మిస్తున్న షాలిని
Image Credit : others

భర్త అజిత్ సినిమాను నిర్మిస్తున్న షాలిని

ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు 'డేర్‌డెవిల్' (DAREDEVIL) అనే టైటిల్‌తో ఓ స్పెషల్ పోస్టర్‌ను టీమ్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఎరుపు, తెలుపు రంగుల కాంబినేషన్‌లో, పాచికలపై అక్షరాలు చెక్కినట్లు ఉన్న ఈ డిఫరెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అజిత్ కొత్త సినిమా ప్రకటన ఒక సర్‌ప్రైజ్ అయితే, ఈ 'డేర్‌డెవిల్' సినిమాను ఆయన భార్య, నటి షాలిని నిర్మించడం ఎవరూ ఊహించని మరో సర్‌ప్రైజ్. అవును.. అజిత్ కుమార్ సినీ కెరీర్‌లోనే మొదటిసారిగా, ఆయన భార్య షాలిని అజిత్ కుమార్ తన 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్' (Bravehearts Production) బ్యానర్‌పై ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. అజిత్ భార్యే స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

34
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న షాలిని
Image Credit : Asianet News

సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న షాలిని

షాలిని చివరిసారిగా 2001లో వచ్చిన 'ప్రియురాలు పిలిచింది' అనే  సినిమాలో నటించారు. ఆ తర్వాత అజిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో, నటనకు పూర్తిగా దూరమయ్యారు. చాలామంది మాజీ హీరోయిన్లు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న టైంలో, షాలిని కూడా కమ్‌బ్యాక్ ఇస్తారా? అని అభిమానులు  ఎదురుచూశారు. ఇప్పుడు, నటిగా కాకుండా నిర్మాతగా, అదీ తన భర్త సినిమాతోనే షాలిని రీఎంట్రీ ఇవ్వడం  అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

44
అజిత్ - ఆధిక్ కాంబో మళ్లీ రికార్డ్ క్రియేట్ చేస్తుందా?
Image Credit : Google

అజిత్ - ఆధిక్ కాంబో మళ్లీ రికార్డ్ క్రియేట్ చేస్తుందా?

ఇప్పటికే అజిత్ - ఆధిక్ రవిచంద్రన్ కాంబోలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిందని టాక్. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తోంది. అజిత్ 'డేర్‌డెవిల్' సినిమాకు 'రాక్ స్టార్' అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి, ఫైట్స్: సుప్రీమ్ సుందర్, కాస్ట్యూమ్ డిజైన్: అను వర్ధన్ వంటి టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. హీరోయిన్, షూటింగ్ వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
మనుషుల్ని తినేవారు ఇంకా ఉన్నారా? ఉమా తెలుగు ట్రావెలర్ సాహస యాత్రలో షాకింగ్ విషయాలు..
Recommended image2
Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved