- Home
- Entertainment
- Guppedantha Manasu: నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను వసుధర.. మనసులో మాట చెప్పేసిన రిషీ!
Guppedantha Manasu: నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను వసుధర.. మనసులో మాట చెప్పేసిన రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) వసుదార (Vasudhara) ఐ లవ్ యు అనే గిఫ్ట్ ను డిజైన్ చేపించి దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేపిస్తాడు. ఈ లోపు వసు ఎగ్జామ్ బాగా రాశాను అంటూ ఆనందంగా బయటకు వస్తుంది. ఇక రిషి కి ఫోన్ చేసి ఎగ్జామ్ చాలా బాగా రాశారు అంటూ అంటూ హ్యాపీ గా పంచుకుంటుంది.
మరోవైపు ధరణి (Dharani) పెద్ద అత్తయ్య ఇంతా ధీమాగా ఉన్నారంటే.. ఏదో దుర్మార్గపు ఆలోచన చేసే ఉంటుంది అని జగతి (Jagathi) తో చెబుతుంది. ఇక రిషి ఎగ్జామ్ సెంటర్ కి వచ్చి ఫోన్ చేయగా వసు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక రిషి డైరెక్ట్ గా వసు దగ్గరకి వెళతాడు. వసు అలసట గా ఉందని ఇక్కడ కూర్చున్నాను అని అంటుంది.
ఇక వసు (Vasu) కాలం జరుగుతున్న కొద్దీ నేనేంటో మీకు అర్థం అయింది అని రిషి (Rishi) తో అంటుంది. మీరు ఏంటో నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో ఒకరి మీద ఒకరికి కోపం రావడం తగ్గిపోయింది అని వసు అంటుంది. ఇక రిషి మన ఆలోచనల్లో ఎందుకు ఇంత మార్పు వచ్చిందని నేను ఎంత ఆలోచించినా తట్టడంలేదు అని అంటాడు.
ఇక తర్వాత ఈ జంట కారులో వెళ్తూ ఉండగా.. కొంతకాలంగా మీలో ఏదో మార్పు కనిపిస్తుంది సార్ అని వసు (Vasu) అంటుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ దాహం వేయగా కొబ్బరిబొండాలు తాగడానికి వస్తారు. ఇక (Rishi) రిషి జ్ఞాపకాలు ఎంత అందమైవో కదా అని వసు తో అంటాడు. ఇక రిషి ఎగ్జామ్ రాశాక నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని అన్నాను మరి ఆ గిఫ్ట్ గురించి అడగవా అని అంటాడు.
ఇక వసు (Vasu) అడిగి తీసుకుంటే అది గిఫ్ట్ ఎలా అవుతుంది అని అంటుంది. ఈ క్రమంలో రిషి (Rishi) ఎందుకో ఏమైందో కానీ.. వసు రిషి అయ్యాడు. రిషి నె వసు అయ్యింది అన్నట్లు ఒక మాయగా అనిపిస్తుంది అని అంటాడు. నువ్వు నేను అయ్యానో.. లేక నేనే నువ్వయ్యావో తెలియని పరిస్థితి అని అంటాడు.
ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) ఐలవ్యూ వసు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ గిఫ్ట్ ఇస్తాడు. అంతేకాకుండా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఇక వసు (Vasu) కూడా మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ.. రిషిని వెనుకనుంచి కౌగిలించుకుంటుంది.