- Home
- Entertainment
- Guppedantha Manasu: మిషన్ ఎడ్యుకేషన్‌లోకి సాక్షి ఎంట్రీ.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర, జగతి!
Guppedantha Manasu: మిషన్ ఎడ్యుకేషన్‌లోకి సాక్షి ఎంట్రీ.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర, జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈరోజు జులై 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిషీ చెప్తుంటాడు. ఇక నుంచి మిషన్ ఎడ్యుకేషన్ మనల్నే నడిపిస్తుంది అని చెప్తాడు. చదువుల పండుగ అనే పేరు మరో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పగా జగతిని ఫైల్ అడుగుతాడు. అప్పుడు వసు ఫైల్ మిస్ అయ్యిందని చెప్తే జగతి సీరియస్ అవుతుంది. అది చూసిన రిషి మరి ఫైల్ ఇవ్వండి అని చెప్తాడు.
ఇక అప్పుడే సీన్ లోకి సాక్షి ఎంట్రీ ఇస్తుంది. మీ పర్మిషన్ తో నేను ఈ మీటింగ్ లో కూర్చోవచ్చా అని సాక్షి అడిగితే సరే అని చెప్తాడు. ఆ మాటలకూ వసుధార ఫీల్ అవుతుంది. అసలు సాక్షికి ఇక్కడ ఏం అవసరం అని అనుకుంటుంటారు. నేను కొన్ని ఐడియాలతో వచ్చాను మిషన్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్తుంది. ఆ మాటలకూ అందరూ షాక్ అవుతారు. అప్పుడు రిషి మాట్లాడుతూ మీరు అందరూ ఒకే అంటే సాక్షిని ఈ ప్రాజెక్టు లోకి తీసుకుంటాను అని అంటాడు. ఆ మాటకు వసుధార ఫీల్ అవుతుంది.
ఇక సాక్షి తన ఐడియాస్ ను రిషీకి చెప్తుంది. అసలు రిషీ ఏం చేస్తున్నాడో అర్ధం చేసుకోలేక మహేంద్ర, జగతి ఆలోచనలో పడుతారు. ఇక వసు ఫైల్ సాక్షి కొట్టేసిందని జగతి, వసు అర్ధం చేసుకుంటారు. సాక్షి చెప్పిన ఐడియాను రిషీ కూడా ఒకే చేస్తాడు. ఇక మరో సీన్ లో జగతి, వసుధార ఇద్దరు ఫైల్ పోగొట్టడం గురించి మాట్లాడుతుంటారు. మీటింగ్ లో ఆ ఫైల్ లేకపోవడం ఏంటి అని అడుగుతుంది. జీవితంలో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం అని జగతి వసుకు క్లాస్ ఇస్తుంది.
వసు జగతి మాట్లాడుకునేది చూసి సాక్షి నవ్వుకుంటూ నీ ఫైల్ కొట్టేసింది నేనే అని మనసులో అనుకుంటుంది. నా స్టైల్ మార్చుకున్న వసుధార.. నిన్ను ద్వేషించుకుంటూ రిషీకి దగ్గర అవ్వడం కంటే నీ పక్కనే ఉంటూ రిషీకి దగ్గర అవుతా అని కొత్త ప్లాన్ ఫాలో అవుతున్న అని సాక్షి అనుకుంటుంది. నీకు తెలియకుండానే నీ తెలివితేటలు ఎలా వాడుకుంటానో చూడు అని అనుకుంటూ వెళ్తుంది. మరోవైపు రిషీ వెళ్లే సమయంలో సాక్షి వస్తుంది.
ఇక వసుధార అక్కడ ఉందని తెలుసుకొని వసును క్యాబ్ లో పంపించి నేను రిషితో కారులో వెళ్తాను అని మరో ప్లాన్ వేస్తుంది. అయితే రిషీ ఆ ప్లాన్ మారిపోయేలా చేస్తాడు. నేను వసు కలిసి ఇంటి దగ్గర పని చెయ్యాలి అనుకున్నాం నువ్వు వచ్చి ఏం చేస్తావ్ అని అంటాడు. అప్పుడు ప్లీజ్ రిషి అని వేడుకుంటుంది. దీంతో ఒకే చెప్తాడు. ఆ మాటలకూ షాక్ అయిన వసు కారులో కూర్చోడానికి వెళ్ళగా వసును తోసేసి తను వెళ్లి ముందు కూర్చుంటుంది.
మరో సీన్ లో సాక్షిని రిషి ఎలా క్షమిస్తాడు.. ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకోవడం మంచిది కాదు అని తెలియదా అని రిషిని తిట్టుకుంటుంది. మరోవైపు సాక్షి ప్లాన్ లా మీద ప్లాన్ లు వేస్తుంది. అప్పట్లో ఎంగేజ్మెంట్ విషయాన్నీ తీసుకొచ్చి వసు, రిషీలను ఇబ్బంది పెడుతుంది. తన గురించి గొప్పలు చెప్పుకుంటూ.. అన్ని బాగుంటే ఈపాటికి మనకు పెళ్లి అయ్యి ఉండేది కదా అని అంటుంది. అంతే కోపం తెచ్చుకున్న వసుధార ఆపుతారా మీ సోది అని అంటుంది. అంతే అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.