MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం

Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం

బిగ్‌ బాస్‌ తెలుగు 9లో ముందుగా ఇమ్మాన్యుయెల్‌ విన్‌ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో తనలో ఉన్న అసహనాన్ని బయటపెట్టాడు ఇమ్మాన్యుయెల్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 02 2026, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌గా కళ్యాణ్‌ పడాల
Image Credit : youtube/@JioHotstarTelugu

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌గా కళ్యాణ్‌ పడాల

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో రెండు వారాల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. కామన్‌ మ్యాన్ కళ్యాణ్‌ పడాల షో విన్నర్‌గా నిలిచాడు. ఎవరూ ఊహించని విధంగా కప్‌ గెలిచాడు. కామన్‌ మ్యాన్‌గా వచ్చి కప్‌ కొట్టుకుపోయాడు. చాలా మంది సెలబ్రిటీలను దాటుకుని ఆయన విజేతగా నిలవడం విశేషం. అయితే బిగ్‌ బాస్‌ షో టీమ్‌ మాత్రం ఈ సారి విన్నర్ గా తనూజనిగానీ, ఇమ్మాన్యుయెల్‌ని గానీ చేయాలనుకున్నారట. నిర్వాహకుల మదిలో వీరిద్దరే ఉన్నారు. బట్‌ చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఇమ్మాన్యుయెల్‌
Image Credit : youtube/@starmaa

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఇమ్మాన్యుయెల్‌

అయితే ముందుగా ఈ సీజన్‌ విన్నర్‌ ఇమ్మాన్యుయెల్‌ అని అంతా అనుకున్నారు. సోషల్‌ మీడియాలోనూ అదే చర్చ నడిచింది. ఎందుకంటే ఇమ్మూ అటూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. గతంలో ఏ సీజన్‌లోనూ కమెడియన్లు చేయనంత కామెడీ ఇమ్మాన్యుయెల్‌ చేయడం విశేషం. ఈ విషయాన్ని మరో కమెడియన్‌ అవినాష్‌ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అందరితోనూ మంచి రిలేషన్‌ కొనసాగించాడు. ఎవరితోనూ గొడవలు లేవు. అదే సమయంలో టాస్క్ ల విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. తనకంటే బలమైన కళ్యాణ్‌, డీమాన్ పవన్‌లకు దీటుగా ఆయన గేమ్స్ ఆడి మెప్పించాడు. విజయం సాధించాడు.

Related Articles

Related image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Related image2
Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌
35
ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయాలనుకున్న బిగ్‌ బాస్‌ టీమ్‌
Image Credit : youtube/@starmaa

ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయాలనుకున్న బిగ్‌ బాస్‌ టీమ్‌

బిగ్‌ బాస్‌ షో మూడు సార్లు కెప్టెన్‌ అయ్యాడు. ఒక కంటెస్టెంట్ ఇలా మూడు సార్టు కెప్టెన్‌ కావడం ఇమ్మూ విషయంలో జరిగింది. ఆయన పర్సనల్ లైఫ్‌లోనూ చాలా డ్రామా ఉంది. ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాడు. బెస్ట్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. దీంతో బిగ్ బాస్‌ షో విన్‌ అయ్యే లక్షణాలు అన్నీ ఆయనకు ఉన్నాయని అంతా భావించారు. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా అదే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కళ్యాణ్‌ని చేశారు. అయితే నామినేషన్స్ లో ఎక్కువగా లేకపోవడమే ఇమ్మూకి పెద్ద మైనస్‌గా మారిందని చెబుతున్నారు. మొత్తంగా ఇమ్మూ టాప్‌ 4వ స్థానంలో హౌజ్‌ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే  ఎలిమినేట్‌ అయినప్పుడు చాలా బాధపడ్డాడు ఇమ్మూ. ఆ బాధ ఆయన మొహంలో కనిపించింది. ఎంతో నిరాశతో, అసహనంతో కనిపించారు. అన్నీ తనలో దిగమింగుకున్నాడు.

45
మా కమెడియన్లకి కప్‌ ఇవ్వరా? - అవినాష్‌
Image Credit : youtube/@starmaa

మా కమెడియన్లకి కప్‌ ఇవ్వరా? - అవినాష్‌

తాజాగా ఆ అసహనం బయటపడింది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు అంతా తాజాగా యాంకర్‌ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న `ఆదివారం స్టార్‌ మా పరివారం`లో పాల్గొన్నారు. ఇందులో కళ్యాణ్‌, శ్రీజ, ఇమ్మాన్యూయెల్‌, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, దివ్య, భరణి, సుమన్‌ శెట్టి, సంజనా గల్రానీ, రాము రాథోడ్‌ పాల్గొన్నారు. కళ్యాణ్‌ పడాల విన్నర్‌ గా నిలిచిన నేపథ్యంలో అతన్ని అదిరిపోయే పంచ్ లతో ప్రశంసించారు. అనంతరం ఇమ్మాన్యుయెల్‌ని పట్టుకుని మా కామెడియన్లకి కప్‌ ఎందుకు ఇవ్వలేదంటూ కామెడీగా ప్రశ్నించాడు అవినాష్‌. దీనికి వామ్మో అంటూ ఇమ్మూ రియాక్ట్ కావడం నవ్వులు పూయించింది.

55
బిగ్‌ బాస్‌ షోలో ఎంటర్‌టైన్‌ చేయకండి - ఇమ్మాన్యుయెల్‌
Image Credit : youtube/@starmaa

బిగ్‌ బాస్‌ షోలో ఎంటర్‌టైన్‌ చేయకండి - ఇమ్మాన్యుయెల్‌

ఇమ్మాన్యుయెల్‌ని లో లవ్‌ ట్రాక్‌ ఎందుకు పెట్టుకోలేదని అవినాష్‌ అడగ్గా పెట్టుకుందామనుకుంటే శ్రీజ వెళ్లిపోయింది, ఆ తర్వాత ప్రియా వెళ్లిపోయింది. ఇక మిగిలింది మాధురీగారే అని చెప్పడంలో నవ్వులు పూయించింది. అనంతరం పదో సీజన్‌కి వెళ్లాలనుకునే మీలాంటి ఎంటర్‌టైనర్లకి మీరిచ్చే సజేషన్స్ ఏంటి అని ప్రశ్నించగా, `ఎంటర్‌టైన్‌ చేయకండి` అంటూ సంచలన కామెంట్‌ చేశాడు ఇమ్మూ. అయితే ఆ సమయంలో సరదాగానే ఆయన రియాక్ట్ అయినా, అంతర్లీనంగా తన అభిప్రాయం ఇదే అనేది అర్థమవుతుంది. తనలో ఉన్న అసహనాన్ని ఆయన ఇలా వ్యక్తం చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇమ్మూ చెప్పింది నిజం, కామెడీ చేసిన వాళ్లకి కప్‌ ఇవ్వరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిప్పుడు రచ్చ అవుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Recommended image2
Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved