- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 గ్రాండ్ ఫినాలే రికార్డ్ రేటింగ్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్
Bigg Boss Telugu 9 గ్రాండ్ ఫినాలే రికార్డ్ రేటింగ్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలే రెండు వారాల క్రితం ముగిసింది. అయితే ఈ గ్రాండ్ ఫినాలే రేటింగ్ డిటెయిల్స్ వచ్చాయి. గత ఐదు సీజన్లలోనే అత్యధిక రేటింగ్ వచ్చినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

క్యూరియాసిటీ క్రియేట్ చేసిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21(ఆదివారం)న జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అత్యంత క్యూరియాసిటీని క్రియేట్ చేసిన షోగా ఈ గ్రాండ్ ఫినాలే నిలిచింది. ఎందుకంటే విన్నర్ ఎవరనేది సస్పెన్స్ గా నెలకొన్న నేపథ్యంలో, ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కామన్ ఆడియెన్స్ నుంచి, బిగ్ బాస్ లవర్స్ వరకు అంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. మరికొందరు జీయో హాట్ స్టార్‌లో వీక్షించారు.
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే రికార్డ్ రేటింగ్
అయితే తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే రేటింగ్ బయటకు వచ్చింది. రికార్డు టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. తాజాగా ఈ విషయాన్ని స్టార్ మా, నాగార్జున ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సీజన్ ఏకంగా 19.6టీవీ రేటింగ్ వచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు గత ఐదు సీజన్లలో ఇదే టాప్ అని వెల్లడించారు. నిస్సందేహంగా ఈ సీజన్ అన్ని షోలకు కింగ్‌గా నిలిచినట్టు తెలిపారు.
నాగార్జున ఎమోషనల్ పోస్ట్
నాగార్జున ఈ విషయాన్ని చెబుతూ, అజేయం, అద్వితీయం, స్టార్ మాలో 19.6 టీవీఆర్, జీయో హాట్ స్టార్‌లో 285 మిలియన్ నిమిషాలు వీక్షించారు. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గత 5 ఏళ్లలోనే అతిపెద్దదిగా నిలిచింది. భావోద్వేగాలు, ఉత్సాహం, సంఘర్షణలు, మరిచిపోలేని క్షణాలతో నిండిన సీజన్ ఇది. ఈ ప్రయాణం వెనుక ఉన్న ప్రతి పోటీదారుడికి, ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేసిన స్టార్ మా టీమ్‌కి, జీయో స్టార్ వాళ్లకి, అలాగే ఎండెమాల్‌షైన్ ఇండియా బృందానికి, అన్నింటికంటే ముఖ్యంగా, తమ ప్రేమ, అచంచలమైన సపోర్ట్ తో ఈ సీజన్‌ని నిజంగా చరిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు` అని తెలిపారు నాగార్జున. ఆయన పంచుకున్న ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ సీజన్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల
నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు 9 షో దాదాపు 22 మంది కంటెస్టెంట్లతో రన్ అయిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ ఈవెంట్‌లో 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టగా, ఆ తర్వాత మధ్యలో ఒకరు, వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు వచ్చారు. ఇందులో ఏడుగురు కామనర్స్ పాల్గొనగా, మిగిలిన వారు సెలబ్రిటీలు కావడం విశేషం. వారిని కాదని కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ కప్ గెలుచుకున్నాడు. తనూజ రన్నరప్‌గా నిలవగా, మూడో స్థానంలో డీమాన్ పవన్ నిలిచాడు. అయితే ఆయన 15 లక్షల సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చాడు. నాల్గో స్థానంలో ఇమ్మాన్యుయెల్, ఐదో స్థానంలో సంజనా నిలిచారు.

