- Home
- Entertainment
- 2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
మలయాళీ మిస్టరీ థ్రిల్లర్ ఎకో మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇది గుడ్ న్యూస్. వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ ఎకో
మలయాళీ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతన్ థ్రిల్లర్ సినిమాలతో పాపులర్ అవుతున్నారు. 2024లో ఆయన తెరకెక్కించిన కిష్కింద కాండం సినిమా సూపర్ హిట్ అయింది. ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 2025లో ఆయన తెరకెక్కించిన మరో థ్రిల్లర్ సినిమా ఎకో. గతేడాది బెస్ట్ మూవీస్ లో ఎకో ఒకటిగా నిలిచింది. మలయాళీ థ్రిల్లర్ సినిమాలు ఇటీవల ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఎకో సినిమా సూపర్ హిట్ కావడంతో దీని కోసం కూడా ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. కాకపోతే అది మలయాళం వెర్షన్ మాత్రమే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్ లని జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు.
ప్రకటించిన డేట్ కంటే ముందుగానే తెలుగు వెర్షన్
దీనితో తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి నెట్ ఫ్లిక్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. చెప్పిన డేట్ కంటే ముందుగానే ఎకో తెలుగు వెర్షన్ ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు.జనవరి 3 నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. సో ఓటీటీ అభిమానులు ఈ వీకెండ్ పండగే అని చెప్పొచ్చు.
కథ ఏంటంటే
మలేషియాకి చెందిన మ్లాతీ అనే మహిళ కేరళ అడవుల్లో జీవిస్తూ ఉంటుంది. ఆమె సంరక్షణ బాధ్యతని ఆమె కుమారులు పీయెస్ అనే యువకుడికి అప్పగిస్తారు. అతడితో పాటు మలేషియన్ బ్రీడ్ కి చెందిన కుక్కలు కూడా ఉంటాయి. అయితే కొన్నేళ్ల క్రితం నుంచి కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి కోసం పోలీసులు, విలన్లు వెతుకుతుంటారు. అతడు గతంలో కుక్కల సంరక్షకుడిగా పనిచేసి ఉంటాడు. అసలు కురియాచన్ ఏం చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు.. మ్లాతీ ఎందుకు కేరళ అడవుల్లో జీవిస్తోంది ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
డైరెక్టర్ దిన్జిత్ అయ్యతన్
ప్రతిభ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతన్ ప్రతిభకి ఈ చిత్రం నిదర్శనం అని చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం రెప్ప వాల్చకుండా చూసే విధంగా ఉంటుంది. ట్విస్టులు మతిపోగొట్టేలా ఉంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, లొకేషన్స్ ఇలా అన్ని విషయాల్లో గొప్ప సినిమా చూశాం అనే అనుభూతి కలుగుతుంది.

