- Home
- Entertainment
- Guppedantha Manasu: అతిగా రియాక్ట్ అవుతున్న దేవయాని.. పాండ్యన్ చేసిన పనికి ఫిదా అయిన రిషి?
Guppedantha Manasu: అతిగా రియాక్ట్ అవుతున్న దేవయాని.. పాండ్యన్ చేసిన పనికి ఫిదా అయిన రిషి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను వద్దు అనుకుంటున్నా ప్రియురాలు తన కళ్ళముందు తిరుగుతుంటే మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ఒక ప్రియుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు బయటకి ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాక రాత్రంతా నిద్ర పట్టలేదు. అయినా ఇంట్లో ఉన్నది ఆరుగురమే అందులో మీరు వెళ్లిపోతే ఎలా అయినా లంక అంత కొంపలో మేము ఎలా ఉంటాము. మీ అన్నయ్య సంగతి తెలుసు కదా మహేంద్ర నువ్వు లేకపోతే భోజనం కూడా చేయరు.
మరెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వండి అని మహేంద్రని అడుగుతుంది దేవయాని. అక్కడ ఉంటే మిషన్ ఎడ్యుకేషన్ కానీ తొందరగా అవుతుందని వెళ్ళాము ఇంకెప్పుడు ఇలా చేయము అంటాడు మహేంద్ర. నువ్వు కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నావేమో అంటాడు ఫణీంద్ర. అదేంటి అలా అంటారు. మనసులో మాట చెప్తే మీకు అలా అనిపిస్తుందా..
అయినా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను మీకేం తెలుసు. శైలేంద్ర కూడా రాత్రి నా దగ్గరికి వచ్చి ఎంత బాధ పడ్డాడో అంటూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది దేవయాని. సరేలెండి ముందు ఇంట్లోకి వచ్చి రెస్ట్ తీసుకోండి అని మహేంద్ర వాళ్ళకి చెప్పి ధరణితో లగేజ్ లోపల పెట్టిస్తుంది దేవయాని. మరోవైపు కాలేజీకి వచ్చిన రిషి ని ప్రిన్సిపాల్ తన దగ్గరికి పిలిపించుకుంటాడు.
గవర్నమెంట్ దగ్గర నుంచి సెమినార్ కండక్ట్ చేయమని ఆఫర్ వచ్చింది దీనిని మనం యూస్ చేసుకోవాలి అని చెప్తాడు. సరే సార్ పవర్ ఆఫ్ స్టడీస్ అనే టాపిక్ మీద సెమినార్ కండక్ట్ చేద్దాము. ఈ సెమినార్ ని సక్సెస్ చేసే బాధ్యత నాది అంటాడు రిషి. సెమినార్ కి ఏ ఏ కాలేజీ ఇన్వైట్ చేయాలో నేను చూసుకుంటాను అంటాడు ప్రిన్సిపల్. సరే అంటూ బయటికి వస్తున్న రిషి ఫోన్లో డాక్టర్ తో మాట్లాడుతూ వసుధార మేడమ్ కి స్టిచెస్ కి ఎప్పుడు రిమూవ్ చేస్తారు అని అడుగుతాడు.
డాక్టర్ ఏదో చెప్పటంతో సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఈ మాటలు విన్న కొందరు స్టూడెంట్స్ రిషి సార్ వసుధార మేడం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటూ వల్గర్ గా మాట్లాడుతారు. ఆ మాటలు విన్న రిషి కోపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతాడు కానీ అప్పుడే పాండ్యన్ అక్కడికి వచ్చి లెక్చర్స్ గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటూ వాళ్లకి క్లాస్ పీకుతాడు. నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావా అంటారు వాళ్ళు.
నేను కూడా ఒకప్పుడు నీలాగే మాట్లాడిన వాడినే కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను కాబట్టి మీతో ఇలా మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే రిషి ఆపి నీలో ఇంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ పాండ్యన్ కి హగ్ ఇస్తాడు. స్టూడెంట్స్ సేపు తిరిగి చేసే పనిలో తప్పు వెతకడం కాదు కారణం వెతకండి.
మీకు తప్పు కనిపిస్తే వెంటనే నిలదీయండి అంతేకానీ ఇలా వెనక చాటుమాటు మాటలు మాట్లాడకండి అది మీ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది అని చెప్పటంతో స్టూడెంట్స్ అందరూ రిషికి సారీ చెప్తారు. స్టూడెంట్స్ అందరినీ అసెంబ్లీ చేయమని పాండ్యన్ కి పురమాయిస్తాడు రిషి. స్టూడెంట్స్ అందరూ అసెంబ్లీ అయిన తరువాత వాళ్లు కండక్ట్ చేయబోయే సెమినార్ గురించి వివరిస్తాడు రిషి అందుకోసం నాకు కొందరు వాలంటీర్స్ కావాలి అంటాడు.
పాండ్యన్ వాళ్లతో పాటు మొత్తం స్టూడెంట్స్ అందరూ మేము మీతో పని చేయటాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అంటారు. హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రిషి ని వసుధారకి డ్రెస్సింగ్ చేయడం నాకు రాదు కొంచెం హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజెల్. ముందు చెయ్యను అంటాడు కానీ ఏంజెల్ రిక్వెస్ట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ చేస్తాడు.
నీకు డ్రెస్సింగ్ చేశాడు కదా అందుకు థాంక్స్ చెప్పవా అంటుంది ఏంజెల్. మనసులో 100 సార్లు చెప్పుకున్నాను అనుకుంటూ బయటికి మాత్రం థాంక్స్ అని ముక్తసరిగా చెప్తుంది వసు. సమాధానం ఏమీ చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. తన గదిలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు పదేపదే నా కాలికి అడ్డం పడుతున్నావు అంటూ వసుని తలుచుకొని బాధపడుతుంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.