- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
బిగ్ బాస్ తెలుగు 9 లో ఈసారి కప్ నాదే అని ఓ కంటెస్టెంట్ బలంగా చెప్పారు. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో అలాంటివాళ్ళు టైటిల్ గెలిచినట్లు లేదు. అయినా తనకి కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 9
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది. ఇక హౌస్ లో మరో వారం మాత్రమే ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో టాప్ 5 కి చేరుకునేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి వారు టాప్ 5 లో కన్ఫర్మ్ అని అభిమానులు నమ్ముతున్నారు.
నాగార్జున రివ్యూ
బిగ్ బాస్ హౌస్ లో 90వ రోజు వీకెండ్ శనివారం కావడంతో నాగార్జున డయాస్ పైకి వచ్చారు. ఏఈ వారం జరిగిన పరిణామాలపై రివ్యూ చేశారు. భరణి, రీతూకి మధ్య జరిగిన టాస్క్ లో.. భరణి ఒక ఆకారం ట్రైయాంగిల్ కాదని గొడవ చేసిన సంగతి తెలిసిందే. దానిపై నాగార్జున రివ్యూ చేశారు. అసలు ట్రైయాంగిల్ అంటే ఏంటి అని భరణి, సంజనలని అడిగారు. అది జస్ట్ తయారు చేసేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది అని.. అది ట్రైయాంగిల్ అని నాగార్జున తెలిపారు.
కళ్యాణ్ పై ప్రశంసలు
టాస్క్ బాగా ఆడిన భరణి, సుమన్ శెట్టి లని నాగార్జున అభినందించారు. అదే విధంగా తొలి ఫైనలిస్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కళ్యాణ్ ని కూడా అభినందించారు. ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్కరిని పిలిచి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి.. దానిని గెలుచుకునేందుకు నీవు ఎందుకు అర్హుడివి అనేది చెప్పాలి అని అడిగారు.
బిగ్ బాస్ హౌస్ లో ఇమ్మాన్యుయేల్ అనుభవం
వాళ్ళు చెప్పిన సమాధానం విని ఇతర సభ్యులు థమ్స్ అప్ లేదా డౌన్ ఇవ్వాలి. ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హౌస్ లోకి అడుగుపెట్టేటప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తే సులభంగా కప్ గెలవచ్చు అనుకున్నా. కానీ స్టేజ్ పై ఉండి నవ్వించడం వేరు.. హౌస్ లో ఈ కోపాలు, భాదలు, ఏడుపులు ఇన్ని ఎమోషన్స్ మధ్య ఉండి నవ్వించడం వేరు అని తెలుసుకున్నా.
ఈసారి కప్ నాదే అంటున్న ఇమ్ము
అయినప్పటికీ సక్సెస్ ఫుల్ గా నవ్వించగలిగాను. ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతవరకు ఎంటర్టైన్ చేసే వాళ్ళు గెలవలేదు. ఈసారి మాత్రం కప్ నాదే అని బలంగా నమ్ముతున్నట్లు ఇమ్మాన్యుయేల్ కామెంట్స్ చేశారు. ఇమ్మాన్యుయేల్ చెప్పిన దానికి అందరూ ఏకీభవిస్తూ థమ్స్ అప్ ఇచ్చారు.

