MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: డేట్ కి వెళ్లిన రిషి, వసుధారలు.. వసును షాకింగ్ కోరిక కోరిన దేవయాని!

Guppedantha Manasu: డేట్ కి వెళ్లిన రిషి, వసుధారలు.. వసును షాకింగ్ కోరిక కోరిన దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Sep 08 2022, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దేవయాని, సాక్షితో నిశ్చితార్థం ఆగిపోయినప్పటి నుంచి ఇంట్లో ఏ శుభకార్యము లేదు. దగ్గర్లో జగతి మహీంద్రల పెళ్లిరోజు ఉన్నది. ఇంట్లోనే వాళ్ళిద్దరి పెళ్లి రోజు జరిపించాలన్నది నా కోరిక. దానికి నువ్వే రిషి నీ ఒప్పించాలి అనుకుంటున్నాను. నేను రిషి ని అడిగితే రిషి ఒప్పుకుంటాడు కానీ, జగతి మహీంద్రలు సంతోషంగా చేసుకోలేరు. కనుక ఇది నువ్వు మాత్రమే చేయగలవు అని అంటాది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు వసు మనసులో, ఈవిడ దీనికోసమే అడుగుతున్నారా లేకపోతే ఏమైనా ఆలోచనలు ఉన్నాయని అనుకుంటుంది.అప్పుడు దేవయాని, నిన్ను అడుగుతున్నానని నాకు ఏదైనా ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నావు ఏమో,నాకు ఏ ఉద్దేశమూ లేదు, కేవలం ఇంట్లో పండగ కోసమే అని అంటుంది దేవయాని. మీరు చెప్పింది మంచే మేడం,రిషి సార్ నీ ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటుంది వసుధార. అప్పుడు దేవయాని మనసులో, ఈ మాత్రం నిప్పు పెడితే మంటలు వచ్చేలా నేను చేస్తాను అనుకుంటుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు.
 

37

 మీరేంటి పెద్దమ్మ ఇక్కడికి వచ్చారు అని అనగా వసుధార  ఎలా ఉన్నాదో చూసి వెళ్దాం అని వచ్చాను అని అంటుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో వసు, క్యాబ్ బుక్ చేసుకుని ఒక చోటికి వస్తుంది. గౌతమ్ సర్ ఫోన్ చేసి, రిషి సార్ నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు.గౌతమ్ కి  ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నావట అని అడగగా మీరే  నన్ను రమ్మన్నారు సార్ అని అంటుంది వసు.నీకు గౌతమ్ ఫోన్ చేశాడా అంటే అవును సార్ అని అంటుంది వసు.
 

47

 గౌతమ్ నాకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పాడు అని అంటాడు రిషి.మరోవైపు గౌతమ్ కారులో హాయిగా పడుకొని, వీళ్ళిద్దరిని ఇలా ఒంటరిగా వదిలితేనైనా మాట్లాడుకుంటారేమో అని అనుకుంటాడు. అప్పుడు రిషి ఎలాగో వచ్చాము కదా లోపలికి వెళ్దాం రా అని లోపలికి తీసుకు వెళ్తాడు. అక్కడ బెలూన్లు మధ్య ఒక టేబుల్ అలంకరించి ఉంటుంది. అక్కడికి ఇద్దరు వెళ్లి కూర్చుంటారు. అప్పుడు వసు రిషి తో, చాలా బాగుంది కదా సార్ ఇలాగే ప్రతిసారి పనే కాకుండా, కొన్ని కొన్ని సార్లు ప్రశాంతంగా కూర్చోవడం వల్ల కూడా మనసు బాగుంటది అని అంటుంది.
 

57

అప్పుడు రిషి నువ్వు చెప్తుంటే ఇప్పుడు తెలుస్తుంది వసుధార ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది అని అంటాడు.ఇంతలో గౌతమ్ రిషికి మెసేజ్ చేసి, అలా ఖాళీగా ఉండకుండా అక్కడ ఉన్నవి తింటూ మాట్లాడుకోండి అని అంటాడు. అప్పుడు వసు ఏమైనా తిందామా సర్వ్ చేస్తాను అని అనగా వద్దు ఈ రోజు నేను సర్వ్ చేస్తాను అని రిషి వసుకి భోజనం వడ్డిస్తాడు. ఇద్దరూ ఒకరిని చూసుకుంటూ ఇంకొకరు తింటూ ఉంటారు. అప్పుడు వసు,మీతో ఇక్కడ ఇలా చాలా బాగుంది సార్ అని అంటుంది. అప్పుడు రిషి వసుతో, ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంటాడు. రిషి, వసుకి వడ్డిస్తున్నప్పుడు వసుధార, రిషిని మొదటిసారి చూసినప్పుడు సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది.
 

67

ఏం ఆలోచిస్తున్నావు అని రిషి అనగా మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు ఈ మనిషికి నవ్వడం తెలుసా అని అనుకున్నాను సార్ ఆ సంఘటన చూసి నవ్వు వస్తుంది అని అంటుంది. రిషి కోపంగా చూస్తాడు. అప్పుడు వసు, మీరు ఇలా చూస్తే నేను ఇంకెప్పుడు నిజాలు చెప్పండి సార్ అని అంటుంది.దానికి రిషి నవ్వుకుంటాడు. అలా రిషి వసు నీ చూస్తూ తింటున్నప్పుడు తన స్పూన్ పడిపోతుంది. అప్పుడు వసు ఇంకొక స్పూన్ ఇస్తున్నప్పుడు రిషి వసు తింటున్న స్పూన్ లాక్కొని తింటాడు. మీకు ఇలాంటి పనులు కూడా వచ్చా సార్ అని అనుకుంటుంది వసు. ఇద్దరు భోజనాలు అయిపోతాయి.
 

77

అప్పుడు వసూ చందమామను చూసుకుంటూ ఉంటుంది. దానికి రిషి ఈరోజైనా నువ్వు మీ స్నేహితులతో మాట్లాడడం ఆపి నాతో మాట్లాడతావా అని అంటాడు. సరే సార్అని అంటుంది వసు. అప్పుడు రిషి,ప్రేమికుల అన్నాక గంటలకు కొద్దిగా మాట్లాడుకుంటారు కానీ నాకు మాటలు రావడం లేదు అని అనగా వసుధార, కొన్నిసార్లు మౌనం కూడా సంభాషణే సార్ అని అంటుంది. అంతలో గౌతమ్, భోజనం అయిపోయిందని ఖాళీగా ఉండకండి అక్కడ గ్రీన్ టీ ఉన్నది దాన్ని తాగుతూ సమయం గడపండి అని మెసేజ్ పెడతాడు.అప్పుడు రిషి, వసుధారలు ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved