MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్

AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్

AggiPetti Macha: ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అగ్గిపెట్టి మచ్చ మృతి
Image Credit : Youtube/ ETV Jabardasth

అగ్గిపెట్టి మచ్చ మృతి

సోషల్ మీడియాలో తనదైన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టి మచ్చ’ కిరణ్ కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా యూట్యూబ్ వీడియోలు, వినోద కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 5న ఆసుపత్రిలో చేరిన కిరణ్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే చికిత్స కొనసాగుతున్న సమయంలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కిరణ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బుల్లితెరపై..
Image Credit : Youtube/ ETV Jabardasth

బుల్లితెరపై..

కిరణ్ కుమార్‌కు ‘అగ్గిపెట్టి మచ్చ’ అనే పేరు ఎలా వచ్చిందో కంటే, ఆ పేరుతో ఆయన సంపాదించుకున్న క్రేజ్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆయన మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, ముఖ కవళికలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేవి. ఆయనకు సంబంధించిన వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యేవి. ఈ క్రేజ్‌తో పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. యూట్యూబ్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లోనూ కనిపించి తనదైన శైలిలో అలరించారు.

33
డ్రింకింగ్ అలవాటు
Image Credit : Youtube/ ETV Jabardasth

డ్రింకింగ్ అలవాటు

కిరణ్‌కు డ్రింకింగ్ అలవాటు ఎక్కువగా ఉండేదని, అదే కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మరణానికి డ్రింకింగే కారణమని ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఊహించని విధంగా కిరణ్ మృతి చెందడంతో ఆయనతో కలిసి పనిచేసినవారు, ఇతర యూట్యూబర్లు, కళాకారులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన కామెడీతో ఎంతోమందిని నవ్వించిన ‘అగ్గిపెట్టి మచ్చ’ ఇక లేరనే వార్త అభిమానులను కలచివేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Recommended image2
Loyola College: చెన్నై లయోలా కాలేజీలో చదివిన మన టాప్ హీరోలు వీళ్లే.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!
Recommended image3
OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి
Related Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved