MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే

Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే

రజనీకాంత్ నటించిన జైలర్ 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్‌తో పాటు 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఖరారైంది. అదే విధంగా ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి ఆసక్తికరమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్‌తో జైలర్ 2
Image Credit : Asianet News

యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్‌తో జైలర్ 2

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ఈ సినిమాకు యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ వివరాల ప్రకారం జైలర్ 2 రన్‌టైమ్ 165 నిమిషాల 18 సెకన్లుగా ఉంది. అంటే దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివితో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కథ
Image Credit : Asianet News

ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కథ

జైలర్ 2 కథ తొలి భాగం ముగిసిన చోటు నుంచే కొనసాగుతున్నట్లు సెన్సార్ రివ్యూ ఆధారంగా సమాచారం. మొదటి సినిమాలో ప్రధానంగా విగ్రహాల స్మగ్లింగ్ చుట్టూ కథ సాగింది. క్రూరమైన అండర్‌వరల్డ్ మాఫియాను ఎదుర్కొనే క్రమంలో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్ర కీలకంగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో మరిన్ని కొత్త షేడ్స్ ఉన్న పాత్రలు కనిపించనున్నాయి. ఎస్ జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు వంటి నటులు తమ పాత్రలతో కథలో కీలకంగా నిలిచేలా కనిపిస్తున్నారు. టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈసారి మరింత శక్తివంతమైన అండర్‌వరల్డ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోనున్నట్లు సమాచారం.

35
భారీ తారాగణంతో సీక్వెల్
Image Credit : Asianet News

భారీ తారాగణంతో సీక్వెల్

జైలర్ 2లో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా, వినాయకన్, జాఫర్ సాదిక్ తదితరులు నటిస్తున్నారు. తొలి భాగంలో ప్రత్యేక పాత్రల్లో కనిపించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా సీక్వెల్‌లో తమ పాత్రలతో తిరిగి కనిపించనున్నారు. వీరితో పాటు ఎస్ జే సూర్య, అపేక్ష పొర్వాల్, సూరజ్ వెంజారమూడు, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, విద్యా బాలన్, అన్నా రాజన్, హకీమ్ షాజా, భగవతి పెరుమాళ్, మేఘనా రాజ్, షమ్నా కాసిమ్, జతిన్ సర్నా వంటి పలువురు కొత్త నటులు ఫ్రాంచైజ్‌లోకి వచ్చారు. దీంతో జైలర్ 2లో తొలి భాగం కంటే పెద్ద స్థాయిలో తారాగణాన్ని తీసుకున్నారు.

45
రజనీకి మరోసారి టైగర్ మాస్ అవతారం
Image Credit : Asianet News

రజనీకి మరోసారి టైగర్ మాస్ అవతారం

జైలర్ 2లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆయన పాత్ర చుట్టూ ఉన్న యాక్షన్ ప్రపంచాన్ని మరింత స్పష్టంగా చూపించింది. అండర్‌వరల్డ్‌లోని అత్యంత క్రూరమైన పాత్రలతో ముత్తువేల్ పాండియన్ తలపడే పరిస్థితులను సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నట్లు సమాచారం. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు కూడా సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

55
హై ఆక్టేన్ యాక్షన్ ప్యాకేజీగా జైలర్ 2
Image Credit : Asianet News

హై ఆక్టేన్ యాక్షన్ ప్యాకేజీగా జైలర్ 2

ట్రైలర్‌తో పాటు తాజాగా బయటకు వచ్చిన సెన్సార్ వివరాలు జైలర్ 2పై ఆసక్తిని మరింత పెంచాయి. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథను వేగంగా నడిపిస్తూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ తరహాలో నెల్సన్ దిలీప్‌కుమార్ సినిమాను రూపొందించినట్లు సమాచారం. అండర్‌వరల్డ్ సామ్రాజ్యం, టైగర్ ముత్తువేల్ పాండియన్ పోరాటం, కొత్త పాత్రలు, భారీ యాక్షన్ అంశాలతో ఈ సీక్వెల్ రూపొందినట్లు తెలుస్తోంది. మొత్తంగా జైలర్ 2 హై ఆక్టేన్ యాక్షన్ ప్యాకేజీగా ఉండనున్నట్లు సెన్సార్ రివ్యూ వివరాలు సూచిస్తున్నాయి. యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్‌తో 165 నిమిషాల 18 సెకన్ల రన్‌టైమ్‌తో ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్‌.. ఎలిమినేషన్‌ నుంచి జస్ట్ మిస్‌ ఎవరంటే?
Recommended image2
Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved