- Home
- Entertainment
- Guppedantha Manasu: కేడి బ్యాచ్ ను సేవ్ చేసిన రిషి.. మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో షాకిచ్చిన శైలేంద్ర?
Guppedantha Manasu: కేడి బ్యాచ్ ను సేవ్ చేసిన రిషి.. మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో షాకిచ్చిన శైలేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. పెడతోవ పట్టిన స్టూడెంట్స్ ని మార్చడానికి ప్రయత్నిస్తున్న ఒక మంచి లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో విశ్వనాథం కంగారుగా రిషి రూమ్ కి వస్తాడు. ఏంజెల్ కి ఏమైనా జరిగిందేమో అని కంగారు పడతాడు రిషి. ఏంజెల్ కి ఏమీ కాలేదు రిషి కానీ మన కేడి బ్యాచ్ రేవ్ పార్టీలో పోలీసులకి దొరికిపోయారంట ఎవ్వడు మన కాలేజీ పేరు చెప్తే మన కాలేజీ పరువు పోతుంది. నేను వేరే వాళ్ళతో చెప్పి ఎస్ఐతో మాట్లాడించాను కానీ అతను వినిపించుకోవడం లేదు అంటాడు విశ్వనాథం.
మీరేమీ కంగారు పడకండి సార్ నేను చూసుకుంటాను అని చెప్పి పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు రిషి. రిషి పోలీస్ స్టేషన్ కి వెళ్లే సమయానికి వసు కూడా అక్కడికి వస్తుంది. మీరు ఎందుకు నన్నే ఫాలో అవుతున్నారు పోలీస్ స్టేషన్ కూడా వచ్చేస్తారా అంటూ మందలిస్తాడు రిషి. నేను మీ కోసం రాలేదు సర్ మీరు ఇక్కడికి వస్తారని కూడా తెలియదు.
పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మన కాలేజీ పిల్లలు పార్టీలో దొరికిపోయారంట వాళ్ళని గుర్తుపట్టడం కోసం పిలిచారు నేను ప్రిన్సిపల్ గారికి కాల్ చేస్తే లైన్ కలవలేదు అందుకే వచ్చేసాను అని చెప్తుంది వసు. సరే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తారు. రిషి ఎస్ఐ ని విష్ చేస్తాడు. ఎస్సై రిషి ని గుర్తుపడతాడు. వసుధారని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కేస్ డీల్ చేసిన ఆఫీసరే ఈ ఎస్ ఐ.
మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటూ పలకరిస్తాడు. మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం సార్ అంటాడు రిషి. సరే అంటూ రిషి ని, వసుని తన రూమ్ కి తీసుకు వెళ్తాడు ఎస్సై. ఇదంతా చూస్తున్నా కేడి బ్యాచ్ వీళ్లు వచ్చారేంటిరా మీ నాన్న రాలేదు ఏంటి అని పాండ్యన్ ని అడుగుతాడు వాడి ఫ్రెండ్. మా నాన్న ఫోను కలవలేదు అయి ఉంటుంది అందుకే కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు అంటాడు పాండ్యన్.
వీళ్ళిద్దరిని మనం చాలా ఆట పట్టించాము ఇప్పుడు మనల్ని పోలీసులు దగ్గర ఇరికించేస్తారేమో అని టెన్షన్ పడతారు కేడి బ్యాచ్. అదే సమయంలో లోపల ఎస్సైతో మాట్లాడుతున్న రిషి ఈ స్టూడెంట్స్ లో కొందరు మా కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు కేసు అది అంటే వాళ్ళకి ఫ్యూచర్ పాడైపోతుంది ఈసారికి వాళ్ళు నీ విడిచిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. మీరు చెప్పారు కదా సార్ వదిలిపెడతాను.
మీలాంటి లెక్చరర్లు చెప్తే వాళ్ళు మారతారని నాకు గట్టి నమ్మకం అని చెప్పి పాండ్యన్ వాళ్లని మందలించి వదిలేస్తాడు ఎస్సై. పాండ్యన్ వాళ్ళని తన కారుని ఫాలో అవమని చెప్పి వసుని తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు రిషి. ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు అన్నది ఎవరికీ అర్థం కాదు. రిషి వసుని కారు వెనుక సీట్లో కూర్చొమనడంతో కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నాము నాకు అదే సంతోషం.
ఎప్పటికైనా మీ పక్క సీట్లో కూర్చుంటాను అని మనసులోనే సంతోషపడుతుంది వసు. మరోవైపు రిషి వాళ్ళందరినీ ఒక నైట్ కాలేజీ కి తీసుకువెళ్తాడు. అక్కడ చదువుకుంటూ వాళ్ళందర్నీ చూపించి వాళ్ళు పగలు ఎంత కష్టపడతారో, నిద్రమాని రాత్రులు ఎంత కష్టపడి చదువుకుంటారో కేడి బ్యాచ్ కి వివరిస్తాడు రిషి. లేని వాళ్ళకి రూపాయి ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో వివరిస్తాడు.
ఇకనైనా మారి మీ భవిష్యత్తుని మార్చుకోండి ఇదే నేను చేసే చివరి ప్రయత్నం ఇంకా మీరు మారకపోతే అప్పుడు నేను వేరే విధంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. లేదు సార్ మీ మాటలు వాళ్ళ మీద బాగా పనిచేసినట్లుగా కనిపిస్తున్నాయి పళ్ళు తప్పకుండా మారుతారు అనుకుంటుంది వసు. సీన్ కట్ చేస్తే మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటారు జగతి వాళ్ళు.
మిషన్ ఎడ్యుకేషన్ మనకి ప్రాఫిట్స్ తీసుకురావడం లేదు ఇది వేరే కాలేజీ వాళ్ళకి అప్పచెప్పి మనం క్విట్ అయిపోదాము అంటాడు శైలేంద్ర. మనం ఈ పని డబ్బు కోసం చేయడం లేదు చదువుకొని పదిమంది బాగుపడతారని చేస్తున్నాము. దీనికోసం రిషి చాలా కష్టపడ్డాడు చాలా పునస్కారాలు అందుకున్నాడు అంటుంది జగతి. ఫణీంద్ర కూడా అదే విషయాన్ని సైలేంద్రకి చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.