MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Richest Indian Actor: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే

Richest Indian Actor: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే

Richest Indian Actor: భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన సినీ నటుడిగా షారుఖ్ ఖాన్ టాప్ లో నిలిచారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 25 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 10000 కోట్ల నెట్ వర్త్.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో
Image Credit : chatgppt

రూ. 10000 కోట్ల నెట్ వర్త్.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన అపారమైన సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ఆయన అంచనా నికర విలువ రూ. 10,000 కోట్లుగా నమోదైంది. గత ఏడాది విడుదలైన 2025 హూరున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో షారుఖ్ ఆస్తుల విలువ రూ. 12,490 కోట్లుగా ఉండగా, ఈసారి సుమారు రూ. 2,490 కోట్ల తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ ఆయన భారత్‌లోనే నంబర్ వన్ రిచెస్ట్ హీరోగా కొనసాగుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అపారమైన ఆదాయ వనరులు
Image Credit : others

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అపారమైన ఆదాయ వనరులు

షారుఖ్ ఖాన్ సంపద కేవలం సినిమాలపైనే ఆధారపడి లేదు. ఆయనకు బహుళ వ్యాపార మార్గాలు ఉన్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వినోద రంగంలో నటుడిగా, నిర్మాతగా భారీగానే సంపాదిస్తున్నారు. దీనికితోడు ప్రముఖ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం షారుఖ్ ఖాన్ ఒక్క రోజు బ్రాండ్ షూట్ కోసం సుమారు రూ. 3.5 కోట్ల వరకు పారితోషికం పొందుతున్నారు. సినిమాల లాభాల్లో వాటాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ఆయనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

35
క్రీడా ఫ్రాంచైజీలు, ఇతర పెట్టుబడులు
Image Credit : KKR\Instagram

క్రీడా ఫ్రాంచైజీలు, ఇతర పెట్టుబడులు

స్పోర్ట్స్ బిజినెస్‌లో షారుఖ్ ఖాన్ వేసిన అడుగులు ఆయన ఆర్థిక ప్రస్థానంలో కీలక పాత్ర పోషించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో రెడ్ చిల్లీస్ సంస్థకు 55% వాటా ఉంది. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ విలువ సుమారు $1.1 బిలియన్ల కంటే ఎక్కువేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు గ్లోబల్ ఎడ్యుకేషన్ థీమ్ పార్క్ అయిన KidZania India లో ఆయనకు 26% వాటా ఉంది. స్టార్టప్‌లలోనూ ఆయన గతంలో అనేక ముఖ్య పెట్టుబడులు పెట్టారు.

45
రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో.. రూ. 1000 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులు
Image Credit : AI Generated

రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో.. రూ. 1000 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులు

భారత్‌తో పాటు విదేశాల్లోనూ షారుఖ్ ఖాన్‌కు భారీగా విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు రూ. 500 కోట్ల నుంచి రూ. 1000+ కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

• ముంబై (మన్నత్): సముద్ర తీరంలో ఉన్న 6 అంతస్తుల లగ్జరీ బంగ్లా మన్నత్ అంచనా విలువ రూ. 200–300 కోట్లు.

• దుబాయ్ (జన్నత్): పామ్ జుమైరాలోని బీచ్‌ఫ్రంట్ విల్లా విలువ సుమారు రూ. 100 కోట్లు.

• ఇతర ఆస్తులు: అలీబాగ్ ఫార్మ్‌హౌస్, బాంద్రాలో ప్రత్యేక అపార్ట్‌మెంట్, ఢిల్లీలోని పంచశీల్ పార్క్ నివాసంతో పాటు లండన్, లాస్ ఏంజెల్స్‌లలోనూ ఆయనకు విలాసవంతమైన ప్రాపర్టీలు ఉన్నాయి.

55
భారతదేశంలో టాప్ వెల్తీ నటుల లిస్ట్ ఇదే
Image Credit : Akkineni Nagarjuna FB

భారతదేశంలో టాప్ వెల్తీ నటుల లిస్ట్ ఇదే

హూరున్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన నటులలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, తదుపరి స్థానాల్లో ప్రముఖ నటులు కొనసాగుతున్నారు.

  1. షారుఖ్ ఖాన్ - రూ. 10,000 కోట్లు
  2. నాగార్జున అక్కినేని - రూ. 5,000 కోట్లు
  3. అమితాబ్ బచ్చన్ - రూ. 4,000 కోట్లు
  4. సల్మాన్ ఖాన్ - రూ. 3,000 కోట్లు
  5. హృతిక్ రోషన్ - రూ. 2,500 కోట్లు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Recommended image2
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
Recommended image2
Most Expensive Areas India: భారత్‌లో అత్యంత ఖరీదైన టాప్ 5 ఏరియాస్ ఇవే.. ఇక్కడ ఒక బంగ్లా ధర వందల కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved