MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?

Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?

Pawan Kalyan: అన్న చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ప్రాణం. ఆయన జీవితంపై మెగాస్టార్ ప్రభావం ఎంతగానో ఉంది. ఒకప్పుడు బాధ్యత లేకుండా ఉన్న తనకు చిరంజీవి దారి చూపించారట. భోజనం విషయంలో చిరంజీవి చెప్పిన ఒక్క మాట పవన్ కళ్యాణ్ జీవితాన్నే ఎలా మార్చేసిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 25 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ప్రభావం..
Image Credit : Facebook / Mega Fane

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ప్రభావం..

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ జీవితంలో ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. కేవలం నటనలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ, ఆలోచనా దృక్పథంలోనూ మార్పు తీసుకురావడంలో చిరంజీవి పవన్ కళ్యాణ్‌కు ఒక మార్గదర్శిగా నిలిచారు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ సంఘటనను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముక్క లేక పోతే ముద్ద దిగదు..
Image Credit : Asianet News

ముక్క లేక పోతే ముద్ద దిగదు..

పవన్ కళ్యాణ్ తన చిన్నతనంలో అంటే.. దాదాపు 16 లేదా 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు భోజనం విషయంలో చాలా పట్టింపుగా ఉండేవారు. ముఖ్యంగా తనకు భోజనంలో నాన్ వెజ్ (మాంసాహారం) లేకపోతే తినేవారు కాదట. నాన్ వెజ్ వండకపోతే ఆయనకు చాలా కోపం వచ్చేదట. ఈ విషయాన్ని పవన్ కళ్యాన్ స్వయంగా చెప్పారు. ఇంట్లో నాన్ వెజ్ వండని రోజుల్లో, తనకు ఎంతో కోపం వచ్చేదని, అన్నయ్య చిరంజీవి ఇంట్లో లేని సమయంలో ఆ కోపంతో ఇంట్లో వాళ్లమీద అరిచేవాడినని పవన్ అన్నారు.

35
పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి..
Image Credit : facebook.com/KChiranjeeviFans

పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి..

తమ్ముడి ప్రవర్తనను గమనించిన చిరంజీవి, ఆయనపై అస్సలు కోపడలేదు.. తిట్టలేదు కూడా. బదులుగా, చాలా శాంతంగా పవన్ కళ్యాణ్‌ను దగ్గరకు పిలిచి ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. "మనకు ఈరోజు ఇంత తినడానికి తిండి ఉంది రా.. కానీ బయట సమాజంలో కనీసం ఒక్క పూట కూడా తిండి లేనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకసారి బయట ప్రపంచాన్ని చూడు, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకో" అని చాలా ఆప్యాయంగా చెప్పారు. ఆ మాటలు పవర్ స్టార్ పై చాలా ప్రభావం చూపించాయి. అప్పటి నుంచి పవన్ కళ్యణ్ లో మార్పు వచ్చింది.

45
పవన్ కళ్యాణ్ జీవితంలో వచ్చిన మార్పు
Image Credit : X/pawan kalyan fans

పవన్ కళ్యాణ్ జీవితంలో వచ్చిన మార్పు

అన్నయ్య చెప్పిన ఆ ఒక్క మాట 16-17 ఏళ్ల వయస్సులో ఉన్న పవన్ కళ్యాణ్ మనస్సుపై గట్టి ప్రభావాన్ని చూపించింది. సమాజంలో ఉన్న పేదరికాన్ని, ఇబ్బందులను, ఇతరుల బాధలను అర్థం చేసుకునేలా ఆ మాటలు ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. కేవలం తిండి పట్ల ఉన్న పట్టింపులు పోవడమే కాకుండా, ఎదుటివారి కష్టాలను గుర్తించే సున్నితమై ఆలోచన విధానం ఆయనలో పెరిగింది.

55
స్టార్ హీరో.. నాయకుడిగా సత్తా చాటిన పవన్ కళ్యాణ్..
Image Credit : X/Janasena Party

స్టార్ హీరో.. నాయకుడిగా సత్తా చాటిన పవన్ కళ్యాణ్..

ఈ ఒక్క విషయమే కాదు.. చిన్నతనం నుంచి అన్నయ్య చిరంజీవి నేర్పిన జీవిత పాఠాలు పవన్ కళ్యాణ్‌ను తీర్చి దిద్దాయి. తర్వాతి కాలంలో పవన్ స్టార్ గా, ప్రజా నాయకుడిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడ్డాయి. అందుకే అన్న చిరంజీవి అంటే పవన్ కు ప్రాణం. చిరంజీవిపై తనకున్న గౌరవం, మర్యాదలు ప్రతీసారి ఏదో రకంగా చూపిస్తూనే ఉంటాడు పవన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉంటూనే.. తన పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేశాడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Recommended image2
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Recommended image3
Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు
Related Stories
Recommended image1
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image2
Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved