RGV: ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తు పట్టారా.? ఏమైంది ‘సర్కార్’ ఇలా అయ్యావ్.?
RGV: తెలుగు సినిమాకు వేగాన్ని పెంచిన అద్భుత దర్శకుడు అతను. ఆర్జీవీ అనే మూడు అక్షరాలు సినిమా గతిని మలుపు తిప్పింది. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ తాజాగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురి చేశాడు.

ఒక్కసారిగా మారిన ఆర్జీవీ లుక్
ఏప్రిల్ 7న 63వ పుట్టినరోజు జరుపుకున్న ఆర్జీవి తాజా మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే వర్మ ఒక్కసారిగా చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోల్లో వర్మ చాలా బక్కచిక్కిపోయినట్లుగా కనిపిస్తున్నారు. గతంలో ఫిట్‌గా కనిపించే ఆయనలో ఈ మార్పు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఇది కఠినమైన డైట్ ఫలితమని అంటుంటే, మరికొందరు ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
బర్త్ డే రోజున వైరల్ అయిన ట్వీట్
తన పుట్టినరోజు సందర్భంగా వర్మ చేసిన ట్వీట్ కూడా నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. “ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను.. కాబట్టి ఇది సెలబ్రేషన్ కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఆయన ప్రత్యేక ఆలోచనా విధానాన్ని మరోసారి చూపించింది. జీవితాన్ని చూసే ఆయన ఫిలాసఫీ తెలిసిన వారికి ఈ ట్వీట్ పెద్దగా ఆశ్చర్యపరచలేదు కానీ మారిన ఆయన లుక్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమైంది సర్కార్ ఇలా మారిపోయావ్ ఏంటి.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026
“నా గతాన్ని పొడుస్తున్నా” అంటూ వ్యాఖ్య
బర్త్ డే పార్టీ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ “#ధురంధర్2 అనే కత్తితో నా గతాన్ని పొడుస్తున్నాను” అని వర్మ రాసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. గతంలో వచ్చిన విమర్శలు, వైఫల్యాలను వదిలి కొత్తగా ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు.
STABBING my PAST with a KNIFE called #Dhurandhar2pic.twitter.com/nM8niWGnlv
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2026
కంగనా వ్యాఖ్యలతో కొత్త చర్చ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా వర్మపై తన అభిమానం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. చిన్నప్పుడు ఆయన సినిమాలే తనను సినిమా ప్రపంచం వైపు ఆకర్షించాయని ఆమె చెప్పడం వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలకు వర్మ సరదాగా స్పందిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
పాత వర్మ కోసం అభిమానుల ఎదురు చూపులు
‘శివ’, ‘సత్య’, ‘రంగీలా’ వంటి సినిమాలతో ఇండియన్ సినిమా దిశను మార్చిన వర్మ ప్రస్తుతం ఎక్కువగా బయోపిక్స్, బోల్డ్ కంటెంట్‌పై దృష్టి పెట్టారు. అందుకే మళ్లీ అలాంటి మాస్టర్ పీస్ సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా లుక్ వెనుక సినిమా ప్రాజెక్ట్ ఉందా లేక జీవనశైలిలో మార్పా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ మరోసారి తన స్టైల్‌తోనే చర్చల్లో నిలిచారు. ఆయనలో కనిపిస్తున్న ఈ మార్పు వెనుక అసలు కారణం ఏమిటో త్వరలోనే బయటపడుతుందేమో చూడాలి.

