MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Horoscope: అదృష్ట‌మంటే ఈ రాశి వారిదే.. వ‌చ్చే వారం ఏది ముట్టినా బంగారమే

Horoscope: అదృష్ట‌మంటే ఈ రాశి వారిదే.. వ‌చ్చే వారం ఏది ముట్టినా బంగారమే

Horoscope: 2026 ఏప్రిల్ 12 నుంచి 18 వరకు కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో మంచి మార్పులు కనిపించవచ్చు. ఈ వారం కుంభ రాశి వారికి ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 11 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెరీర్‌లో ప్రమోషన్, బదిలీ అవకాశాలు
Image Credit : Asianet News

కెరీర్‌లో ప్రమోషన్, బదిలీ అవకాశాలు

ఈ వారం ప్రారంభం నుంచే ఉద్యోగం చేసే కుంభ రాశి వారికి మంచి వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు కావాల్సిన స్థలానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ విజయంతో సంతోషంగా ఉంటారు. మీ కృషికి గుర్తింపు లభించే కాలం ఇది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు
Image Credit : Getty

వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు

వ్యాపారం చేసే కుంభ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా రోజులుగా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఆ ప్రణాళికలు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరగడం, కొత్త కస్టమర్లు రావడం వంటివి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయం చేసే అవకాశం ఉంది. వారి మద్ధతుతో మీరు మీ లక్ష్యాల దిశగా ముందుకు సాగుతారు.

35
ఆర్థికంగా సౌకర్యాలు పెరిగే సూచనలు
Image Credit : Getty

ఆర్థికంగా సౌకర్యాలు పెరిగే సూచనలు

వారం మధ్యలో మీరు సుఖసౌకర్యాలకు సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నదానికి సంకేతంగా భావించవచ్చు. ఇక భూమి, ఇల్లు లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు రావచ్చు. మీరు కొనుగోలు చేయాలని లేదా అమ్మాలని అనుకుంటే ఈ వారం మంచి అవకాశాలు కనిపించవచ్చు.

45
సామాజిక గౌరవం, గుర్తింపు పెరుగుతుంది
Image Credit : AI Generated

సామాజిక గౌరవం, గుర్తింపు పెరుగుతుంది

సామాజిక సేవ లేదా ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనే కుంభ రాశి వారికి ఈ వారం మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించవచ్చు. కొంతమందికి సత్కారం లేదా అవార్డు కూడా లభించే అవకాశం ఉంది. దీనివల్ల సమాజంలో మీ పేరు, ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది.

55
కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది
Image Credit : Getty

కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది

ఈ వారం కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఇంట్లో అందరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. దాంపత్య జీవితంలో కూడా మంచి అనురాగం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక లేదా పుణ్యక్షేత్ర యాత్ర చేయాలనే ఆలోచన రావచ్చు. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Cooler: రిమోట్ కంట్రోల్‌, ట‌చ్ ప్యాన‌ల్‌.. కూల‌ర్‌లో ఏసీలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.!
Recommended image2
Investment: ఇల్లు కొనాలా.? పిల్ల‌ల్ని చ‌దివించాలా.? సామాన్య ఉద్యోగి మ‌దిలో ప్ర‌శ్నకు బ‌దులేంటి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved