- Home
- Entertainment
- Krishna Mukunda Murari: ముకుందని హెచ్చరించిన రేవతి.. రోడ్డుమీద గొడవపడ్డ మురారి దంపతులు?
Krishna Mukunda Murari: ముకుందని హెచ్చరించిన రేవతి.. రోడ్డుమీద గొడవపడ్డ మురారి దంపతులు?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన వాడికి పెళ్లి అయినప్పటికీ అతడినే కావాలని కోరుకుంటున్న ఒక మహిళ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు అలా ఉన్నావు ఏమైనా పోయిందా అని అడుగుతాడు మురారి. అవును పోయింది మీ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇస్తాను వెతికి ఇద్దరు గాని అంటుంది కృష్ణ. అక్కడి వరకు అక్కర్లేదు నాకు చెప్పు నేను వెతుకుతాను అంటాడు మురారి. నా ప్రేమ పోయింది వర్షం నీటిలో కరిగిపోయింది వెతికినా దొరకదు అనుకుంటుంది కృష్ణ.
బయటికి మాత్రం వదిలేయండి సర్.. మీకు స్నానానికి టైం అయినట్లుగా ఉంది వెళ్ళండి అంటుంది. నీ మాటల్లో ఏదో బరువు కనిపిస్తుంది నీతో మాట్లాడుతుంటే నాకు తల తిరిగిపోతుంది అంటూ స్నానానికి వెళ్ళిపోతాడు మురారి. నిన్నటి నుంచి నా తల కూడా తిరిగిపోతుంది నేనెవరితో చెప్పుకోవాలి అనుకుంటుంది కృష్ణ. అతను రెడీ అయ్యేలోపు కిందికి వెళ్లి క్యారేజీ తీసుకువస్తుంది.
నీకేమైనా మతి పోయిందా మనం కిందకే కదా వెళ్తాముఅక్కడి నుంచే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కదా అంటాడు మురారి. మీరన్నట్లు నిజంగానే మతి పోయినట్లుగా ఉంది పదండి వెళ్దాం అంటుంది కృష్ణ. నిజంగానే నీకు మతి పోయింది హాస్పిటల్ కి అలాగే వెళ్ళిపోతావా అంటాడు మురారి. అప్పుడు గుర్తొచ్చి వైట్ కోర్టు స్టెతస్కోప్ తీసుకొని నవ్వుకుంటూ కిందికి వెళ్తారు కృష్ణ దంపతులు.
వాళ్లని చూసి కుళ్ళుకుంటుంది ముకుంద. అది గమనిస్తుంది రేవతి. కాఫీ కలుపుతూ ముకుంద వల్ల ఎప్పటికైనా ప్రమాదమే తను ఈ ప్రెస్టేషన్లో అందరి ముందు నిజాన్ని చెప్పినా చెప్పేస్తుంది ఇన్ డైరెక్ట్ గా తనకి వార్నింగ్ ఇవ్వాలి అనుకుని కాఫీ తీసుకొని ముకుంద దగ్గరికి వెళుతుంది రేవతి. అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న రేవతి సామాన్లన్నీ చిందరవందరగా కిందన పడేస్తూ ఉంటుంది.
ఏంటి ఇదంతా అని అడుగుతుంది రేవతి. నా జీవితం అంటుంది ముకుంద. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావా అంటుంది రేవతి. నా గుండె మండిపోతుంది ఏం చేయమంటారు అంటుంది ముకుంద. అది నీ కర్మ అనుకోవాలి అంటుంది రేవతి. అనుకోలేను.. నాకేం తక్కువ అన్నీ ఉన్నాయి అయినా నా జీవితం ఇలా అయిపోయింది అంటుంది ముకుంద.
దానికి కారణం ఆదర్శ్ అతనే వెళ్లిపోకపోయి ఉంటే మీ జీవితం ఇలా అయ్యేది కాదు బుద్ధిగా మీ నాన్నగారు చెప్పినట్లు చెయ్యు అంటుంది రేవతి. అత్తయ్య.. అంటుంది ముకుంద. చిన్న అత్తయ్య అని పిలువు అంటూ వార్నింగ్ ఇస్తుంది రేవతి. మీకు అంతా తెలుసు మాట్లాడుతున్నారని నాకు అర్థం అయింది ముకుంద. అవును నాకు అన్నీ తెలుసు అయినా నువ్వు పనికిమాలిన త్యాగం చేసే ముందు ఇంట్లో అందరికీ చెప్పవలసింది.
అప్పుడు అందరమూ నీకే సపోర్ట్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు మరో అమ్మాయికి అన్యాయం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ బంధంలో నిజాయితీ లేదు.. నీ మానసిక చంచలత్వం నీ పతనానికి దారితీస్తుంది అందుకే గతాన్ని పూర్తిగా మర్చిపో స్వచ్ఛమైన స్త్రీగా మారిపో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి. మరోవైపు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఒక అబ్బాయి.
నేనెప్పుడూ నిన్ను అలా చూడలేదు మనం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది పక్కనున్న అమ్మాయి. ఇదంతా రోడ్డు మీద జరుగుతుంది. అది చూసిన మురారి కారు ఆపి అక్కడికి వెళ్లబోతాడు. మీరు వెళ్తే ఆ కుర్రాడు పారిపోతాడు అంటుంది కృష్ణ. కానీ ఆ కుర్రాడు మురారిని చూసినా కూడా చలించడు. ఆ కుర్రాడు వైపు తప్పులేదు అందుకే పారిపోవటం లేదు అంటాడు మురారి.
అంటే ఆ అమ్మాయిది తప్పంటారా అంటుంది కృష్ణ. మీ అమ్మాయిలు తక్కువైన వాళ్ళు ఏమి కాదు.. ప్రేమ కోసం మీ చుట్టూ తిప్పించుకుంటారు అంటాడు మురారి. ఆగండాగండి వాళ్ళని ఆపడం మానేసి మనమే గొడవ పడుతున్నామేంటి విచిత్రంగా అంటుంది కృష్ణ. మురారి అబ్బాయి దగ్గరికి వెళ్లి రోడ్డుమీద ఏంటి న్యూసెన్స్ అని అడుగుతాడు.
న్యాయం చెప్పండి నాతో సినిమాలు షికార్లు తిరిగి ఇప్పుడు ప్రేమించడం లేదని చెప్తుంది అంటాడు అబ్బాయి. తిరిగినంత మాత్రాన ప్రేమ అయిపోతుందా అంటుంది ఆ అమ్మాయి. అబ్బాయిది తప్పంటుంది కృష్ణ. అమ్మాయిది తప్పంటాడు మురారి. తరువాయి భాగంలో మన గురించి చూచాయిగా రేవతి అత్తయ్యకి తెలిసింది అని మురారి కి చెప్తుంది ముకుంద. ఆవిడకి ఎలా తెలుస్తుంది అంటాడు మురారి. నేనే చెప్పాను అంటుంది ముకుంద. షాక్ అవుతాడు మురారి.