'కింగ్డమ్' కథా నేపథ్యం ఇదే.. కనెక్ట్ అయితే ఆ చిత్రాల తరహాలో భారీ విజయం ఖాయం
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత కీలకమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ నుంచి చివరగా విడుదలైన లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత కీలకమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ నుంచి చివరగా విడుదలైన లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో, విజయ్ తన తదుపరి చిత్రం ‘కింగ్డమ్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా జూలై 31, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర కథ గురించి దర్శకుడు కానీ, విజయ్ దేవరకొండ కానీ ఇంతవరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కానీ విడుదలైన టీజర్స్ లో వార్ సన్నివేశాలు, విజయ్ గెటప్ ఆసక్తిని పెంచేశాయి.అయితే తాజాగా ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘కింగ్డమ్’ లో కథ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఈ అంశం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పునర్జన్మ సన్నివేశాలు ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.
పునర్జన్మ నేపథ్యంలో కథ కాబట్టే విజయ్ దేవరకొండ రెండు గెటప్పులలో డ్యూయెల్ రోల్ లో కనిపిస్తున్నారు. గతంలో మగధీర, మనం లాంటి చిత్రాలు పునర్జన్మల నేపథ్యంలో వచ్చి భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. కింగ్డమ్ చిత్రం కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
‘జెర్సీ’ వంటి హిట్ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకోవడం విశేషం. కథ, బలమైన ఎమోషన్స్, విజువల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.