- Home
- Entertainment
- Round up 2021: రష్మిక, పూజ, సాయి పల్లవి, తమన్నా... 2021లో టాలీవుడ్ ని షేక్ చేసిన హీరోయిన్స్
Round up 2021: రష్మిక, పూజ, సాయి పల్లవి, తమన్నా... 2021లో టాలీవుడ్ ని షేక్ చేసిన హీరోయిన్స్
ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా మార్కెట్ గా ఎదిగింది టాలీవుడ్. కరోనా వంటి భారీ సంక్షోభం తర్వాత కూడా తెలుగులో వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 2020 అత్యంత దుర్బర పరిస్థితులు పరిచయం చేయగా.. 2021 తిరిగి ప్రాణం పోసింది.

ఈ ఏడాది కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు థియేటర్స్ కి జనాలను రప్పించాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్స్ తో పాటు చిన్న హీరోలు కూడా చిత్రసీమకు తమ చిత్రాలతో శోభ తెచ్చారు. ఇక ఓ సినిమా విజయంలో హీరో పాత్ర ఎంత ఉంటుందో.. సమానంగా హీరోయిన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. 2021లో కొందరు హీరోయిన్స్ తమ గ్లామర్, పెర్ఫార్మన్స్, డాన్సులతో ప్రేక్షకులు వినోదం పంచారు. మరి ఈ ఏడాది వెండితెరపై మెరిసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం..
టాలీవుడ్ క్వీన్ రష్మిక మందాన (Rashmika mandanna) అనడంలో సందేహం లేదు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక మందాన కరోనా ఇయర్ గా మిగిలిన 2020లో కూడా సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్స్ కొట్టింది. ఇక ఆమె లేటెస్ట్ రిలీజ్ పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. పుష్ప (Pushpa)మూవీలో శ్రీవల్లిగా డీగ్లామర్ పాత్రలో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశారు రష్మిక.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ ని ఏలేస్తున్న మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja hegde). లక్కీ హీరోయిన్ ట్యాగ్ సంపాదించిన రష్మిక.. స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో అఖిల్ కి హిట్ అందించిన పూజా... రాధే శ్యామ్ (Radhe shyam)మూవీతో సంక్రాంతికి సరదా పంచనున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో చేసిన శృతి హసన్ (Shruti haasan)కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమయ్యారు. ఆమె క్రాక్ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ 2021కి శుభారంభం అందించారు. లాక్ డౌన్ తర్వాత బాక్సాఫీస్ కి కళ తెచ్చిన చిత్రం క్రాక్. ఈ మూవీలో రవితేజకు జంటగా శృతి నటించారు. అలాగే ఆమె నటించిన మరో భారీ చిత్రం వకీల్ సాబ్. పవన్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీలో శృతి హీరోయిన్ గా నటించారు వకీల్ సాబ్ 2021 బిగ్గెస్ట్స్ హిట్స్ లో ఒకటిగా ఉంది.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) 2021లో వెండితెరపై మెరుపులు మెరిపించిన హీరోయిన్స్ లో ఒకరు. ఆమె నాగ చైతన్యకు జంటగా నటించిన లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ మంచి వసూళ్లు రాబట్టింది. సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఆమె దేవదాసి రోల్ చేయడం విశేషం.
మొదటి చిత్రంతోనే కుర్రాళ్లను ఊపేసింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా కృతి మారిపోయారు. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాల వరకు ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన భారీ వసూళ్లు రాబట్టింది. కృతి నుండి వస్తున్న రెండవ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ మూవీలో ఆమె రోల్ కొంచెం బోల్డ్ గా ఉంది.
సీనియర్ స్టార్ లేడీ తమన్నా జోరు ఇంకా తగ్గలేదు. ఆమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తూనే ఉంటున్నాయి. 2021లో తమన్నా రెండు చిత్రాలు విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సీటీమార్ తో పాటు నితిన్ మ్యాస్ట్రో చిత్రాల్లో ఆమె భిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.
Also read స్టార్ హీరోలంతా షూటింగ్స్ లో బిజీ.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసా...?
Also read షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్?... సంచలనంగా సోషల్ సోషల్ మీడియా పోస్ట్స్...!