స్టార్ హీరోలంతా షూటింగ్స్ లో బిజీ.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసా...?
టాలీవుడ్ హీరోలంతా ఎవరి షూటింగ్ షెడ్యూల్స్ లో వారు బిజీగా ఉన్నారు. సూపర్ ఫాస్ట్ గా వారి షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి ఏహీరో ఎక్కడ షూటింగ్ జరుపుకుంటున్నారు…?a
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ బాచుపల్లి లో జరుగుతుంది.
మెగాస్టార్ వరుసగా తన సినిమాల షూటింగ్స్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అందుకే మూడు సినిమాలు ఒకేసారి ట్రాక్ ఎక్కించారు. గాడ్ ఫాదర్ షూటింగ్ నడుస్తుండగానే కోకాపేటలో ఆచార్య షూటింగ్ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. ఇటు ఈ నెల 25 నుంచి జనవరి 6 వరకు భోళా శంకర్ సినిమా కోలకతా లో జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Pawan kalyan) కూడా స్పీడ్ గా తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ షూట్ లో ఉన్నారు.రానా(Rana)తో కలిసి పవన్ వికారాబాద్ పరిసర ప్రాంతాల లో భీమ్లా నాయక్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
విక్టరీ స్టార్ వెంకటేష్ (Venkatesh)..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varuntej) కలసి నటిస్తున్నమల్టీ స్టారర్ మూవీ f3. F2 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది.a
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్నసినిమా రామారావు అన్ డ్యూటీ. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూట్ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీ లో జరుగుతోంది
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(sharwanand) నటిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శర్వా.. ఈ సినిమాతో గట్టెక్కాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది
ప్రభాస్(Prabhas) - దీపిక పదుకొనె(Deepika) జంటగా.. నాగ్ అశ్విన్(Nag Aswin) డైరెక్ట్ చేస్తున్న పాన్ వరల్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబచ్చన్ కూడా నటిస్తున్నారు.