MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?

Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?

రష్మిక మందన్న సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండను పెళ్లాడి.. తెగ సందడి చేసింది. ఇక తాజాగా ఆమె తన సీక్రేట్ టాటూతో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ టాటూ సీక్రేట్ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 20 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దూసుకుపోతోన్న రష్మిక మందన్న...
Image Credit : @rashmika_mandanna

దూసుకుపోతోన్న రష్మిక మందన్న...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నవరుస విజయాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన రష్మిక.. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. నటనతో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది రష్మిక. విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి, వేణు స్వామితో హోమాలు చేయించడం లాంటి విషయాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది బ్యూటీ. ఇక తాజాగా మరో విషయంలో రష్మిక మందన్నపై పెద్ద రచ్చ జరుగుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
రష్మిక చేతిపై సీక్రెట్ టాటు..
Image Credit : Instagram/@rashmika_mandanna

రష్మిక చేతిపై సీక్రెట్ టాటు..

రష్మిక మందన్న చేతిపై ఓ టాటు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆమె కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ అనే టాటూ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ టాటూను తన భర్త, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ టాటూ వెనుకు అసలు విషయం వేరే ఉంది. దీని గురించి ఆమె రీసెంట్ గా ఓ విషయాన్ని పంచుకుంది.

Related Articles

Related image1
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Related image2
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
34
అసలు విషయం వెల్లడించిన నటి..
Image Credit : youtube/geetha arts

అసలు విషయం వెల్లడించిన నటి..

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, ఈ టాటూ వెనుక ఉన్న అసలైన నిజాన్ని బయటపెట్టి అన్ని పుకార్లకు చెక్ పెట్టారు. రష్మిక మాట్లాడుతూ.. '' నాకు మొదట్లో అసలు టాటూ వేయించుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది.

ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి నాతో మాట్లాడుతూ ఆడపిల్లలు నొప్పిని అస్సలు భరించలేరని, వారికి సూదులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయమని ఎగతాళి చేశాడు. ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆడవాళ్లు ఎంతటి నొప్పినైనా భరించగలరని నిరూపించాలనే ఉద్దేశంతోనే టాటూ వేయించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను'' అని ఆమె అన్నారు.

44
ఇర్రీప్లేసబుల్ లో అంత కథ ఉందా?
Image Credit : Asianet News

ఇర్రీప్లేసబుల్ లో అంత కథ ఉందా?

రష్మిక మాట్లాడుతూ.. ''టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, చేతిపై ఏ పదం రాయించుకోవాలనే విషయంలో చాలా ఆలోచించాను. నా జీవితంలో ఎప్పుడూ సహజంగా, నిజాయితీగా ఉండాలని కోరుకునే వ్యక్తిని, . ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రత్యేకమే.. ఎవ్వరినీ మరొకరు భర్తీ చేయలేరనే భావన నాకు ఎంతో బలంగా ఉంది. ఆ ఆలోచన ప్రతిరోజూ నాకు నేను గుర్తు చేసుకునేందుకు ‘ఇర్రీప్లేసబుల్’ అనే పదాన్ని టాటూగా ఎంచుకున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image2
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Related Stories
Recommended image1
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image2
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved