MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?

Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?

వెండితెరపై మహారాణిలా వెలుగు వెలిగింది సావిత్రి. హీరోలను మించిన స్టార్ డమ్, సంపాదన ఆమెను మంచెత్తాయి. ఆతరువాత కాలంలో ఆస్తులు పొగొట్టుకుని.. అనారోగ్యంతో కన్నుమూసింది. ఓ సారి షూటింగ్ కి సావిత్రి తాగి వస్తే ఏం జరిగిందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 20 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు సినిమా మహారాణి..
Image Credit : X/Twitter

తెలుగు సినిమా మహారాణి..

మహానటి సావిత్రి తెలుగు సినిమాకు ఒక బ్రాండ్. నేటితరం హీరోయిన్లకు ఆదర్శం.. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు తెలుగుతెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంత వరకూ రాలేదు. సౌందర్య, స్నేహా లాంటి హీరోయిన్లు్ సావిత్రిలా అనిపించినా.. ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు హృదయాలలో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రక్షకులు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు..
Image Credit : X/Twitter

సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు..

హీరోయిన్ గా వెలుగు వెలిగిన సావిత్రి.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో దెబ్బలు తిన్ననది. జీవితం సాఫీగా సాగిపోతున్న టైమ్ లోనే.. జెమినీ గణేషన్ తో రహస్య వివాహం.. ఇద్దరు పిల్లలు, భర్తతో విభేదాలు, కోట్ల ఆస్తులు ఒక్కసారిగా కరిగిపోవడం, సావిత్రి సాయం అందుకున్నవారు ఆమెకు వెన్నుపోటు పోడవడం, పక్కనే ఉంటూ ఎంతో మంది ఆమెను మోసం చేయడంతో.. ఉక్కిరిబిక్కిరి ఆయిపోయింది మహానటి. ఆ ఇబ్బందులు ఆమెను ఆల్కాహాల్ కు బానిసను చేశాయి. ఎక్కువగా తాగడంతో ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆస్తులన్నీ పోగోట్టుకుని చివరకు చిన్న ఇంట్లో ఎన్నో కష్టాలు పడింది సావిత్రి.

Related Articles

Related image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Related image2
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
37
మహానటికి మందు అలవాటు చేసింది ఎవరు?
Image Credit : Facebook/Mahanati Savitri

మహానటికి మందు అలవాటు చేసింది ఎవరు?

సావిత్రికి స్వతహాగా తాగే అలవాటు లేదు.. కానీ ఆమో ఇబ్బందులు, ఒత్తిడిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆమెను తాగేలా ప్రోత్సహించినట్టు సమాచారం. ఘగర్ వ్యాధి ఇబ్బంది పెట్టడంతో కొన్నాళ్లు తాగటం మానేసినా.. ఆతరువాత మళ్లీ మొదలు పెట్టక తప్పలేదట. కొన్ని సార్లు ఆమె షూటింగ్స్ కి కూడా తాగి వచ్చేవారని తెలుస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు పోయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సావిత్రి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. శోభన్ బాబు తల్లి, వదినగా కొన్ని సినిమాల్లో ఆమె నటించింది. అయితే విచిత్ర దాంపత్యం సినిమా షూటంగ్ టైమ్ లో సావిత్రి ఫుల్ గా తాగి సూటింగ్ కు వెళ్లారట.

47
తాగి షూటింగ్ కి వచ్చిన సావిత్రి..
Image Credit : our own

తాగి షూటింగ్ కి వచ్చిన సావిత్రి..

విచిత్ర దాంపత్యం సినిమాలో శోభన్ బాబు హీరో కాగా, విజయ నిర్మల హీరోయిన్ గా నటించింది. గుమ్మడి భార్యగా సావిత్రి నటించారు. ఈ సినిమా షూటింగ్ కు బాగా ఆల్కాహాల్ తీసుకునివెళ్లిన సావిత్రి.. సెట్ కు వెళ్లగానే వాంతి చేసుకున్నారట. దాంతో వెంటనే అక్కడే ఉన్న విజయ నిర్మల సావిత్రిని మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారట. 

57
సావిత్రి మంచితనం ముంచింది..
Image Credit : india today

సావిత్రి మంచితనం ముంచింది..

సావిత్రి లేనిదే ఆ సీన్ షూటింగ్ చేయడం కుదరు కాబట్టి.. డైరెక్టర్ షూటింగ్ కు పేకప్ చేప్పబోతుండగా.. తాను అర్ధగంటలో మళ్లీ వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతానని సావిత్రమ్మ కబురు పెట్టారట. అలా తన పనిలో మాత్రం ఏ లోటు రాకుండా, నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవారు సావిత్రి. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ వెండి వెన్నెల యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.

67
14 నెలలు నరకం చూసిన మహానటి..
Image Credit : X/Twitter

14 నెలలు నరకం చూసిన మహానటి..

సావిత్రి జీవితంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను కష్టాల్లోకి నెట్టాయి. నిండా ముంచాయి. మనుషులను అతిగా నమ్మి మొుసపోయింది మహానటి. సాయం అని వచ్చినవారికి లేదనకుండా దానం చేసి.. చివరకు తనకు ఏమీ లేకుండా చేసుకుంది. కోట్లలో సంపాదించిన సావిత్రి.. ఆస్తులను కాపాడుకోలేకపోయింది. మహారాణిలా బ్రతికిన ఆమె.. చివరకు నా అన్నవారు చుట్టు లేకుండా 14 నెలలు కోమాలో నరకయాతన అనుభవించి 47 ఏళ్ల చిన్న వయసులో కన్నుమూసింది. 

77
పంటించుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ..
Image Credit : Asianet News

పంటించుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ..

సావిత్రి 1981 డిసెంబర్ 26న మరణించింది. ఆమె అంత పెద్ద నటి, మహానటిగా పేరుంది. ఎంతో మందికి భిక్షపెట్టింది. ఎంతో మంది జీవితాలు బాగు చేసింది. కానీ ఆమె మరణిస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆమె సాయం పొందినవారు కూడా తిరిగి చూడలేదు.  అంత్యక్రియలకు కూడా ఇండస్ట్రీ నుంచి ఏఎన్నార్, దాసరి, మురళీ మోహన్ మాత్రమే హాజరయ్యారు. కొంత మంది జూనియర్ ఆర్టిస్ట్ లు.. ఆమె ఇంటి చుట్టు ఉన్న బస్తీ వాసులు తప్పించి ఎవరు రాలేదని మురళీ మోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సావిత్రి (నటి)
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: పెళ్లి ఎప్పుడో చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఆ సుఖాన్ని కోల్పోవడం ఇష్టం లేదట
Recommended image2
Ram Charan: రామ్‌ చరణ్‌ చివరి 5 సినిమాల్లో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని?.. బాక్సాఫీస్ రిపోర్ట్
Recommended image3
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved