డైరెక్టర్లకి సారీ చెప్పిన రష్మిక మందన్నా.. గాయం గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గాయపడిన విషయం తెలిసిందే. జిమ్ లో గాయపడ్డ ఆమె తాజాగా స్పందించింది. దర్శకులకు ఆమె సారీ చెప్పడం విశేషం.
`పుష్ప 2` సినిమాతో సంచలనాలు సృష్టించిన నేషనల్ క్రష్, రష్మిక మందన్నా గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్‌లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన్నా. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైమ్ పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
read more: సీక్రెట్ మ్యారేజ్‌పై స్టార్ హీరోయిన్ అదిరిపోయే రియాక్షన్, తాను సీరియల్ డేటర్ ని అంటూ స్టేట్మెంట్
ఇందులో రష్మిక చెబుతూ, `సరే, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటున్నా. నేను నా జిమ్‌లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితితో ఉన్నాను. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడుకే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే నేను `థామ`, `సికిందర్`, `కుబేర` చిత్రాల సెట్లోకి అడుగుపెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ.
నా కాళ్లు యాక్షన్‌లోకి దిగడానికి ఓకే అని నిర్థారించుకున్న వెంటనే సినిమా సెట్లోకి అడుగుపెడతాను. ఈ లోగా మీకు నేను అవసరమైతే చాలా అధునాతనమైన బన్నీ హోప్ వ్యాయామం చేయడానికి కూడా రెడీగానే ఉంటాను` అని తెలిపింది రష్మిక మందన్నా. దర్శకుల గురించి ఆలోచించి ఆమె ఈ పోస్ట్ పెట్టడం విశేషం.
రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్‌తో `సికిందర్` సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ, `కుబేర` చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవలే అల్లు అర్జున్‌తో కలిసి నటించిన `పుష్ప 2` విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది.
ఇది ఏకంగా రూ.1900కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో ఇండియా వైడ్‌గా నెంబర్ వన్ హీరోయిన్గా నిలిచింది రష్మిక మందన్నా. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటున్నారు.
read more: నిహారికా బెడ్ సీన్ చేసినా ప్రయోజనం లేదా?, మెగాడాటర్ తమిళ సినిమా కలెక్షన్లు చూస్తే షాక్
also read: డాక్టర్ కాదు, పిల్లల్ని కనడం కాదు, సౌందర్యకి సినిమాల్లో తీరని కోరిక ఏంటో తెలుసా?