డాక్టర్ కాదు, పిల్లల్ని కనడం కాదు, సౌందర్యకి సినిమాల్లో తీరని కోరిక ఏంటో తెలుసా?
సౌందర్య జీవితంలో తీరని కోరికలు చాలా ఉన్నాయి. డాక్టర్ కావాలనుకుంది. పిల్లల్ని కనాలనుకుంది. అది కాకుండా మరో తీరని కోరిక ఉంది. మరి అదేంటి?
సహజమైన అందం, సహజమైన నటనకు కేరాఫ్ సౌందర్య. ప్రేక్షకుల హృదయాల్లో అద్భుతమైన రూపంగానే నిలిచిపోయింది. ఆమె లేకపోయినా తన సినిమాలతో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. చిరంజీవిగానే వెలిగిపోతున్నారు. అయితే సౌందర్యకి సినిమాల పరంగా ఓ కోరిక ఉండేది. కానీ అది నెరవేర్చుకోలేకపోయింది. అదేంటనేది చూస్తే.
సౌందర్యకి చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. కానీ అనుకోకుండా యాక్టర్ అయ్యింది. తిరుగులేని స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఓ రకంగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అలా ఆ కోరిక తీర్చుకోలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంది. కానీ అది కూడా కుదరలేదు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుందట. ఓ వ్యక్తిని కూడా ఇష్టపడిందట. అది కూడా కుదరలేదు.
నాన్న కోసం ఏదైనా చేయాలనుకుంది సౌందర్య. వాళ్ల నాన్న సత్య నారాయణ రైటర్, నిర్మాత. పలు సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. అయితే నాన్న సడెన్‌గా చనిపోవడంతో కుంగిపోయిన సౌందర్య ఆయన మరణం అనంతరం తండ్రి కోసం ట్రిబ్యూట్‌గా ఓ మూవీ చేయాలనుకుంది. తండ్రి పేరుతోనే `సత్య మూవీ మేకర్స్ `పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించింది.
2002లో `ద్వీప` అనే సినిమాని నిర్మించారు. ఇందులో తనే మెయిన్ రోల్. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. పల్లెటూరి కల్చర్‌ని ఆవిష్కరించిన ఈ చిత్రం కమర్షియల్‌గా మామూలుగానే ఆడింది. కానీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీతో తండ్రికి ట్రిబ్యూట్ ఇచ్చింది.
కానీ తన కోరిక తీర్చుకోలేకపోయింది. అదేంటనేది చూస్తే సౌందర్యకి డైరెక్షన్ చేయాలని ఉండేదట. జీవితంలో ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని అనుకుందట. మంచి మీనింగ్ ఉన్న సినిమాని రూపొందించాలని ప్లాన్ చేసుకుందట. హీరోయిన్‌గా ఓ దశ తర్వాత కెరీర్ డౌన్ అవుతుంది. ఆ సమయంలో తాను డైరెక్టర్ గా మారాలనుకుందట. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆమె వెళ్లిపోయింది. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే.
read more: ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలు, మన తెలుగు మూవీస్ ఎన్ని అంటే?