సీక్రెట్ మ్యారేజ్‌పై స్టార్ హీరోయిన్ అదిరిపోయే రియాక్షన్, తాను సీరియల్ డేటర్ ని అంటూ స్టేట్‌మెంట్
స్టార్ హీరోయిన్ తన రహస్య పెళ్లిపై స్పందించింది. ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. తాను సీరియల్ డేటర్‌ని అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
నటి రెజీనా
తరచూ వివాదాల్లో చిక్కుకునే నటీమణుల్లో ఈమె ఒకరు. తన రిలేషన్‌షిప్‌ల గురించి బహిరంగంగా ఒప్పుకుని, సీరియల్ డేటర్ అని చెప్పుకొచ్చింది. స్టార్ హీరోని రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలపై స్పందిస్తూ అదిరిపోయే సమాధానం చెప్పింది. ఆమె ఎవరో తెలుసా? రెజీనా కసాండ్రా.
చెన్నైకి చెందిన రెజీనా, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 9 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, చెన్నై యూనివర్సిటీలో సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
రెజీనా కసాండ్రా
2005లో 'కండ నాల్ ముదల్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, చదువు కోసం బ్రేక్ తీసుకున్నారు. తిరిగి సినిమాల్లోకి వచ్చారు.
బ్రేక్ సమయంలోనూ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. తర్వాత సినిమాల్లోకి పూర్తిగా దృష్టి పెట్టారు. `ఎస్‌ఎంఎస్` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `రొటీన్ లవ్ స్టోరీ` కూడా చేసింది. కానీ గుర్తింపు రాలేదు. `కొత్త జంట` మూవీ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రెజీనా కసాండ్రా
'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా రెజీనా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత తెలుగులో వరుస విజయాలు అందుకున్నారు.
`రా రా కృష్ణయ్య`, `పవర్`, `పిల్లా నువ్వు లేని జీవితం`, `సౌఖ్యం`, `శౌర్య`, `.జ్యో అచ్చుతానంద`, `శంకర`, `బాలకృష్ణుడు`, `అ!` చిత్రాలు చేసి మెప్పించింది.
రెజీనా కసాండ్రా
సినిమాలతో పాటు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది రెజీనా. అందులో భాగంగా ఆమె తాను `సీరియల్ డేటర్` అని బహిరంగంగా ఒప్పుకున్నారు. "నాకు చాలా పెళ్లి ప్రతిపాదనలు వస్తున్నాయి. చాలా మందితో రిలేషన్‌లో ఉన్నాను. నన్ను సీరియల్ డేటర్ అనొచ్చు. డేటింగ్ చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను` అని సెటైర్లు పేల్చింది రెజీనా.
రెజీనా కసాండ్రా
ఒకానొక సందర్భంలో పురుషులను మ్యాగీ నూడుల్స్‌తో పోల్చింది రెజీనా. "బాయ్స్, మ్యాగీ నూడుల్స్ ఒకటే. రెండు నిమిషాల్లో పని అయిపోతుంది` అంటూ కామెంట్ చేసి వివాదానికి తెరలేపింది. అప్పట్లో ఈ కామెంట్స్ పెద్ద రచ్చ అయ్యాయి.
రెజీనా కసాండ్రా
ఇదిలా ఉంటే తెలుగు హీరోతో ఆమె డేటింగ్‌లో ఉందని, రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. 'మానగరం' సినిమాలో తనతో నటించిన సందీప్ కిషన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన రెజీనా, తాము మంచి స్నేహితులని, పెళ్లి వార్తలు అవాస్తవమని చెప్పారు.
రెజీనా ప్రస్తుతం 'జాట్', 'సెక్షన్ 108' అనే హిందీ సినిమాల్లో, 'ఫ్లాష్‌బ్యాక్' అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో సినిమాలు తగ్గించారు.
read more: ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలు, మన తెలుగు మూవీస్ ఎన్ని అంటే?
also read: ప్రభాస్‌తో సుకుమార్ చేయాల్సిన మూవీ ఏంటో తెలుసా? డార్లింగ్ ది కరెక్ట్ జడ్జ్ మెంటేనా?