- Home
 - Entertainment
 - మరోసారి కలిసి రచ్చ చేయబోతున్న పుష్పరాజ్, శ్రీవల్లి.. ఏ సినిమాలోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
 
మరోసారి కలిసి రచ్చ చేయబోతున్న పుష్పరాజ్, శ్రీవల్లి.. ఏ సినిమాలోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి `పుష్ప`, `పుష్ప 2`లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు.

మరోసారి కలిసి నటించబోతున్న అల్లు అర్జున్, రష్మిక మందన్నా
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి `పుష్ప` చిత్రాల్లో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో రష్మిక మందన్నాపేరు వినిపిస్తుంది.
ఆ ముగ్గురు హీరోయిన్లతోపాటు రష్మిక కూడా
ఈ సినిమాలో బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, వీరితో పాటు సౌత్ నటి రష్మిక మందన్న కూడా చేరారు. ఆమె కూడా హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం.
హీరోయిన్ల పాత్రల నిడివిపై చర్చలు
ఒకే సినిమాలో నలుగురు నటిస్తుండటంతో, ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, ఎవరి పాత్ర వ్యవధి ఎంత అనే లెక్కలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇందులో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
లాస్ ఎంజెల్స్ లో టెస్ట్ షూట్‌లో రష్మిక
లాస్ ఏంజలీస్‌లో ఈ సినిమా కోసం రష్మిక మందన్న లుక్ టెస్ట్, బాడీ స్కాన్ చేయించుకున్నారు. అట్లీ రష్మిక మందన్న పాత్ర కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు.
అల్లు అర్జున్, రష్మికకి మంచి క్రేజ్
పుష్పరాజ్- శ్రీవల్లిగా `పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంట ఇప్పటికే టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరి కాంబినేషన్‌కి మంచిక్రేజ్ ఉంది. అదే ఇప్పుడు అట్లీ మూవీకి కలిసి రాబోతుందని సమాచారం.

