- Home
- Entertainment
- StarMaa Top 10 Serials: కార్తీక దీపం, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని.. టాప్ వన్ ఏంటంటే?
StarMaa Top 10 Serials: కార్తీక దీపం, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని.. టాప్ వన్ ఏంటంటే?
స్టార్ మా సీరియల్స్ కి సంబంధించిన గత వారం టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఎక్కువ మంది చూసిన సీరియల్‌గా ఏది నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

స్టార్ మా టాప్ 10 సీరియల్స్
సీరియల్స్ కి సంబంధించిన ప్రతి వారం టీఆర్‌పీ రేటింగ్ వస్తుంటుంది. మరి గత వారం టాప్ లో ఉన్న సీరియల్ ఏంటి? టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
ప్రధానంగా స్టార్ మాలో కార్తీక దీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, ఇంటింటి రామాయణం, గుడి గంటలు, నువ్వుంటే నా జతగా, బ్రహ్మముడి వంటి సీరియల్స్ ఉన్నాయి. వీటి స్థానమేంటో ఓ సారి చూద్దాం.
స్టార్ మా టాప్ 1లో `కార్తీక దీపం`
స్టార్ మాకి సంబంధించి గత వారం టాప్ 1 సీరియల్ `కార్తీక దీపం` నిలిచింది. ఇది చాలా కాలంగా టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సత్తా చాటింది. అర్బన్, రూరల్ కలిసి 14.40 టీఆర్‌పీ రేటింగ్‌తో టాప్‌లో ఉంది.
అర్బన్‌లో ఇది 11.44 రేటింగ్‌ని సాధించింది. ఇందులో డాక్టర్‌బాబుగా నిరుపమ్ పరిటాల, దీపాగా ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది చాలా పాపులర్ సీరియల్‌గా రాణిస్తుంది. బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తుంది.
స్టార్ మా టాప్ 2 సీరియల్‌గా `ఇల్లు ఇల్లాలు పిల్లలు`
స్టార్ మాలో రెండో స్థానంలో ఉన్న సీరియస్ `ఇల్లు ఇల్లాలు పిల్లలు` నిలిచింది. దీనికి రూరల్, అర్బన్ కలిపి 13.03 రేటింగ్, అర్బన్‌లో 10.58 రేటింగ్ సాధించింది. ఇందులో ప్రభాకర్, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్టార్ మా టాప్ 3గా `ఇంటింటి రామాయణం`
మూడో స్థానంలో `ఇంటింటి రామాయణం` సీరియల్ ఉంది. ఈ సీరియల్ రూరల్, అర్బన్ కలిపి 12.92 రేటింగ్‌ని, అర్బన్‌లో 10.52ని సాధించింది.
స్టార్ మా టాప్ 4 సీరియల్‌గా `గుడిగంటలు`
నాల్గో స్థానంలో `గుడిగంటలు` సీరియల్ నిలిచింది. ఈ సీరియల్ అర్బన్, రూరల్ కలిపి 12.42 టీఆర్‌పీ రేటింగ్‌ని, అర్బన్‌లో 11.08 రేటింగ్‌ని సాధించింది. అర్బన్‌లో దీన్ని బాగా చూస్తున్నారు.
స్టార్ మా టాప్ 5 సీరియల్‌గా `చిన్ని`
ఐదో స్థానంలో `చిన్ని` సీరియల్ నిలిచింది. ఇది అర్బన్ రూరల్ కలిపి 8.70 టీఆర్‌పీ రేటింగ్, అర్బన్‌లో మాత్రం 7.23 రేటింగ్‌ని సొంతం చేసుకుంది.
స్టార్ మా టాప్ 6-10 సీరియల్స్
వీటితోపాటు మిగిలిన టాప్ 5 చూస్తే రూరల్, అర్బన్ కలిపి ఆరో స్థానంలో `నువ్వుంటే నా జతగా` సీరియల్ ఉంది. ఇది 7.99 టీఆర్‌పీ రేటింగ్‌ని సొంతం చేసుకుంది.
ఏడో స్థానంలో `బ్రహ్మముడి` సీరియల్ ఉంది. ఇది 6.89 టీఆర్‌పీ రేటింగ్‌ని దక్కించుకుంది. ఎనిమిదో స్థానంలో `పలుకే బంగారమాయేనా` సీరియల్ సొంతం చేసుకుంది. దీనికి 6.05 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
తొమ్మిదో స్థానంలో `నిన్నుకోరి` నిలిచింది. దీనికి 5.77 రేటింగ్ దక్కింది. పదో స్థానంలో `మామగారు` సీరియల్ నిలిచింది. దీనికి 574 టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సీరియల్స్ టాప్ 10గా నిలిచాయి.