- Home
- Entertainment
- Rashmika Mandanna Photos leak: విజయ్ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్ శెట్టితో టూర్ ఫోటోలు లీక్
Rashmika Mandanna Photos leak: విజయ్ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్ శెట్టితో టూర్ ఫోటోలు లీక్
Rashmika Mandanna Photos leak: హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా మ్యారేజ్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్మిక.. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టితో ఉన్న పిక్స్ లీక్ అయ్యాయి.

ఘనంగా విజయ్, రష్మిక మ్యారేజ్
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మ్యారేజ్ ఘనంగా జరిగింది. గురువారం అటు హిందూ సాంప్రదాయం ప్రకారం, మరోవైపు కొడువ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి అనంతరం సాయంత్రం తమ మ్యారేజ్ ఫోటోలను పంచుకున్నారు విజయ్, రష్మిక. తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మాజీ ప్రియుడు రక్షిత్, అలాగే రిషబ్ శెట్టితో రష్మిక మందన్నా
ఇదే సమయంలో, నటి రష్మిక మందన్న, రక్షిత్ శెట్టిల విషయం మళ్లీ తెరపైకి వస్తోంది. రష్మికకు రక్షిత్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత శెట్టి కుటుంబం కొడగు టూర్‌కు వెళ్లింది. ఆ ట్రిప్‌లో రష్మిక, రక్షిత్, రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. ఆ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్‌తో పెళ్లి వేళ రష్మిక ఉన్న ఈ ఫోటోలు రచ్చ చేస్తున్నాయి.
రక్షిత్ శెట్టితో బ్రేకప్‌కు కారణం?
వరుస ఆఫర్లు రావడంతో రక్షిత్‌కి గుడ్ బై
ఆ తర్వాత, రష్మికకు అన్ని భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో ఎదుగుతూ వెళ్లింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆమె రక్షిత్‌కి గుడ్ బై చెప్పింది. ఆ మధ్య ఏం జరిగిందనేది సస్పెన్స్. కానీ రష్మిక పై చాలా రకాల విమర్శలు వచ్చాయి.
రక్షిత్ శెట్టిని రష్మిక వాడుకుందా?
ఈ సినీ ప్రపంచంలో బంధాలు, బ్రేకప్‌లు చాలా సాధారణమే. అయినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి రష్మిక.. రక్షిత్ శెట్టిని ఒక నిచ్చెనలా వాడుకుందనే ఆరోపణ ఉంది. ఆమె కన్నడలో స్టార్ హీరోయిన్‌గా, రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా ఎదగడానికి రక్షిత్ కారణమని అంటారు.
కన్నడనాట చర్చనీయాంశం రష్మిక, రక్షిత్ శెట్టి వ్యవహారం
అసలు నిజంగా ఏం జరిగిందనేది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. గాలి వార్తలు, ఊహాగానాలు ఎప్పటికీ కల్పితాలే. కానీ కన్నడ హీరో రక్షిత్ శెట్టికి రష్మిక బ్రేకప్ చెప్పిన విషయం మాత్రం ఇప్పుడు కన్నడ నాట చర్చనీయాంశం అవుతుంది.

