- Home
- Entertainment
- టాప్ 10 ఇండియా పాపులర్ హీరోయిన్లు.. రష్మిక, దీపికా, నయనతార ఎవ్వరు వచ్చినా ఆమెని టచ్ చేయలేరు
టాప్ 10 ఇండియా పాపులర్ హీరోయిన్లు.. రష్మిక, దీపికా, నయనతార ఎవ్వరు వచ్చినా ఆమెని టచ్ చేయలేరు
రష్మిక మందన్నా, దీపికా పదుకొనె, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు వరుస సినిమాలతో రచ్చ చేస్తున్నా, ఆ హీరోయిన్‌ని దాటలేకపోతున్నారు. ఆమె క్రేజ్ ముందు వెనకబడిపోతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇండియా టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితా
సినిమా పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా మారిపోతూనే ఉంటున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాన్ ఇండియా హీరోలు పుట్టుకొచ్చారు.
అంతేకాదు పాన్ ఇండియా హీరోయిన్లు కూడా వచ్చారు. హీరోలకే పాన్ ఇండియా పరిమితం కాదని, తాము కూడా ఇండియా వైడ్‌గా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. సత్తా చాటుతున్నారు.
రష్మిక మందన్నా, దీపికా పదుకొనె, కియారా అద్వానీ, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. అలరిస్తున్నారు. తన అందంతోపాటు అభినయంతో మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల టాప్ హీరో, హీరోయిన్ల జాబితాని విడుదల చేస్తోంది.
మే నెలకు సంబంధించిన హీరోయిన్ల జాబితా రిలీజ్ చేసింది. ఇండియా వైడ్‌గా టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో టాప్‌లో ఎవరు ఉన్నారు? ఎవరి స్థానం ఏంటి? అనేది తెలుసుకుందాం.
సమంతదే ఫస్ట్ ప్లేస్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితా ప్రకారం మే నెలలో సమంత టాప్‌లో ఉంది. ఇప్పుడే కాదు ఆమె గత ఐదారు నెలలుగా టాప్‌లోనే ఉంటోంది. హీరోల్లో ప్రభాస్ ఉన్నట్టుగానే, హీరోయిన్లలో సమంత టాప్‌లో ఉండటం విశేషం.
పాన్ ఇండియా చిత్రాలతో రష్మిక మందన్నా, నయనతార, దీపికా పదుకొనె, త్రిష వంటి హీరోయిన్లు సత్తా చాటుతున్నాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రాల్లో భాగమవుతున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ చేస్తున్నారు.
కానీ సమంతని మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. క్రేజ్, ఫాలోయింగ్, సోషల్ మీడియాలో డిస్కషన్, బ్రాండ్స్ ఇలా అన్ని విధాలుగానూ సమంత గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఆమె పేరు వైరల్‌గా మారుతుంది.
అందుకే సామ్ కంటిన్యూగా నెంబర్ వన్‌గా నిలుస్తోంది. అయితే సమంత వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. చివరగా ఆమె `ఖుషి` చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ కమ్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తోంది.
ఆ మధ్య తన తండ్రి మరణించిన విషయం తెలిసిందే. దాన్నుంచి బయటపడి మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇటీవల `శుభం` అనే చిత్రాన్ని నిర్మించింది. ఇది థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇలా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్లు కూడా సమంతని బీట్ చేయలేకపోవడం విశేషమనే చెప్పాలి.
రెండు, మూడు స్థానాల్లో అలియాభట్, దీపికా పదుకొనె
ఇక ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నిలిచింది. ఆమె గతంలోనూ కూడా అదే స్థానంలో ఉంది. తన పొజీషియన్‌ని పదిలంగా ఉంచుకుంది. అలియాభట్ చివరగా `జిగ్రా` చిత్రంలో నటించింది.
ఈ మూవీకి తనే నిర్మాత కూడా. ఇది పెద్దగా ఆడలేదు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో అలియాభట్ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో సీత పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఇక మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉంది. ఆమె `కల్కి 2898 ఏడీ` చిత్రంతో ఆకట్టుకున్నవిషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీలో ఆమె స్ట్రాంగ్ రోల్ చేసి మెప్పించింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో `ఏఏ22`లో నటిస్తుంది.
అట్లీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కానీ ఇందులోని దీపికా రోల్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది. ఇందులో దీపికా చేసే యాక్షన్ వాహ్ అనిపించింది.
సినిమాల్లేవ్ అయినా నాల్గో స్థానంలో కాజల్
ఇక ఆ తర్వాత స్థానాల్లో సౌత్ హీరోయిన్లు ఉన్నారు. కాజల్ నాల్గో స్థానంలో ఉంది. ఆమెకి ఇటీవల సినిమాలు లేవు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. అందుకే నాల్గో స్థానంలో నిలిచింది.
గత నెల కంటే తన స్థానం మెరుగుపర్చుకోవడం విశేషం. ప్రస్తుతం కాజల్ `కన్నప్ప` చిత్రంలో నటించింది. మరో ఐదు రోజుల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఐదో స్థానంలో త్రిష ఉంది. ఆమె ఇటీవల `థగ్ లైఫ్`తో అలరించింది.
ఇందులో కమల్ హాసన్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా నటించి ఆకట్టుకుంది. ఈ పాత్ర చేయడంపై ట్రోల్స్ కి గురయ్యింది కూడా. దీంతో త్రిష పేరు బాగా వినిపించింది. అంతకు ముందు `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంతో ఆకట్టుకుంది త్రిష.
ఆరో స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఉండటం విశేషం. ఆమె సౌత్ సెన్సేషన్ అనే విషయం తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా తన పాపులారిటీని చూపిస్తుంది నయనతార. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీలో నటిస్తోంది.
వెనక్కిపడిపోయిన నేషనల్ క్రష్
ఏడో స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి నిలిచింది. ఆమె చివరగా `తండేల్` చిత్రంలో నటించింది. ఇటీవల సాయిపల్లవికి సంబంించిన హడావుడి లేదు. బాలీవుడ్‌లో `రామాయణ్`లో నటిస్తుంది. ఈ మూవీతో అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది సాయిపల్లవి.
ఇక నేషనల్ క్రష్‌గా, ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరిస్తున్న రష్మిక మందన్నా మాత్రం ఎనిమిదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. వరుసగా సినిమాలు చేసే రష్మిక ఇంత తక్కువకి పడిపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
ఇటీవల కూడా ఆమె `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. తొమ్మిదో స్థానంలో శ్రీలీల నిలవడం విశేషం. ఆమె `పుష్ప 2`తో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ టాప్ 10 లిస్ట్ లో చోటుదక్కించుకుంది. ఇక పదో స్థానంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నిలిచింది. ఈ అమ్మడు గతంలో ప్రభాస్‌తో `సాహో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.