- Home
- Entertainment
- ఫ్యాన్స్ కి బ్యాడ్‌న్యూస్ చెప్పిన రష్మి గౌతమ్.. సోషల్ మీడియాకి బ్రేక్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఫ్యాన్స్ కి బ్యాడ్‌న్యూస్ చెప్పిన రష్మి గౌతమ్.. సోషల్ మీడియాకి బ్రేక్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాకి దూరమయ్యింది. నెల రోజులు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపింది. అందుకు కారణమేంటో ఆమె వెల్లడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us

జబర్దస్త్ షోతో యాంకర్‌గా రష్మి గౌతమ్ ఫేమస్
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తరచూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. ఆమె రెగ్యూలర్‌గా తన ఫోటోలు, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా డాగ్స్ కి ఏమైనా అయినా తట్టుకోలేదు.
జంతు ప్రేమికురాలిగా రాణిస్తోంది. ఇంకోవైపు జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తోంది రష్మి గౌతమ్. తాజాగా ఆమె తన అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపింది. రష్మి గౌతమ్ డిజిటల్ డిటాక్స్ పాటిస్తోంది. నెల రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది.
సోషల్ మీడియాకి రష్మి గౌతమ్ దూరం
ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ పెట్టింది. ఇందులో రష్మి గౌతమ్ చెబుతూ, `ఒక నెల రోజులపాటు డిజిటల్ డీటాక్స్ పాటించాలని అనుకుంటున్నా, వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.
అందులో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. కొన్నిసార్లు అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక విషయం అయితే వాగ్దానం చేస్తున్నా, కచ్చితంగా నేను మరింత దృఢంగా తిరిగి వస్తాను.
నేను వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ప్రభావం లేకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నేనూ కుంగిపోతున్నా.
కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. నేను మీకు అందుబాటులో లేకుండా, మీ ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా` అని వెల్లడించింది రష్మి గౌతమ్.
స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులు
దీంతో ఈ డిజిటల్ డీటాక్స్ ఏంటి? అసలు రష్మికి ఏమైంది అనేది ఆరా తీస్తున్నారు అభిమానులు. అదే సమయంలో రష్మి నెల రోజులపాటు సోషల్ మీడియాకి దూరం కాబోతుందని తెలిసి వారంతా ఆందోళన చెందుతున్నారు.
రెగ్యూలర్‌గా తమ గ్లామర్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో అలరించే రష్మి ఇలా తమకు దూరం అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మిస్ అవుతామని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు.
సోషల్ డీటాక్స్ అంటే ఏంటంటే?
మరి ఈ డిజిటల్ డీటాక్స్ ఏంటనేది చూస్తే, ఇది సింపుల్ సోషల్ మీడియాకి దూరంగా ఉండటమే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వచ్చాక సోషల్ మీడియా వాడకం చాలా పెరిగిపోయింది. రోజూ అందులోనే మునిగిపోతున్నారు జనాలు.
సోషల్ మీడియా వాడకం, వీడియోలు చూడటం, ఛాటింగ్ చేయడంతోనే రోజంతా గడిపేస్తున్నారు. ఇదొక రకమైన జబ్బులా మారుతుంది. బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ అవుతుంది. దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు.
నెల రోజుల పాటు రష్మి రెస్ట్
దీంతో దాన్నుంచి బయటపడే ప్రయత్నమే ఈ డిజిటల్ డీటాక్స్. వారంలో ఒకటి రెండు రోజులు ఈ ఫోన్‌కి, సోషల్ మీడియాకి దూరంగా ఉండటమే.
అవన్నీ పక్కన పెట్టి ఎనిమిది గంటలు పనిచేయడం, మరో ఎనిమిదిగంటలు ఇంట్లో ఫ్యామిలీతో గడపడం, లేదంటే స్నేహితులతో గడపడం, మరో ఎనిమిది గంటలు నిద్రపోవడం అనే కాన్సెప్ట్ లోకి వస్తున్నారు.
ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా ఇదే చేయబోతుంది. కాకపోతే ఏకంగా నెల రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతుండటం విశేషం. రష్మి గౌతమ్ ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తూ బిజీగా ఉంది.