- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: దివ్య కళ్ళు తెరిపించిన విక్రమ్ తాతయ్య.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రాములమ్మ?
Intinti Gruhalakshmi: దివ్య కళ్ళు తెరిపించిన విక్రమ్ తాతయ్య.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రాములమ్మ?
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. దౌర్జన్యంగా భర్తని తన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు ఈ మామయ్యకి కోడలుగా ఉండాలి అంటే విక్రమ్ కి దగ్గరగా ఉండాలి. కానీ నువ్వు ఆ పని చేయడం లేదు పంతానికి పోతున్నావు బంధాన్ని దూరం చేసుకుంటున్నావు అంటాడు విక్రమ్ తాతయ్య. ఇందులో నా తప్ప ఏమీ లేదు తాతయ్య విక్రమ్ తల్లి చెప్పినట్లు విని నన్ను దూరం పెడుతున్నాడు అంటుంది దివ్య. చేతిలో ఉన్న గాజు గున్నే జారిపోతే పగిలిపోతుంది అని తెలిసినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి.
ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవలు రావాలని రాజ్యలక్ష్మి నిన్ను రెచ్చగొడుతుంది. ముందు వెనుక చూసుకోకుండా నువ్వు రెచ్చిపోతున్నావు. మీ అత్తని లైన్ లోకి పెట్టేది నువ్వే అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఆ ఆశలు చచ్చిపోయాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తాతయ్య. మరోవైపు బ్యాగులు తీసుకొని బయలుదేరుతారు నందు దంపతులు. కోర్టుకి వెళ్తున్నావా అని అడుగుతాడు పరంధామయ్య.
వెళ్తున్నావా కాదు మావయ్య వెళ్తున్నారా అని అడగండి. ఎందుకంటే ఇద్దరం కలిసే వెళ్తున్నాము. ఆయన కోర్టులో మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం అని చెప్పబోతున్నారు. తీర్పు వెలువడిన వెంటనే మేము అట్నుంచి అటే వెళ్ళిపోతాము అంటుంది లాస్య. తను చెప్పేది నిజమేనా అని కంగారుగా అడుగుతాడు పరంధామయ్య. నిన్నే చెప్పాను కదా అంటాడు నందు. నిన్న ఏదో బాధలో చెప్పావు అనుకున్నాను ఈరోజు మనసు మార్చుకుంటావేమో అనుకున్నాను అంటాడు పరంధామయ్య.
తెల్లారగానే మార్చుకోవటానికి ఇదేమైనా పక్క మీద దుప్పటా అని వెటకారంగా అంటుంది లాస్య. వెళ్లనివ్వండమ్మా వాళ్ళు ఎక్కడున్నా వాళ్లు ప్రశాంతంగా ఉండటమే కదా మనకి కావాల్సింది అంటుంది రాములమ్మ. వాడి మొహం లో ఎక్కడైనా సంతోషం కనిపిస్తుందేమో చూడు అది బలవంతంగా వాడిని గుప్పెట్లో పెట్టుకుంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది అనసూయ.
నిర్ణయం వాడి చేతిలో లేనప్పుడు ఎందుకు వాడిని ఇబ్బంది పెడతావు. వాడు బెదిరించే వాళ్ళ మాటలు తప్ప బ్రతిమాలే వాళ్ల మాటలు పట్టించుకోడు అంటూ నిష్టూరంగా మాట్లాడుతాడు పరంధామయ్య. కోర్టుకి టైం అవుతుంది బయలుదేరుదాం అనుకుంటూ పరంధామయ్య దంపతుల ఆశీర్వచనం తీసుకుని బయలుదేరుతారు నందు దంపతులు.
మరోవైపు టీ పెడుతున్న దివ్య తాతగారి మాటలని గుర్తు చేసుకుంటూ తాతయ్య నాకర్థవ్యాన్ని నాకు బోధించారు. నేను విక్రమ్ కి దగ్గరగా ఉంటేనే అనుకున్నది సాధించగలను అనుకొని మనసు మార్చుకుని టీ తీసుకొని విక్రమ్ దగ్గరికి వెళ్తుంది దివ్య. అప్పటికే కోపంగా ఉన్న విక్రమ్ గార్డెనింగ్ చేస్తూ మొక్కల్ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే టీ తీసుకు వచ్చిన దివ్య అదేమీ నా పీక కాదు మొక్కలు జాగ్రత్తగా కత్తిరించండి.
ముందు ఈ టీ తీసుకోండి అంటుంది. నేను అడగలేదు కదా అంటాడు విక్రమ్. కొన్ని అడగకుండానే ఇవ్వాలి అంటూ అతనితో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది దివ్య కానీ ఆమెని దూరం పెడుతుంటాడు విక్రమ్. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి తను అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు తీసుకోవచ్చు కదా అంటుంది. కొడుకుని ఎక్కడ బుట్టలో వేసేసుకుంటానో అని వెనుక వెనకే తిరుగుతూ ఉంటుంది మహాతల్లి అప్పుడే వచ్చేసింది అని అత్తగారిని తిట్టుకుంటుంది దివ్య.
ఆమె తరఫున మాట్లాడటానికి దివ్య ఒకప్పటిది కాదమ్మా ఇప్పుడు మారిపోయింది. ఇంట్లో విషయాలన్నీ పుట్టింట్లోకి చేరవేస్తుంది అంటాడు విక్రమ్. పెళ్లయిన ప్రతి ఆడపిల్ల సానుభూతి కోసం తల్లితో చాడీలు చెప్తుంది. తెలివైన తల్లి అయితే కూతురికి బుద్ధులు చెప్తుంది. పొగరుబోతు తల్లి అయితే కూతురు అత్తింటిమీదకి గొడవకి వస్తుంది. అయినా దివ్య వాళ్ళ నాన్న ఈరోజు కోర్టుకి వెళ్తున్నారు. లాస్య తో కలిసి వేరే కాపురం పెడతారంట.
పాపం ఇకమీదట దివ్య వాళ్ళ నాన్నని చూడటానికి కుదరదు అంటూ తియ్యగా మాట్లాడుతూనే విక్రమ్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో కోర్టులో మాధవి భర్త నా క్లైంట్ ఇప్పటికీ విడాకులు కోరుకుంటున్నాడు అని చెప్తాడు. ఆశ్చర్య పోతుంది లాస్య. రాములమ్మ బోన్ లోకి వచ్చి లాస్యమ్మ నందు బాబుని బెదిరించారు. వాళ్ళ అమ్మ నాన్నగారికి పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చారు అని ట్విస్ట్ ఇస్తుంది రాములమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ చూద్దాం.