MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Folk Song : కేవలం 25 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ లో టాప్ లేపుతున్న మాస్ మసాలా ఫోక్ సాంగ్

Folk Song : కేవలం 25 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ లో టాప్ లేపుతున్న మాస్ మసాలా ఫోక్ సాంగ్

DJ Pilla Folk Songs : 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ', 'రాను బొంబైకి రాను' వంటి హిట్ ఫోక్స్ తో యూట్యూబ్ ను షేక్ చేశాడు రాము రాథోడ్. ఇప్పుడు డిజె పిల్ల అంటూ దుమ్ము రేపుతున్నాడు.

2 Min read
Author : Arun Kumar P
Published : May 26 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ట్రెండింగ్ ఫోక్ సాంగ్...
Image Credit : Screenshot to Whistle Studios and Rathod Tunes

ట్రెండింగ్ ఫోక్ సాంగ్...

Trending Folk Song : ప్రస్తుతం సినిమా పాటలకంటే జానపద పాటలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చిన ఫోక్ సాంగ్స్ అనేకం ఉన్నాయి. తమ జీవితానికి దగ్గరగా ఉండే జానపద పాటలకు తెలుగు ప్రజలు పట్టం కడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ', 'రాను బొంబైకి రాను' వంటి పాటలో ప్రజల్లోకి బలంగా వెళ్లి యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు హిట్ పోక్స్ ఒక్కరు రూపొందించినవే.

తన జానపద పాటలు, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాము రాథోడ్. ఓ సాధారణ బంజారా బిడ్డను బిగ్ బాస్ వంటి ప్రతిష్ఠాత్మక రియాలిటీ షో కు తీసుకెళ్లింది ఈ జానపద పాటలే. ''రాను బొంబైకి రాను'' హిట్ సాంగ్ తర్వాత రాము రాథోడ్ నుండి మరో అద్భుతమైన డిజె పిల్ల సాంగ్ వచ్చింది. ఇటీవలే యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది... రోజుకు లక్షకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అదరగొడుతున్న డిజె పిల్ల సాంగ్..
Image Credit : Screenshot to Whistle Studios and Rathod Tunes

అదరగొడుతున్న డిజె పిల్ల సాంగ్..

కళ్ళాకు రేబాన్ యెట్టూకూనీ...

కాళ్లాకూ రిబ్బాను చుట్టూకూనీ...

వచ్చిందండీ వయ్యారీ.. అబ్బో వచ్చేయరా ఓరీ వారీ...

డుగ్గుడుగ్గు... ఏ డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గు..

డిజె పిల్ల ఓ డిజె పిల్ల.. నేను స్టేప్పులెస్తే డప్పలాయె గుండెలు మళ్లా..నేను డిజె పిల్లా...

ఇలా అదిరిపోయే లిరిక్స్ తో సాగుతుంది డిజె పిల్ల సాంగ్. అసలు జీవితంలో ఒక్కసారి కూడా స్టెప్పులేయని వారితో కూడా డ్యాన్స్ చేయించేలా మాస్ మసాలా మ్యూజిక్ ఉంటుంది. మొత్తంగా జెంజీ యువతను టార్గెట్ గా చేసుకుని రూపొందించిన ఈ ఫోక్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.  

ఇప్పటికే రాము రాథోడ్ పాటలకు అభిమానులు ఉన్నారు. వారి టేస్ట్ కు తగ్గట్లుగానే ఉంటుంది ఈ డిజె పిల్ల సాంగ్. ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ పాట రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, బరాత్ లతో గట్టిగా వినిపించనుంది. ఈ డిజె పిల్ల సాంగ్ దెబ్బకు డిజేలు హీటెక్కడం, యువత ఉర్రూతలూగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!
Related image2
Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం
33
డిజె పిల్ల సాంగ్ టీమ్ ఇదే..
Image Credit : Screenshot to Whistle Studios and Rathod Tunes

డిజె పిల్ల సాంగ్ టీమ్ ఇదే..

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ రాము రాథోడ్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ విజిల్ స్టూడియోస్ ఆండ్ రాథోడ్ ట్యూన్స్ లో ఈ పాట విడుదలయ్యింది. ఈ నెల ఆరంభంలో (మే 1న) విడుదలచేయగా ఇప్పటివరకు 2.5 మిలియన్స్ అంటే 2516369 వ్యూస్ తో దూసుకుపోతోంది. అంటే రోజుకు లక్షమందికి పైగా ఈ పాటను చూస్తున్నారన్నమాట. విన్నవారిలో 37 వేలమంది లైక్ చేశారు.

దేవ్ పవర్ అందించిన మాస్ లిరిక్స్ కు మదీన్ ఎస్కే మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది... దీంతో ఈ పాట మరోస్థాయికి వెళ్లింది. ఇక రాము రాథోడ్, వాగ్దేవీ వాయిస్ ప్లస్ అయ్యింది. ఢీ ఫేమ్ రామ్ మాస్టర్ కొరియోగ్రఫి... రాము రాథోడ్, ప్రాచీ స్టెప్పులు మరోస్థాయికి చేర్చాయి. అన్నీ సరిపోవడంతోనే డిజె పిల్ల సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Related Stories
Recommended image1
Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!
Recommended image2
Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved