- Home
- Entertainment
- రేర్ ఫోటోలు: పవన్, మహేష్, ఎన్టీఆర్, రాజమౌళితో పాటు ఇతర సినీ ప్రముఖులతో రామోజీ రావు.. యంగ్ లుక్ వైరల్
రేర్ ఫోటోలు: పవన్, మహేష్, ఎన్టీఆర్, రాజమౌళితో పాటు ఇతర సినీ ప్రముఖులతో రామోజీ రావు.. యంగ్ లుక్ వైరల్
టాలీవుడ్ సెలెబ్రిటీలతో రామోజీరావు ఉన్న రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.

మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పారిశ్రామిక వేత్తగా, మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
మీడియా రంగంలోనే కాదు సినిమా రంగంలో కూడా రామోజీ రావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని ఆయన నిర్మించారు.
రామోజీ రావు ఎందరో నూతన దర్శకులు, నటీనటుల్ని ప్రోత్సహించారు. 1984లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవారి ప్రేమ లేఖ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీ రావు నిర్మాతగా మారారు.
రామోజీరావుతో టాలీవుడ్ సెలెబ్రిటీలందరికి మంచి అనుబంధం ఉంది. రాజమౌళి, రాఘవేంద్ర రావు లాంటి వారు రామోజీరావు ని ఎంతో గౌరవిస్తారు. చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య ఇలా సీనియర్స్ తో ఆయన ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వారితో కూడా రామోజీరావు కి మంచి అనుబంధం ఉంది. వివిధ సందర్భాల్లో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా రామోజీరావు ని కలుసుకున్నారు.
టాలీవుడ్ సెలెబ్రిటీలతో రామోజీరావు ఉన్న రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.
మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణం రామోజీరావు గారు.. ఆయన వేలాదిమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికీ భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించడం సముచితం అని రాజమౌళి అన్నారు.
రామోజీరావుకి నివాళులు అర్పించిన అనంతరం రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులంతా వెళ్లి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి కూడా రామోజీరావుతో మంచి అనుబంధం ఉంది. ఈటివి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సెలెబ్రేషన్స్ కి పవన్ అతిథిగా హాజరై రామోజీ రావు తో వేదిక పంచుకున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీ రావే. ఎన్టీఆర్ తొలి చిత్రం నిన్ను చూడాలని చిత్రాన్ని రామోజీ రావు నిర్మించారు. ఈనాడు పత్రిక స్థాపించి మీడియా రంగంలో ఒక సామ్రాజ్యాన్నే రామోజీరావు నిర్మించారు.
రామోజీరావు యంగ్ లుక్ లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో కలసి ఉన్న ఫొటోస్ ని అభిమానులు షేర్ చేస్తున్నారు.