MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లని పరిచయం చేసింది రామోజీ రావే.. ఆయన నిర్మించిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే 

ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లని పరిచయం చేసింది రామోజీ రావే.. ఆయన నిర్మించిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే 

మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మీడియా రంగంలోనే కాదు సినిమా రంగంలో కూడా రామోజీ రావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని ఆయన నిర్మించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 08 2024, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిశ్రామిక వేత్తగా, మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ramoji rao

ramoji rao

మీడియా రంగంలోనే కాదు సినిమా రంగంలో కూడా రామోజీ రావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని ఆయన నిర్మించారు. రామోజీ రావు ఎందరో నూతన దర్శకులు, నటీనటుల్ని ప్రోత్సహించారు. 

36

1984లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవారి ప్రేమ లేఖ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీ రావు నిర్మాతగా మారారు. నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిఘటన, మయూరి లాంటి చిత్రాలని కూడా నిర్మించారు. 

46

2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా ఆయన జోరు పెంచారు. కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా రామోజీ రావుకి దక్కుతుంది. కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాలేదు.. అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలని కూడా రామోజీ రావు నిర్మించారు. నూతన దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ లని పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన చిత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

56

ఈ మూవీ తర్వాత డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తరుణ్ ని హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీ రావే. ఆయన నిర్మాణంలో తరుణ్ నటించిన నువ్వే కావాలి చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. 

66

హీరోలు మాత్రమే కాలేదు హీరోయిన్లని కూడా రామోజీ రావు పరిచయం చేశారు. రీమా సేన్, రిచా పల్లోడ్, స్టార్ హీరోయిన్ శ్రీయ శరన్.. రామోజీ రావు నిర్మాణంలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ ని ప్రారంభించింది రామోజీ రావు నిర్మించిన చిత్రంతోనే. 2001లో విడుదలైన నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ హీరో అయ్యారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఉదయ్ కిరణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved